Bank Account: బ్యాంక్ అకౌంట్ వాడనివారికి అలర్ట్.. భారీగా జరిమానా.. ఈ పని చేయకపోతే ఇబ్బందులే..
ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు మీరు కలిగి ఉన్నారా.. అయితే మీరు వినియోగిస్తున్నారా.. లేదా.. ఒకవేళ ఉపయోగిస్తే పర్లేదు. వినియోగించకపోతే మీరు జరిమానా కట్టాల్సి ఉంటుంది. దీని వల్ల మీరు ఆర్ధికంగా నష్టపోయే అవకాశముంది. ఈ టిప్స్ పాటిస్తే మీరు లాభపడతారు.

వివిధ అవసరాల కోసం ఒకటి రెండు అంతకంటే బ్యాంక్ అకౌంట్లను వాడేవారు చాలామంది ఉంటారు. వ్యక్తిగత, పెట్టుబడి, ఉద్యోగం, వ్యాపార అవసరాల కోసం ఎక్కువ బ్యాంక్ ఖాతాలను వినియోగిస్తూ ఉంటారు. ఇక ఉద్యోగం మారినప్పుడు శాలరీ పొందేందుకు వేర్వేరు బ్యాంక్ అకౌంట్లు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే శాలరీ అకౌంట్‌లో కొన్ని రోజుల పాటు డబ్బులు పడకపోతే అది సాధారణ సేవింగ్స్ ఖాతాగా మారిపోతుంది. అలాంటప్పుడు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే బ్యాంకులు జరిమానా విధిస్తూ ఉంటాయి. దీని వల్ల మీరే నష్టపోయే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూద్దాం.
జరిగే నష్టాలివే..
ఎక్కువ బ్యాంక్ అకౌంట్లను కలిగి ఉన్నప్పుడు అన్ని అకౌంట్లలో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం సాధ్యపడదు. ఇలాంటి సమయంలో బ్యాంకులు పెద్ద మొత్తంలో జరిమానా విధిస్తూ ఉంటాయి. దీని వల్ల మీరు ఆర్ధికంగా నష్టపోతారు. బ్యాంకుల అదనపు ఛార్జీల వల్ల మీరు డబ్బులు కోల్పోతారు. ఇలాంటి సమయంలో అవసరం లేని, ఉపయోగించని బ్యాంక్ అకౌంట్లను క్లోజ్ చేసుకోవాలి. కొన్ని బ్యాంకులు ఆన్లైన్‌లో అకౌంట్‌ను క్లోజ్ చేసుకునే సదుపాయం కల్పిస్తున్నాయి. మరికొన్ని బ్యాంకులు ఆఫ్‌లైన్ విధానాన్ని పాటిస్తున్నాయి.
ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం
బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేయాలంటే అకౌంట్ క్లోజర్ ఫారం నింపాలి. ఉపయోగించని చెక్ బుక్, డెబిట్ కార్డులు పనిచేయకుండా రద్దు చేసుకోవాలి. ఇక ఆధార్, పాన్ కార్డు వంటివి అందించాలి. బ్యాంక్ పాస్‌బుక్‌ను తిరిగి అందించాలి. ఈ పత్రాలన్నీ సమర్పిస్తే మీ బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేశారు. ఆ అకౌంట్‌లో మీ డబ్బులు మిగిలి ఉంటే తిరిగి ఇచ్చేస్తారు. ఇక జరిమానాలు ఉంటే అవి చెల్లించాక క్లోజ్ చేస్తారు.
ఆర్బీఐ నియమాలు
ఆర్బీఐ నియమాలు ఏం చెబుతున్నాయంటే.. అకౌంట్ ఓపెన్ చేసిన 14 రోజుల్లోపు క్లోజ్ చేస్తే ఎలాంటి ఛార్జీలు ఉండవ్. 15 రోజుల తర్వాత నుంచి ఏడాదిలోపు మూసివేస్తే రూ.500+జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఏడాది తర్వాత మూసివేస్తే ఎలాంటి ఛార్జీలు ఉండవు. ఇక అకౌంట్ తీసుకున్నవారు మరణిస్తే ఎలాంటి ఛార్జీలు ఉండవు. బ్యాంక్ బ్రాంచ్‌ను సంప్రదించి మీరు అకౌంట్ క్లోజ్ చేయించుకోవాల్సి ఉంటుంది. బ్యాంక్‌కు వెళ్లగానే క్లోజింగ్ ఫారం అందిస్తారు. అది పూర్తి చేశాక డాక్యుమెంట్ సమర్పించాలి. ఆ తర్వాత సిబ్బంది వివరాలు పరిశీలించి అకౌంట్ మూసివేస్తారు. మీ డెబిట్ కార్డ్ బ్లాక్ చేస్తారు. ఇక మిగతా ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్ లాగిన్స్ కూడా బ్లాక్ చేస్తారు.
