AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓవర్సీస్‌లో పెద్ది టార్గెట్ ఎంతో తెలుసా..? భుజాలపై భారీ బాధ్యత

ఓవర్సీస్‌లో పెద్ది టార్గెట్ ఎంతో తెలుసా..? భుజాలపై భారీ బాధ్యత

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: May 30, 2026 | 3:21 PM

Share

కొవిడ్ తర్వాత తెలుగు సినిమాల ఓవర్సీస్ మార్కెట్‌లో మునుపటి జోష్ కనిపించడం లేదు. భారీ అంచనాలతో వస్తున్న పెద్ది సినిమాపై ఇప్పుడు అందరి దృష్టి పడింది. నార్త్ అమెరికాలో 6 మిలియన్ డాలర్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో బరిలోకి దిగుతున్న ఈ చిత్రం, రికార్డు బుకింగ్స్‌తో దూసుకుపోతోంది. పెద్ది విజయవంతమైతే తెలుగు సినిమాల USA మార్కెట్‌కు మళ్లీ కొత్త ఊపు రావొచ్చని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

తెలుగు సినిమా USA మార్కెట్ ఎలా ఉంది..? అదేంటి కొత్తగా అడుగుతున్నారు ఓవర్సీస్ మార్కెట్ బాగానే ఉంది కదా అనుకోవచ్చు. కానీ కొన్నేళ్లుగా నార్త్ అమెరికాలో మన సినిమాలు ఊహించినంత అయితే ఆడట్లేదు. మరి ఈ సమయంలో వస్తున్న పెద్ది పరిస్థితేంటి..? దాని టార్గెట్ ఎంత..? అసలు ఈ మధ్య మన సినిమాల పర్ఫార్మెన్స్ ఎలా ఉందక్కడ..? సంక్రాంతి తర్వాత పెద్ద సినిమాలు లేక కళ తప్పిన బాక్సాఫీస్‌కు ఆ లోటు తీర్చేయడానికి వచ్చేస్తున్నాడు పెద్ది. జూన్ 4న విడుదల కానున్న ఈ చిత్రంపై ఇండియాలోనే కాదు ఓవర్సీస్‌లోనూ భారీ అంచనాలున్నాయి. నార్త్ అమెరికాలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 6 మిలియన్లు ఉన్నట్లు తెలుస్తుంది.. మొత్తం ఓవర్సీస్ పెద్ది ముంగిట 9 మిలియన్లు లక్ష్యం ఉంచింది. కరోనాకు ముందు తెలుగు సినిమాల ఓవర్సీస్ పర్ఫార్మెన్స్ పీక్స్‌లో ఉండేది. బాహుబలి 2 దాదాపు 20 మిలియన్లు వసూలు చేస్తే.. అప్పట్లో ప్రతీ పెద్ద సినిమా కనీసం 2 నుంచి 3 మిలియన్ వరకు వసూలు చేసేది. కానీ కరోనా తర్వాత కల్కి 18.57 మిలియన్ వసూలు చేస్తే.. ట్రిపుల్ ఆర్ 15.34 మిలియన్.. పుష్ప 2 సినిమా 15.27 మిలియన్ మార్క్ టచ్ చేసాయి. గత మూడేళ్లలో సలార్ 8.93 మిలియన్.. దేవర 6.08 మిలియన్.. ఓజి 5.60 మిలియన్.. హనుమాన్ 5.31 మిలియన్ వసూలు చేసాయి. అప్పుడప్పుడూ తప్పితే రెగ్యులర్‌గా మునపటి మ్యాజిక్ కనబడట్లేదు. గత రెండేళ్లలో అనిల్ రావిపూడి నుంచి వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం 2.94 మిలియన్, మన శంకరవరప్రసాద్ గారు 3.38 మిలియన్‌తో మాయ చేసాయి. పెద్ద సినిమాలు వస్తే యుఎస్ మార్కెట్ మెయింటేన్ అవుతుంది.. కానీ మనోళ్లు ఏడాదికి ఒకట్రెండు సినిమాలు కూడా రిలీజ్ చేయట్లేదు. ఇలాంటి టైమ్‌లో పెద్దితో వస్తున్నారు చరణ్. ఓవర్సీస్‌లో ఇప్పటికే రికార్డ్ బుకింగ్స్‌తో దూసుకుపోతుంది. పెద్ది హిట్టైతే.. USA మార్కెట్‌కు మళ్ళీ ఊపొచ్చినట్లే. చూడాలిక.. ఏం జరగబోతుందో..?

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బార్‌లో బీరు సీసాలతో రచ్చ.. తల పగిలినా కూల్‌గా ‘లాస్ట్ పెగ్’ వేసి

Jio: జియో బంపర్‌ ఆఫర్‌..కేవలం రూ.200కే అన్నీ..!

ఉద్యోగం పోయిందని సంబరాలు.. “ఇప్పుడే నా జీవితం మొదలైంది” అంటున్న యువతి

మార్స్ లో మనుషులు జీవించడానికి మొదటి అడుగు!

మృత్యువు ఇలా కూడా వస్తుందా..! భోజనం చేస్తుండగానే

Follow Us