Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kadgam Movie: ‘ఖడ్గం’ మూవీలో కనిపించిన ఈ హీరోయిన్ గుర్తుందా..? ఇప్పుడేం చేస్తుందంటే..

ఈ క్రమంలోనే అడియన్స్ తెగ వెతుకుతున్న హీరోయిన్లలో కిమ్ శర్మ ఒకరు. ఈ పేరు అంతగా పరిచయం లేదు కదూ.. కానీ ఖడ్గం మూవీలో శ్రీకాంత్ వెంటపడిన అమ్మాయి అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. పైన ఫోటోలో ఆ అమ్మాయిని చూశారు కదా.. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ఖడ్గం సినిమాలో వన్ ఆఫ్ ది బెస్ట్ రోల్ లో నటించింది.

Kadgam Movie: 'ఖడ్గం' మూవీలో కనిపించిన ఈ హీరోయిన్ గుర్తుందా..? ఇప్పుడేం చేస్తుందంటే..
Kimi Sharma
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 06, 2024 | 8:39 AM

తెలుగు సినీరంగంలో చాలా మంది హీరోయిన్స్ తక్కువ సమయంలో పాపులర్ అయ్యారు. ఒక్క సినిమాతోనే ఊహించని క్రేజ్ సొంతం చేసుకున్నారు. దీంతో ఇండస్ట్రీలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో బిజీ స్టార్స్ అవుతారనుకుంటే.. అనుహ్యంగా సినిమాలకు దూరమయ్యారు. చాలా మంది తారలు కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే సినీ పరిశ్రమకు గుడ్ బై చెప్పేశారు. ఒకప్పుడు అందం, అభినయంతో కట్టిపడేసి.. ఆ తర్వాత కనుమరుగైన ముద్దుగుమ్మల గురించి తెలుసుకునేందుకు ఇప్పుడు నెటిజన్స్ నెట్టింటిని జల్లెడ పట్టేస్తున్నారు. ఈ క్రమంలోనే అడియన్స్ తెగ వెతుకుతున్న హీరోయిన్లలో కిమ్ శర్మ ఒకరు. ఈ పేరు అంతగా పరిచయం లేదు కదూ.. కానీ ఖడ్గం మూవీలో శ్రీకాంత్ వెంటపడిన అమ్మాయి అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. పైన ఫోటోలో ఆ అమ్మాయిని చూశారు కదా.. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ఖడ్గం సినిమాలో వన్ ఆఫ్ ది బెస్ట్ రోల్ లో నటించింది.

ఖడ్గం సినిమాలో సోనాలి బింద్రే తర్వాత శ్రీకాంత్ జోడిగా నటించింది కిమ్ శర్మ. ఈ మూవీలో చాలా ఫేమస్ అయిన ముసుగు వెయ్యొద్దు మనసు మీద అంటూ మత్తెక్కించే పాటతో అదరగొట్టింది. ఖడ్గం మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ బ్యూటీ ఆ తర్వాత మరో సినిమా చేయలేదు. చాలా కాలం సినిమాలకు గ్యాప్ తీసుకున్న ఈ అమ్మడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన మగధీర చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసింది. ఆ తర్వాత మళ్లీ తెలుగులో కనిపించలేదు. కానీ అంతకు ముందు నుంచే బాలీవుడ్ లో సెటిల్ అయ్యింది. అక్కడ పలు చిత్రాలతోపాటు స్పెషల్ సాంగ్స్ చేసింది. కిమ్ శర్మ.. బీటౌన్ నటుడు హర్షవర్దన్ రానాతో ప్రేమాయణం సాగించింది.

కానీ కొన్నాళ్లకే వాళ్లద్దరూ విడిపోయారని తెలుస్తోంది. తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఫోటోస్ షేర్ చేస్తుంది. ఇప్పుడు ఈ అమ్మడు లేటేస్ట్ ఫోటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం కిమ్ శర్మ వయసు 44 ఏళ్లు. ఈ వయసులోనూ ఏమాత్రం చెరగని అందంతో అభిమానులను కట్టిపడేస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.