మామిడి పండ్లు తిన్న వెంటనే నీళ్లు తాగొద్దు! ఎందుకంటే..

05 April 2026

TV9 Telugu

TV9 Telugu

వేసవి రాకతో మార్కెట్‌లోకి మామిడి పండ్ల సందడి మొద‌ల‌వుతుంది. తెలుగు రాష్ట్రాలు మామిడి పండ్లకు ఎంతో ప్రసిద్ధి. ప్రపంచంలో మ‌రెక్కడా ల‌భించ‌న‌న్ని ర‌కాల మామిడి పండ్లు మన దగ్గరే ల‌భిస్తాయి

TV9 Telugu

అంతేకాదు దేశంలోని మామిడిపండ్లు ర‌క‌ర‌కాల రుచుల్లో అందుబాటులో ఉంటాయి. ఈ మామిడి పండ్లను నేరుగా తినొచ్చు. జ్యూస్‌లుగా చేసుకుని తాగ‌వ‌చ్చు

TV9 Telugu

మామిడి తాండ్ర, మామిడి క‌రేలా లాంటి ప‌దార్థాలు త‌యారు చేసుకుని కూడా తినొచ్చు. అయితే ఈ మామిడిపండ్లు తిన్న త‌ర్వాత ఓ ఐదు ర‌కాల ప‌దార్థాల‌ జోలికి అస్సలు పోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు

TV9 Telugu

ముఖ్యంగా మామిడి పండ్లు తిన్న త‌ర్వాత కొంత‌సేప‌టి వ‌ర‌కు మంచినీళ్లను అస్సలు తాగొద్దట‌. అలా చేస్తే ఆరోగ్యంపై దుష్ప్రభావం ప‌డుతుంద‌ట‌. క‌డ‌పు నొప్పి, అసిడిటీ, క‌డుపు ఉబ్బరం లాంటి స‌మ‌స్యలు వ‌చ్చే అవ‌కాశం ఉంది మరీ

TV9 Telugu

మామిడి పండు తిన‌గానే పెరుగు తీసుకుంటే శ‌రీరం డీహైడ్రేట్ అవుతుంది. అందువ‌ల్ల అలాంటి అల‌వాటు ఉంటే త‌క్షణ‌మే మానుకోవాలి. లేదంటే వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. అంతేగాక చ‌ర్మ స‌మ‌స్యలు కూడా వ‌చ్చే అవ‌కాశం ఉన్నద‌ట‌

TV9 Telugu

మామిడి పండ్లు తిన్న త‌ర్వాత కాక‌ర‌కాయ తీసుకోవ‌డం కూడా మంచిది కాదు. అలా చేయ‌డంవ‌ల్ల వికారం, వాంతులు, శ్వాస తీసుకోవ‌డంలో స‌మ‌స్యలు వస్తాయి

TV9 Telugu

మామిడి పండ్లు తిన్న త‌ర్వాత ఘాటు ప‌దార్థాలుగానీ, కారం ప‌దార్థాలుగానీ తీసుకుంటే ఉద‌ర సంబంధ స‌మ‌స్యలు, చ‌ర్మ స‌మ‌స్యలు వ‌చ్చే అవ‌కాశం ఉంది

TV9 Telugu

అంతేగాక ముఖంపై మొటిమ‌లు వ‌చ్చే ప్రమాదం కూడా ఉన్నద‌ట‌. మామిడి పండ్లతోపాటు చ‌ల్లటి పానీయాలు తీసుకోవ‌డం కూడా ఆరోగ్యానికి హానిక‌ర‌మే. చ‌ల్లటి పానీయాల‌తో మామిడి పండ్లను తీసుకోవ‌డంవ‌ల్ల షుగ‌ర్ లెవ‌ల్స్ మ‌రింత పెరుగుతాయి