అనాథాశ్రమంలో ఉండే యువతులతో పెళ్లంటే ఎగిరి గంతేసిన యువకులు.. చివరికి..
మధ్యప్రదేశ్‌లో 42 మంది పెళ్లికొడుకులను లక్ష్యంగా చేసుకుని భారీ వివాహ మోసం వెలుగులోకి వచ్చింది. అనాథాశ్రమంలోని యువతులతో సామూహిక వివాహాలు జరిపిస్తామని నమ్మించి ఒక్కో కుటుంబం నుంచి వేల రూపాయలు వసూలు చేశారు. తీరా పెళ్లి రోజున వధువులు రాకపోవడంతో బాధితులు మోసపోయినట్లు గుర్తించారు. ఈ కేసులో ప్రధాన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
మధ్యప్రదేశ్‍లో కొందరు తల్లిదండ్రులు తమ కొడుకులకు సరైన సంబంధాలు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. సరిగ్గా ఆ పరిస్థితిని ఆసరగా చేసుకున్న కొంత మంది కేటుగాళ్లు ఇండోర్‍లోని ఒక అనాథాశ్రమంలో ఉన్న యువతులతో దేవాస్ నగరంలో మే 25న సామూహిక వివాహాలు జరిపించబోతున్నామని నమ్మించారు. వీరిలో మీ కుమారులకు సరైన జోడి వెతుక్కోండి అంటూ సోషల్ మీడియాలో నుంచి డౌన్ లోడ్ చేసిన అందమైన మోడల్స్, అమ్మాయిల ఫోటోలను వారికి చూపించారు. ఆ ఫోటోలను చూసిన తల్లిదండ్రులు తమకు నచ్చిన అమ్మాయిల ఫోటోలను సెలెక్ట్ చేసుకున్నారు. దాంతో పెళ్లి ఖర్చుల నిమిత్తం ఒక్కో వరుడి కుటుంబం నుంచి రూ.12 వేల నుంచి రూ. 25 వేల వరకు ఇలా మొత్తం లక్షల్లో సదరు కేటుగాళ్లు వసూలు చేశారు. మే 25వ తేదీన దేవాస్‍లో జరగబోయే సామూహిక వివాహాలకు పెళ్లి కూతుళ్లను తీసుకువస్తామని చెప్పారు. వరుడి తరపువారు నేరుగా 24వ తేదీన అక్కడికి రావాలని చెప్పారు. రాధా గంజ్‍లోని క్లబ్ గ్రౌండ్‍లో వసతి కూడా ఏర్పాటు చేస్తామని ఆ కుటుంబాలకు నమ్మబలికారు. ఇన్నాళ్లు సరైన సంబంధాలు దొరకక ఇబ్బంది పడ్డ తమ కుటుంబంలోకి అందమైన అమ్మాయి కోడలుగా రాబోతోందంటూ ఆ 42 కుటుంబాలు ఎంతో సంతోషంతో ఎగిరిగంతేశాయి. నిర్వాహకుల మాటలు నమ్మి మే 24వ తేదీ ఉదయమే పెళ్లికొడుకులు, వారి బంధువులు ముస్తాబై దేవాస్‍లోని క్లబ్ గ్రౌండ్‌కు చేరుకున్నారు. తీరా అక్కడికి వెళ్లేసరికి పెళ్లి ఏర్పాట్లు కానీ, ఆ వాతావరణ కానీ కనపడలేదు. అసలు పెళ్లి కూతుళ్ల జాడే లేదు. దీంతో బాధితులు నిర్వాహకులను నిలదీయగా..ఇండోర్ నుంచి పెళ్లి కూతుళ్లు బయలుదేరారని ఇదిగో వస్తున్నారు.. అదిగో వస్తున్నారంటూ ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు కాలయాపన చేశారు. చివరకు రాత్రి వేళ ఫోన్లు స్విచ్చాఫ్ కావడంతో తాము మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. తాళి కట్టి తమ భార్యలను ఇంటికి తీసుకు వెళ్దామని ఆశగా వచ్చిన పెళ్లి కొడుకులకు తీవ్ర నిరాశ ఎదురైంది. నమ్మించిన కేటుగాళ్లు ఏకంగా 42 కుటుంబాలకు కుచ్చుటోపీ పెట్టారు. తాళికట్టేందుకు నేరుగా పెళ్లిపందిట్లోకే రావాలంటూ కబురు పెట్టి అందినకాడికి అమాంతం దోచుకెళ్లారు. ఆ మోసాన్ని చూసి బాధిత కుటుంబాలు నివ్వెరపోయాయి. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రధాన నిందితులు ముఖేష్ బైరాగి, అతని భార్య సునీతను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితులంతా విదిశా జిల్లాకు చెందిన వారని, వారి పూర్తి వివరాల కోసం ఒక బృందాన్ని అక్కడికి పంపామని తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బార్‌లో బీరు సీసాలతో రచ్చ.. తల పగిలినా కూల్‌గా ‘లాస్ట్ పెగ్’ వేసి
Jio: జియో బంపర్ ఆఫర్..కేవలం రూ.200కే అన్నీ..!
ఉద్యోగం పోయిందని సంబరాలు.. “ఇప్పుడే నా జీవితం మొదలైంది” అంటున్న యువతి
అనాథాశ్రమంలో ఉండే యువతులతో పెళ్లంటే ఎగిరి గంతేసిన యువకులు
బార్‌లో బీరు సీసాలతో రచ్చ.. తల పగిలినా కూల్‌గా 'లాస్ట్ పెగ్' వేసి
ఉద్యోగం పోయిందని సంబరాలు..
మృత్యువు ఇలా కూడా వస్తుందా..! భోజనం చేస్తుండగానే
పెళ్లిలో వినూత్న ‘రిటర్న్ గిఫ్ట్’..
‘ఇండియన్స్ అంటే.. అక్కడ కూలీలే
పొట్ట ఉబ్బిపోయి కదల్లేకుండా.. కనిపించిన కొండచిలువ

