AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shankar: పాపం.. శంకర్‌కు ఎంత కష్టమొచ్చిందో..?

Shankar: పాపం.. శంకర్‌కు ఎంత కష్టమొచ్చిందో..?

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: May 30, 2026 | 2:50 PM

Share

S. Shankar ఇటీవల ఎదురైన పరాజయాల తర్వాత తన కెరీర్‌ను తిరిగి గాడిలో పెట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ ‘వేల్పరి’కి ముందు తక్కువ బడ్జెట్‌తో ఓ యూత్‌ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం విజయవంతమైతే ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్‌కు మార్గం సుగమం కానుందని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

ఏమాటకామాటే.. సినిమా ఇండస్ట్రీ చాలా క్రూయల్.. గతం ఎంతో ఘనంగా ఉన్నా ప్రస్తుతం మనమేంటి అనే అడుగుతారిక్కడ. కావాలంటే శంకర్‌ను చూడండి.. లెజెండరీ దర్శకుడైనా వరస ఫ్లాపులతో మళ్లీ మొదటికొచ్చారు. తనను తాను నిరూపించుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నారీయన. పాతికేళ్ళ కింద చేసిన పనే.. మళ్లీ ఇప్పుడు చేయబోతున్నారు శంకర్. ఇంతకీ ఈయనేం చేయబోతున్నారు..? ఒక్క ఫ్లాప్.. ఒకే ఒక్క ఫ్లాప్ శంకర్ కెరీర్ మొత్తాన్ని తలకిందులు చేసింది. గేమ్ ఛేంజర్ తర్వాత శంకర్ కెరీర్ డైలమాలో పడిపోయింది. అప్పటి వరకు ఆయన ఏం చెప్పినా నమ్మిన నిర్మాతలు.. ఆ తర్వాత ఆలోచిస్తున్నారు. ఈ టైమ్‌లో శంకర్‌ను నమ్మి వందల కోట్లు పెట్టే నిర్మాత ఉన్నాడా అంటే కాస్త అనుమానమే. అందుకే తనను తాను నిరూపించుకునే పనిలో పడ్డారీయన. శంకర్ టాలెంట్ మీద, మేకింగ్ మీద ఎవరికీ అనుమానాల్లేవు. కాకపోతే సక్సెస్ లేదు కాబట్టి గతమెంత ఘనంగా ఉన్నా నెక్ట్స్ ఏదీ వర్కవుట్ అవ్వట్లేదు. వేల్పరి సినిమాను 1000 కోట్లతో చేస్తానని ఆ మధ్య ప్రకటించినా.. అది ముందుకు కదలట్లేదు. అది కదలాలంటే దానికంటే ముందు ఓ సినిమా చేసి హిట్ కొట్టాలి.. అందుకే బాయ్స్ తరహాలో ఓ యూత్ ఫుల్ సినిమా చేయాలనుకుంటున్నారు శంకర్. మరీ వందల కోట్లతో కాకుండా.. కాస్త తక్కువ బడ్జెట్‌లో ఓ యాక్షన్ థ్రిల్లర్ ప్లాన్ చేస్తున్నారు శంకర్. దీని ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా మొదలైనట్లు తెలుస్తుంది. అన్నీ కుదిర్తే త్వరలోనే 2026లోనే సినిమా సెట్స్‌పైకి రానుంది. ఈ సినిమా హిట్టైతే.. శంకర్ డ్రీమ్ ప్రాజెక్ట్ వేల్పరికి దారి దొరికినట్లే. మరి చూడాలిక.. శంకర్ మళ్ళీ ఫామ్‌లోకి వస్తారా.. ఒకప్పట్లా సంచలనాలు సృష్టిస్తారా..?

 

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బార్‌లో బీరు సీసాలతో రచ్చ.. తల పగిలినా కూల్‌గా ‘లాస్ట్ పెగ్’ వేసి

Jio: జియో బంపర్‌ ఆఫర్‌..కేవలం రూ.200కే అన్నీ..!

ఉద్యోగం పోయిందని సంబరాలు.. “ఇప్పుడే నా జీవితం మొదలైంది” అంటున్న యువతి

మార్స్ లో మనుషులు జీవించడానికి మొదటి అడుగు!

మృత్యువు ఇలా కూడా వస్తుందా..! భోజనం చేస్తుండగానే

Follow Us