AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suriya: కరుప్పుతో కమ్‌బ్యాక్.. ఇప్పుడు సూర్యకు అసలైన పరీక్ష మొదలు

Suriya: కరుప్పుతో కమ్‌బ్యాక్.. ఇప్పుడు సూర్యకు అసలైన పరీక్ష మొదలు

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: May 30, 2026 | 3:18 PM

Share

కరుప్పు విజయంతో సూర్య మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. అయితే ఇప్పుడు ఆయన ముందున్న అసలు సవాల్ విశ్వనాథ్ అండ్ సన్స్. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై తెలుగులో భారీ అంచనాలు ఉన్నాయి. కానీ సార్, కుబేరా తరహాలో కాకుండా తమిళ ప్రేక్షకులను కూడా మెప్పించాల్సిన బాధ్యత సూర్యపై ఉంది. ఈ సినిమా ఆయన సొంత మార్కెట్‌లో సత్తా చాటుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది.

కరుప్పు సినిమాతో దాదాపు పుష్కరం తర్వాత బ్లాక్‌బస్టర్ కొట్టారు సూర్య.. అన్నీ బానే ఉన్నాయి.. పరిస్థితులు కూడా బాగానే కలిసొస్తున్నాయి. కానీ ఒక్క విషయం మాత్రం సూర్యను బాగా కంగారు పెడుతుంది. విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాతోనే దానికి పరిష్కారం కనుక్కోవాలని చూస్తున్నారీయన. మరి సూర్యను ఇబ్బంది పెడుతున్న ఆ ఇష్యూ ఏంటి..? భారీ అంచనాల మధ్య వచ్చిన కంగువా, రెట్రో లాంటి సినిమాలు ఫ్లాపైనా.. సైలెంట్‌గా వచ్చిన కరుప్పు మాత్రం సంచలన విజయం సాధించింది. ఈ సినిమా ఏకంగా 250 కోట్లు దాటేసి.. 300 కోట్ల వైపు పరుగులు పెడుతుంది. ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో విశ్వనాథ్ అండ్ సన్స్‌తో రాబోతున్నారు సూర్య. ఆగస్ట్ 14న విడుదల కానుంది ఈ చిత్రం. వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాపై తమిళం కంటే తెలుగులోనే అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. దానికి వెంకీ ట్రాక్ రికార్డే కారణం. అయితే ఇక్కడే సూర్య ముందు ఓ సవాల్ ఉంది. విశ్వనాథ్ అండ్ సన్స్‌తో తెలుగు కంటే తమిళ ఆడియన్స్‌ను మెప్పించాలి. ఎందుకంటే గతంలో ధనుష్ నటించిన కుబేరా, సార్ తమిళంతో పోలిస్తే తెలుగులోనే బాగా ఆడాయి. సార్ తెలుగులో బ్లాక్‌బస్టర్.. తమిళంలో మాత్రం జస్ట్ హిట్ అంతే. ఇక కుబేరా అరవంలో అంతగా మెప్పించలేదు. సూర్య ముందు ఈ గండాన్ని దాటాలి.. విశ్వనాథ్ అండ్ సన్స్‌తో సొంత ఆడియన్స్‌ను మెప్పించాలి. గతంలో విజయ్ మాత్రమే వంశీ పైడిపల్లి తెరకెక్కించిన వారసుడుతో తెలుగు కంటే తమిళంలోనే మ్యాజిక్ చేసారు. అది సూర్య రిపీట్ చేస్తారా లేదా అనేది చూడాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బార్‌లో బీరు సీసాలతో రచ్చ.. తల పగిలినా కూల్‌గా ‘లాస్ట్ పెగ్’ వేసి

Jio: జియో బంపర్‌ ఆఫర్‌..కేవలం రూ.200కే అన్నీ..!

ఉద్యోగం పోయిందని సంబరాలు.. “ఇప్పుడే నా జీవితం మొదలైంది” అంటున్న యువతి

మార్స్ లో మనుషులు జీవించడానికి మొదటి అడుగు!

మృత్యువు ఇలా కూడా వస్తుందా..! భోజనం చేస్తుండగానే

Follow Us