Kalyan Ram: కళ్యామ్ రామ్ కొడుకు, కూతురును చూశారా..? ఎంత పెద్ద వాళ్లయ్యారో..
అటు హీరోగానే ఇటు నిర్మాతగానూ రాణిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి నిర్మాతగా దూసుకెళ్తున్నాడు. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇద్దరూ కలిసి సినిమా ఈవెంట్స్, పార్టీస్, ఫంక్షన్స్‌లో కనిపిస్తుంటారు. అలాగే తారక్ పూజా కార్యక్రమాలలో ఎన్టీఆర్ కొడుకులు ఇద్దరితో కలిసి సరదాగా గడుపుతుంటారు కళ్యాణ్ రామ్. కానీ ఈ హీరో ఫ్యామిలీ మాత్రం అంతగా బయట కనిపించరు.
నందమూరి కళ్యాణ్ రామ్ తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన హీరో. దివంగత నటుడు హరికృష్ణ నటవారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన నట విశ్వరూపంతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. అటు హీరోగానే ఇటు నిర్మాతగానూ రాణిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి నిర్మాతగా దూసుకెళ్తున్నాడు. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇద్దరూ కలిసి సినిమా ఈవెంట్స్, పార్టీస్, ఫంక్షన్స్‌లో కనిపిస్తుంటారు. అలాగే తారక్ పూజా కార్యక్రమాలలో ఎన్టీఆర్ కొడుకులు ఇద్దరితో కలిసి సరదాగా గడుపుతుంటారు కళ్యాణ్ రామ్. కానీ ఈ హీరో ఫ్యామిలీ మాత్రం అంతగా బయట కనిపించరు. సోషల్ మీడియాలోనూ కళ్యాణ్ రామ్ ఫ్యామిలీ అంతగా యాక్టివ్ గా ఉండరు.
కళ్యాణ్ రామ్ భార్య స్వాతి.. కొడుకు సూర్య రామ్, కూతురు తారక అద్వైత. వీరంతా అసలు మీడియా ముందు అంతగా కనిపించు. చాలా కాలం క్రితం కళ్యాణ్ రామ్ పిల్లల ఫోటోస్ బయటకు వచ్చాయి. తాజాగా కళ్యామ్ రామ్ తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ వెళ్లారు. తన భార్య స్వాతి, పిల్లలతో కలిసి హైదరాబాద్ ఎయిర్ పోర్టులోకి వెళ్తుండగా.. అక్కడున్న మీడియా కంట పడ్డారు. దీంతో కళ్యాణ్ రామ్ ఫ్యామిలీ ఎయిర్ పోర్ట్ విజువల్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. అందులో కళ్యాణ్ రామ్ కొడుకు, కూతురిని చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. ఎప్పుడో చిన్నప్పుడు వీరిద్దరి ఫోటోస్ బయటకు వచ్చాయి. ఇన్నేళ్లకు మరోసారి కనిపించారు. అప్పుడే ఇంత పెద్దవాళ్లైపోయారా అంటూ ఆశ్చర్యపోతున్నారు. కళ్యాణ్ రామ్ కొడుకు శౌర్య రామ్ ను చూసి మరో నందమూరి వారసుడు సిద్దమవుతున్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.
బింబిసార సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్.. ఆ తర్వాత డేవిల్ మూవీతో అడియన్స్ ముందుకు వచ్చాడు. కానీ ఈ సినిమా ఆశించిన స్తాయిలో మెప్పించలేకపోయింది. దీంతో తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై అచితూచి నిర్ణయం తీసుకుంటున్నాడు కళ్యాణ్ రామ్. కానీ ప్రస్తుతం నిర్మాతగా ఫుల్ జోష్ మీదున్నాడు ఈ హీరో. బింబిసార సినిమాతో భారీ వసూళ్లు రాబట్టిన కళ్యాణ్ రామ్.. ఇప్పుడు దేవర సినిమాతో నిర్మాతగా ఘనవిజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుంది.
Kalyan Ram garu with family 😍#NKR #KalyanRam #NandamuriKalyanRam pic.twitter.com/z2BlRcvYcF
— Sae Sarath NTR (@sarathtarak9) October 5, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.