AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: ట్రైన్ మొత్తం లేదా కోచ్‌లను కూడా మీరు బుక్ చేసుకోవచ్చు.. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ నుంచే.. ఒక్క క్లిక్‌తో

టూర్ లేదా ఫంక్షన్‌కు ఎక్కువమంది వెళ్తున్నారా..? బస్సులు, కార్లే కాదు. ట్రైన్లను కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. ఐఆర్‌సీటీసీ మీకు అవకాశం కల్పిస్తోంది. రైల్వేశాఖ అందించే ఈ సేవల గురించి చాలామందికి తెలియదు. ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్ ద్వారా మీరు సులువుగా బుక్ చేసుకోవచ్చు.

Indian Railways: ట్రైన్ మొత్తం లేదా కోచ్‌లను కూడా మీరు బుక్ చేసుకోవచ్చు.. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ నుంచే.. ఒక్క క్లిక్‌తో
Indian Railway
Venkatrao Lella
|

Updated on: Mar 15, 2026 | 10:20 AM

Share

ఏదైనా శుభకార్యాలు లేదా టూర్లకు ఫ్యామిలీ, బంధుమిత్రులు కలిసి వెళ్లేందుకు బస్సులు, కార్లు బుక్ చేసుకోవడం మనకు తెలిసిందే. ఆర్టీసీ లేదా ప్రైవేట్ బస్సులను మీరు బుక్ చేసుకోవచ్చు. మీకంటూ ప్రత్యేక బస్సులు కేటాయిస్తారు. ఫంక్షన్లకు ఒకేసారి ఎక్కువమంది వెళ్లాలనుకున్నప్పుడు బస్సులను ప్రత్యేకంగా బుకింగ్ చేసుకుంటారు. ఇక లాంగ్ ట్రిప్‌లకు ఎక్కడికైనా వెళ్లాల్సి వచ్చినా ఇదే విధానం పాటిస్తారు. ఇక బస్సులతో పాటు కార్లను కూడా బుక్ చేసుకుంటూ ఉంటారు. అయితే వీటి తరహాలోనే మీరు ట్రైన్లను బుక్ చేసుకోవచ్చు. ట్రైన్ మొత్తాన్ని లేదా కోచ్‌లను బుకింగ్ చేసుకునే సదుపాయం రైల్వేశాఖ కల్పిస్తోంది. ఎప్పటినుంచో ఈ విధానం ఉండగా.. చాలామందికి తెలియదు. ఎలా బుక్ చేసుకోవాలి..? దీనికి ఎలాంటి రూల్స్ ఉంటాయి? అనే విషయాలు తెలుసుకుందాం.

ఎన్ని బుక్ చేసుకోవచ్చు..?

ఐఆర్‌సీటీసీ ఎఫ్‌టీఆర్ వెబ్‌సైట్‌ను సంప్రదించాలి. అందులోకి వెళ్లి మీరు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఒక రైలులో గరిష్టంగా రెండు బోగీల వరకు పొందవచ్చు. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బోగీలను బుక్ చేసుకోవాలంటే ట్రైన్ 10 నిమిషాలు ఆగే రైల్వే స్టేషన్ల నుంచి మాత్రమే బుకింగ్‌కు అవకాశం కల్పిస్తారు. ఇక ట్రైన్ మొత్తం కూడా బుక్ చేసుకోవచ్చు. మీ ప్రయాణ అవసరాలు, సాధ్యాసాధ్యాలను బట్టి కనిష్టంగా 18 బోగీలు, గరిష్టంగా 24 బోగీలు బుక్ చేసుకోవచ్చు.

బుకింగ్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్

-ఐఆర్‌సీటీసీ ఎఫ్టీఆర్ వెబ్ సైట్‌కు వెళ్లండి

-మీ సమాచారం ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోండి

-ఆప్షన్స్‌లో కోచ్ కావాలా లేదా ట్రైన్ మొత్తమా అనేది సెలక్ట్ చేసుకోవాలి

-కోచ్ కావాలంటే కోచ్‌లు అనే ఆప్షన్ ఎంచుకోవాలి

-ట్రైన్ మొత్తం అయితే ట్రైన్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి

-ఏ కారణంతో బుక్ చేసుకుంటున్నారు అనేది ఎంపిక చేసుకోవాలి

-మ్యారేజ్ పర్పస్ అయితే మ్యారేజ్ ఆప్షన్, టూర్ అయితే టూర్ అనేది ఎంపిక చేసుకోవాలి

-ఆ తర్వాత స్లీపర్, ఏసీ 2 టైర్, 3 టైర్, ఫస్ట్ క్లాస్ అనేది సెలక్ట్ చేసుకోవాలి

-ఏ స్టేషన్‌ నుంచి ఏ స్టేషన్ వరకు అనేది ఎంచుకోవాలి

-జర్నీ డేట్‌ను ఎంపిక చేసుకోవాలి

-సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి

-వారం రోజుల తర్వాత మీకు కన్ఫర్మేషన్ మెస్సేజ్ అందుతుంది

-కన్ఫర్మేషన్ మెస్సేజ్ వస్తేనే మీకు బుకింగ్ అయినట్లు అర్థం

ఎన్ని రోజుల ముందు చేసుకోవాలి..?

30 రోజుల ముందే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక గరిష్టంగా ఆరు నెలల ముందుగా కూడా బుకింగ్ చేసుకోవచ్చు. ఒక్కొ కోచ్‌కు గరిష్టంగా రూ.50 వేలు సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇక 18 బోగీలకు అయితే రూ.9 లక్షలు చెల్లించాలి.

Follow Us