AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా.. వైరల్ అవుతున్న ‘బ్లాక్ బోర్డ్’ ఫోటో

ఎండలు దంచికొడుతున్నా.. చల్లగా కొబ్బరి నీళ్లు తాగుదామని వెళ్తున్నారా?.. జాగ్రత్త ఇప్పుడు వాటి రేట్లు సూర్యుడి వేడి కన్నా గరం గరంగా ఉన్నాయి. సమ్మర్ సీజన్ కావడంతో వ్యాపారులు అమాంతం రేట్లను పెంచేశారు. బెంగళూరు నగరంలో ఏకంగా లీటర్ కొబ్బరి నీరు రూ.180కి అంటూ సోషల్‌ మీడియాలో ఓ ఫోటో తెగవైరల్ అవుతుంది. ఇంతకూ అసలు మ్యాటర్ ఏంటో పూర్తిగా తెలుసుకుందాం పదండి.

Viral News: ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా.. వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్' ఫోటో
Coconut Water Price
Anand T
|

Updated on: Apr 05, 2026 | 9:10 PM

Share

మార్చి ముగిసింది.. ఏప్రిల్ స్టార్ట్ అయింది. దీంతో భానుడి భగభగలు మరింత పీక్స్‌కు చేరుకున్నాయి. ఇటు తెలంగాణ, అటు కర్ణాటకలోనూ ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. ఈ ఎండల నుంచి ఉపశమనం పొందడానికి ప్రజలు శీతల పానీయాలను, ముఖ్యంగా కొబ్బరి నీళ్లు తాగేందుకు క్యూ కడుతున్నారు. అయితే ఇదే అదునుగా భావించిన వ్యాపారులు కొబ్బరి బోండాం రేట్లను అమాంతం పెంచేశారు. బెంగళూరులో కొబ్బరి నీళ్లను లీటర్లలో అమ్ముతూ.. ఏకంగా లీటర్ కొబ్బరి నీళ్లకు రూ.180 వసూలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఓ పోస్ట్ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

లీటర్ కొబ్బరి నీళ్లు 180 రూపాయలు!

సాధారణంగా మనం కొబ్బరినీళ్లని కాయల లెక్కన కొంటాం. కానీ బెంగళూరులో సీన్ మారింది.. డిమాండ్‌ను చూసి వ్యాపారులు లీటర్ల లెక్కన కొబ్బరి నీళ్లను అమ్మడం స్టార్ట్ చేశారు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ఫోటో లో ఒక రోడ్డు పక్కన ఉన్న దుకాణంలో నల్లబోర్డుపై 1 లీటర్ రూ. 180 అని రాసి ఉంది. దీన్ని చూసిన నెటిజన్లు దీనిపై తమదైన రీతిలో స్పందిస్తున్నారు. కొందరు (Peak Bengaluru) అనే ట్యాగ్‌తో దీన్ని వైరల్ చేస్తుండగా.. మరికొందరు ఇలా కామెంట్స్ చేస్తున్నారు.

ఒక యూజర్‌ కామెంట్ చేస్తూ మా ఊర్లో 50 రూపాయలకే దొరుకుతుంది, ఇది మరీ దోపిడీ అనగా.. ఇది కేవలం బెంగళూరులోనే సాధ్యం అంటూ మరో యూజర్ కామెంట్ చేశాడు. లీటర్ల లెక్కన అమ్మడం వల్ల మోసం ఉండదు, ఎంత కావాలో అంత కొనుక్కోవచ్చు, ప్యాకింగ్ కూడా శుభ్రంగా ఉంటుంది అని మరికొందరు కామెంట్ చేశారు. బెంగళూరులో జీవన వ్యయం, ట్రాఫిక్ మాత్రమే కాదు, ఇప్పుడు ఎలనీళ్ల ధర కూడా ఆకాశాన్ని తాకుతోందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

సాధారణంగా ఒక కొబ్బరి కాయలో 200 నుంచి 400 మి.లీ వరకు నీరు ఉంటుంది. అంటే ఒక లీటర్ కావాలంటే దాదాపు 3 నుంచి 5 కాయలు అవసరమవుతాయి. కాయ 50-60 రూపాయలు అనుకున్నా, లీటర్ ధర 180 ఉండటం కొంచెం ఎక్కువే అనిపిస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
భారత ట్రక్కు డ్రైవర్లు.. వెళ్లిపొండి! సిక్కు సంఘాలు సీరియస్
భారత ట్రక్కు డ్రైవర్లు.. వెళ్లిపొండి! సిక్కు సంఘాలు సీరియస్
పుతిన్, జిన్‌పింగ్‌కు స్పెషల్ సెక్యూరిటీ.. ఏ రేంజ్‌లో ఉందంటే!
పుతిన్, జిన్‌పింగ్‌కు స్పెషల్ సెక్యూరిటీ.. ఏ రేంజ్‌లో ఉందంటే!
మరో వారంలో వీరికి జాక్‌పాట్.. కెరీర్‌లో పురోగతి, చేతిలో డబ్బు!
మరో వారంలో వీరికి జాక్‌పాట్.. కెరీర్‌లో పురోగతి, చేతిలో డబ్బు!
SBIలో ఎఫ్‌డీపై రూ. 1 లక్ష డిపాజిట్‌ చేస్తే మెచ్యూరిటీ సమయంలో ఎంత?
SBIలో ఎఫ్‌డీపై రూ. 1 లక్ష డిపాజిట్‌ చేస్తే మెచ్యూరిటీ సమయంలో ఎంత?
రైలు పట్టాల కింద కంకర రాళ్లు ఎందుకు పోస్తారో తెలుసా?
రైలు పట్టాల కింద కంకర రాళ్లు ఎందుకు పోస్తారో తెలుసా?
బొజ్జ గణపయ్యకి ఇష్టమైన బెల్లం కుడుములు..ఇలా చేస్తే రుచి అద్భుతమే
బొజ్జ గణపయ్యకి ఇష్టమైన బెల్లం కుడుములు..ఇలా చేస్తే రుచి అద్భుతమే
కనకాంబరం మొక్క పూలు పూయట్లేదా? ఇంట్లో దొరికే ఈ మూడు కలిపి వేయండి
కనకాంబరం మొక్క పూలు పూయట్లేదా? ఇంట్లో దొరికే ఈ మూడు కలిపి వేయండి
భారత్‌ అమ్ములపొదిలో 190 అణు వార్‌హెడ్లు.. తయారీ దశలో మరో 35
భారత్‌ అమ్ములపొదిలో 190 అణు వార్‌హెడ్లు.. తయారీ దశలో మరో 35
ఎండుమిరపకాయల పప్పు.. వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసి తింటే.. అబ్బో
ఎండుమిరపకాయల పప్పు.. వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసి తింటే.. అబ్బో
నిమ్మకాయలు నెల రోజులైనా ఫ్రెష్‌గా ఉంటాయ్.. ఈ సింపుల్ ట్రిక్స్..
నిమ్మకాయలు నెల రోజులైనా ఫ్రెష్‌గా ఉంటాయ్.. ఈ సింపుల్ ట్రిక్స్..