మీ ఆయుష్షును మరో 11 ఏళ్లు అధికంగా పెంచే వంటింటి ఔషధం ఇది!

05 April 2026

TV9 Telugu

TV9 Telugu

తాలింపులో రెండు వెల్లుల్లి రెబ్బలు పడితే వాసన ఘుమాలించాల్సిందే. అంతేనా వెల్లుల్లి వంటలకు ప్రత్యేకమైన రుచిని కూడా అందిస్తాయి. వెల్లుల్లి రుచిని మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది

TV9 Telugu

వెల్లుల్లి రుచిని మాత్రమే కాదు మన జీవితకాలాన్నీ 11 శాతం పెంచుతుందని అంటున్నారు స్పెయిన్‌లోని శాస్త్రవేత్తలు. వయసుతో పాటు శరీరంలోని కణాలు దెబ్బతినడం సహజం

TV9 Telugu

కానీ వెల్లుల్లిలోని డై అలైల్‌ సల్ఫైడ్‌ (డీఏఎస్‌) అనే కాంపౌండ్‌ మన శరీరంలో ప్రొటీన్‌ పెర్‌సల్ఫైడేషన్‌ అనే ప్రక్రియకి దోహదం చేస్తుంది. దీనివల్ల వయసు పెరుగుతున్నా కణాల చురుకుదనం ఏమాత్రం తగ్గకుండా ఉంటుందట

TV9 Telugu

కాలేయంలో అనవసరపు కొవ్వు నిల్వలు పేరుకోకుండా చేస్తుందట. దీనివల్ల భవిష్యత్తులో కాలేయ క్యాన్సర్లు రాకుండా ఉంటాయి. డయాబెటిస్, ఆల్జీమర్స్‌ వంటి వ్యాధులతోపాటు ఆటోఇమ్యూన్‌ రోగాల బారినపడకుండానూ వెల్లుల్లిలోని డీఏఎస్‌ కాంపౌండ్‌ రక్షిస్తుంది

TV9 Telugu

శాస్త్రవేత్తలు కొంతమందికి వెల్లుల్లిని తగిన మోతాదులో ఆహారంగా అందించి ఆ తర్వాత రక్తపరీక్షలు చేసినప్పుడు వారిలో గుండెజబ్బులకు కారణం అయ్యే ట్రైగ్లిజరాయిడ్లు తక్కువగా ఉండటాన్నీ గమనించారు

TV9 Telugu

అందుకే ఆహారంలో తగిన మోతాదులో వెల్లుల్లిని చేర్చుకొమ్మని శాస్త్రవేత్తలు అంటున్నారు. అలాగే అధిక బరువుతో ఇబ్బందిపడేవారు వెల్లుల్లిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ప్రయోజనం పొందే అవకాశాలున్నాయంటున్నారు

TV9 Telugu

కారణం వెల్లుల్లిలో ఉండే అలిసిన్‌ అనే పదార్థమే. ఇందులోని ఔషధ గుణాలు రక్తంలోని ట్రైగ్లిజరైడ్స్‌ని తగ్గించి, శరీర బరువును తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని చెబుతున్నారు

TV9 Telugu

వెల్లుల్లి తీసుకోని వారితో పోల్చితే.. తరచూ ఆహారంలో భాగంగా దీన్ని తీసుకునే వారిలో జలుబు, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు తక్కువగా వస్తాయట