Ramadan 2026: మార్చి 20 లేదా 21.. భారత్‌లో రంజాన్ పండుగ ఎప్పుడు..? ఇదిగో ఫుల్ డిటైల్స్..
రంజాన్ ఉపవాస దీక్షలు కొనసాగుతున్నాయి.. పవిత్ర రంజాన్ మాసం చివరి వారంలోకి అడుగుపెడుతున్న తరుణంలో, ఈద్ పండుగకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు జరుపుకునే అత్యంత పవిత్రమైన పండుగలలో ఈద్ ఉల్-ఫితర్ (రమదాన్) ఒకటి. ఈ పండుగను రంజాన్ మాసం ముగిసిన వెంటనే, ఇస్లామిక్ నెల షవ్వాల్ మొదటి రోజున జరుపుకుంటారు.

రంజాన్ ఉపవాస దీక్షలు కొనసాగుతున్నాయి.. పవిత్ర రంజాన్ మాసం చివరి వారంలోకి అడుగుపెడుతున్న తరుణంలో, ఈద్ పండుగకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు జరుపుకునే అత్యంత పవిత్రమైన పండుగలలో ఈద్ ఉల్-ఫితర్ (రమదాన్) ఒకటి. ఈ పండుగను రంజాన్ మాసం ముగిసిన వెంటనే, ఇస్లామిక్ నెల షవ్వాల్ మొదటి రోజున జరుపుకుంటారు. రంజాన్ మాసం ముగింపులో జరుపుకునే పవిత్రమైన పండుగ ఈద్ ఉల్-ఫితర్.. స్నేహితులు, కుటుంబ సభ్యులు సమావేశమై బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. పేదలకు ప్రత్యేక బహుమతులు, ధానధర్మాలు కూడా ఇస్తారు. రంజాన్ నెలలో ఉపవాసం ఉండటం ఇస్లాం ఐదు స్తంభాలలో ఒకటి అని కూడా నమ్ముతారు.
అమావాస్య అనంతరం నెలవంక దర్శనం ఆ నెల ప్రారంభాన్ని నిర్ణయిస్తుంది. చాంద్రమాన నెల 29 లేదా 30 రోజులు ఉంటుంది కాబట్టి, రంజాన్ ఈద్ ఖచ్చితమైన తేదీని ముందుగానే అంచనా వేయడం కష్టం అవుతుంది. అయితే.. ఈ సంవత్సరం భారతదేశంలో రంజాన్ ఈద్ ఎప్పుడు జరుపుకుంటారు? రంజాన్ పండుగ 2026 తేదీ ఎప్పుడు అనే వివరాలను తెలుసుకుందాం..
భారతదేశం, సౌదీ అరేబియా, యుఎఇలలో ఈద్ ఎప్పుడు జరుపుకుంటారు?
ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో ఈద్ అల్-ఫితర్ (రంజాన్) ను ఒకే రోజున జరుపుకోరు.. దీనికి ప్రధాన కారణం సమయ మండలాల్లోని తేడాలు.. (భూమి తన అక్షం మీద తిరగడం వల్ల, వేర్వేరు ప్రాంతాల్లో సూర్యోదయం, సూర్యాస్తమయాలు వేర్వేరు సమయాల్లో జరుగుతాయి.) ఫలితంగా, భూమిపై ప్రతిచోటా నెలవంక ఒకే సమయంలో కనిపించదు. ఉదాహరణకు, సౌదీ అరేబియా – యుఎఇ వంటి గల్ఫ్ దేశాలు భారతదేశం, పాకిస్తాన్, ఆసియాలోని అనేక ఇతర దేశాల కంటే ఒక రోజు ముందుగా ఈద్‌ను జరుపుకుంటాయి.
అంతర్జాతీయ ఖగోళ కేంద్రం ప్రకారం, సౌదీ అరేబియాలోని ప్రజలు అమావాస్య అనంతరం మార్చి 18న నెలవంకను చూడగలిగితే, 29 రోజుల ఉపవాసం తర్వాత మార్చి 19న ఈద్ జరుపుకుంటారు. నెలవంక దర్శనం లేకపోతే.. పవిత్ర మాసం 30 రోజులు పూర్తి అవుతుంది.. మార్చి 20న పండుగ జరుపుకుంటారు.
“మార్చి 18, బుధవారం చంద్రవంకను చూసే దేశాల విషయానికొస్తే, సూర్యుడికి ముందు చంద్రుడు అస్తమించడం, సూర్యాస్తమయం తర్వాత సంభవించే సంయోగం కారణంగా ఆ రోజున చంద్రవంకను చూడటం అసాధ్యం, అందువల్ల ఈ దేశాలు రంజాన్ మాసాన్ని ముప్పై రోజులుగా పూర్తి చేస్తాయని, మార్చి 20, శుక్రవారం వారికి ఈద్ అల్-ఫితర్‌గా ఉంటుందని భావిస్తున్నారు” అని అంతర్జాతీయ ఖగోళ కేంద్రం X లో చెప్పంది..
تقرير فلكي حول رؤية هلال شهر شوّال 1447 (عيد الفطر 2026)
المهندس محمد شوكت عودة مدير مركز الفلك الدولي
رابط الخبر على موقع مركز الفلك الدولي:https://t.co/i1PePm3VOI
بدأت بعض الدول شهر رمضان يوم الأربعاء 18 شباط/فبراير 2026م، وهذه الدول ستتحرى هلال العيد يوم الأربعاء 18… pic.twitter.com/Iaj4UZZ9tW
— مركز الفلك الدولي (@AstronomyCenter) March 9, 2026
భారత్ లో నెలవంక ఎప్పుడు కనిపించే అవకాశం ఉంది?
ఈద్ వేడుకల తేదీలకు సంబంధించిన గందరగోళాన్ని తొలగించడానికి, UAEలోని అల్ ఖాతిమ్ ఖగోళ అబ్జర్వేటరీ షావ్వాల్ నెలవంక దృశ్యమానత తేదీలను సూచించే 2 ఫోటోలను అందించింది. ఇవి ఈద్ ఎప్పుడు జరుగుతుందో, రంజాన్ 1447 AH నెలను ముగించే సమయం గురించి స్పష్టత ఇచ్చింది. అంతర్జాతీయ ఖగోళ కేంద్రం ప్రకారం, ఫిబ్రవరి 19న ఉపవాసం ప్రారంభమైన భారతదేశంతో సహా దేశాలలో ఈద్ అల్-ఫితర్‌ను మార్చి 20న జరుపుకునే అవకాశం ఉంది.
భారతదేశంలో, 29 రోజుల ఉపవాసం తర్వాత మార్చి 19న నెలవంక కనిపించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే, తుది తేదీ చంద్రుని దర్శనం (నెలవంక) పై ఆధారపడి ఉంటుంది. మార్చి 19న చంద్రుడు కనిపించకపోతే.. బదులుగా మార్చి 21న పండుగ జరుపుకునే అవకాశం ఉంది. మొత్తానికి రంజాన్ పండుగ తేదీ.. మార్చి 20 లేదా 21 అనేది నెలవంక దర్శనం పై ఆధారపడి ఉందని ముస్లిం మత పెద్దలు పేర్కొంటున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
