AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: పెళ్లి తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన హీరోయిన్.. ఒకప్పుడు ఆమె టాలీవుడ్ సెన్సెషన్..

అందులో క్యూట్ బబ్లీగా కనిపిస్తున్న ఆ చిన్నారి తెలుగులో స్టార్ హీరోయిన్. బాలనటిగా సినీరంగంలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు.. ఆ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాతో కథానాయికగా వెండితెరకు పరిచయమయ్యింది. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.

Tollywood: పెళ్లి తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన హీరోయిన్.. ఒకప్పుడు ఆమె టాలీవుడ్ సెన్సెషన్..
Heroine
Rajitha Chanti
| Edited By: |

Updated on: Oct 12, 2024 | 9:00 PM

Share

తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రముఖ నటీమణుల చిన్ననాటి ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా హీరోయిన్స్ చైల్డ్ హుడ్ గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలోనే ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో సెన్సెషన్ అయిన హీరోయిన్ చిన్నప్పటి పిక్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. పైన ఫోటోను చూశారు కదా. అందులో క్యూట్ బబ్లీగా కనిపిస్తున్న ఆ చిన్నారి తెలుగులో స్టార్ హీరోయిన్. బాలనటిగా సినీరంగంలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు.. ఆ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాతో కథానాయికగా వెండితెరకు పరిచయమయ్యింది. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. తనే హీరోయిన్ హన్సిక మోత్వానీ. ఈ బ్యూటీ చిన్ననాటి ఫోటో ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ఆమె తమిళంలో కుష్బూ అని ముద్దుగా పిలుచుకుంటారు.

ఆమె “షక్కలక్క బూమ్ బూమ్” అనే హిందీ సీరియల్‌తో బాలతారగా తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. ఇక తర్వాత “దేశముదురు” మూవీతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది. ఈ మూవీలో ఆమె తొలిసారిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన నటించింది. ఆ తర్వాత హిందీ, కన్నడ వంటి భాషల్లో సినిమాల్లో అనేక చిత్రాల్లో నటించింది.. ఇందులో 2010లో విడుదలైన సీతారాముల కళ్యాణం తెలుగు సినిమా విజయం సాధించడంతో ఈ బ్యూటీకి తెలుగుతోపాటు తమిళంలోను వరుస ఆఫర్స్ వచ్చాయి.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే హన్సిక 2022లో ముంబయికి చెందిన వ్యాపారవేత్త సోహైల్‌ కతూరియాను వివాహం చేసుకుంది. అంతకు ముందు వీరిద్దరు మంచి స్నేహితులు. పెళ్లి తర్వాత కొన్నాళ్లు నటనకు దూరంగా ఉన్న హన్సిక.. ఇప్పుడు ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇస్తుంది. ప్రస్తుతం బుల్లితెరపై పలు రియాల్టీ షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన చైల్డ్ హుడ్ పిక్ నెట్టింట వైరలవుతుంది. తెలుగులో తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్‌ సినిమాలో చివరిగా కనిపించింది హన్సిక.

View this post on Instagram

A post shared by Hansika Motwani (@ihansika)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ట్రంప్ ఆరోగ్యంపై నెట్టింట వైరల్.. స్పందించిన వైట్ హౌస్..నిజమేంటి?
ట్రంప్ ఆరోగ్యంపై నెట్టింట వైరల్.. స్పందించిన వైట్ హౌస్..నిజమేంటి?
చెన్నై హ్యాట్రిక్‌ ఓటమి.. అగ్రస్థానానికి ఆర్‌సీబీ
చెన్నై హ్యాట్రిక్‌ ఓటమి.. అగ్రస్థానానికి ఆర్‌సీబీ
గాడిదను తేలిగ్గా తీసుకోవద్దు.. అవి మనిషికి నేర్పే 5 జీవిత పాఠాలు.
గాడిదను తేలిగ్గా తీసుకోవద్దు.. అవి మనిషికి నేర్పే 5 జీవిత పాఠాలు.
చిలుకకు ‘రామ చిలుక’ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..?
చిలుకకు ‘రామ చిలుక’ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..?
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్