AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Financial Lessons: మీరు ధనవంతులు కావాలంటే ఈ 5 అలవాట్లను వదిలేయాల్సిందే..!

Financial Lessons: ధనవంతులు కావడం అంటే కేవలం ఎక్కువ సంపాదించడం మాత్రమే కాదు, అనవసరమైన ఖర్చులను తగ్గించుకుని తెలివిగా పెట్టుబడి పెట్టడం. వారెన్ బఫెట్ చెప్పిన ఈ చిన్న మార్పులను మీ జీవితంలో అమలు చేస్తే, ఆర్థిక స్వేచ్ఛను సాధించడం కష్టమేమీ కాదు..

Subhash Goud
|

Updated on: Apr 05, 2026 | 7:11 PM

Share
 Financial Lessons: చాలామంది మధ్యతరగతి ప్రజలు ఆర్థిక సంక్షోభం అనేది అకస్మాత్తుగా వస్తుందని భావిస్తారు. కానీ, ప్రపంచ ప్రఖ్యాత ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ అభిప్రాయం ప్రకారం.. ఆర్థిక ఇబ్బందులు అనేవి మనం రోజువారీ చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల క్రమంగా ఏర్పడేవి. మొదట్లో ఈ తప్పులు చిన్నవిగా అనిపించినా, కాలక్రమేణా ఇవి మీ ఆర్థిక పునాదులను బలహీనపరుస్తాయి. మీరు కూడా ఆర్థికంగా ఎదగాలనుకుంటే, బఫెట్ సూచించిన ఈ కింది 5 అలవాట్లకు దూరంగా ఉండాలి.

1 / 7
 1. క్రెడిట్ కార్డు వడ్డీ భారంగా మారుతుంది: అవసరానికి మించి క్రెడిట్ కార్డులను వాడటం అత్యంత ప్రమాదకరం. క్రెడిట్ కార్డులపై ఉండే అధిక వడ్డీ (దాదాపు 18% లేదా అంతకంటే ఎక్కువ) మీ సంపాదనను హరిస్తుంది. అధిక వడ్డీ చెల్లించడం అంటే మీ కష్టార్జితాన్ని ఇతరులకు ధారపోయడమే అని బఫెట్ అంటారు. అందుకే, వీలైనంత త్వరగా ఖరీదైన అప్పులను తీర్చివేయడం ఆర్థికంగా ఎదగడానికి మొదటి మెట్టు.

2 / 7
 2. 'త్వరగా ధనవంతులు కావాలి' అనే ఆలోచన: నేటి కాలంలో చాలామంది అతి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని తొందరపడి పొరపాట్లు చేస్తుంటారు. కానీ, డబ్బు పెరగడానికి సమయం పడుతుందని బఫెట్ నమ్ముతారు. ఒక చెట్టు పెరగడానికి ఏళ్ల సమయం పట్టినట్టే, పెట్టుబడులు ఫలించడానికి కూడా ఓపిక అవసరం. "చాలామంది సంపాదించిన తర్వాత ఖర్చు చేసి, మిగిలితే పొదుపు చేస్తారు. కానీ సంపాదించగానే ముందుగా పెట్టుబడి (Investment) కేటాయించి, ఆ తర్వాతే ఖర్చు చేయాలి" అని ఆయన సూచిస్తారు.

3 / 7
 3. హోదా కోసం పెద్ద ఇల్లు.. ఒక ఆర్థిక భారం: అవసరానికి మించిన పెద్ద ఇల్లు కొనడం కోసం భారీగా హోమ్ లోన్ తీసుకోవడం మీ ఆర్థిక స్థితిని దెబ్బతీస్తుంది. మీ ఆదాయంలో ఎక్కువ భాగం EMIలకే వెళ్తే, పొదుపు చేయడానికి లేదా పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉండదు. ఇల్లు అనేది నివసించడానికి ఉండాలి కానీ, ఎదుటివారికి చూపించుకోవడానికి కాదని బఫెట్ నమ్ముతారు.

4 / 7
 4. అదృష్టాన్ని నమ్ముకుని జూదం ఆడటం: లాటరీలు, జూదం వంటి వాటి ద్వారా ఒక్క రాత్రిలో కోటీశ్వరులు కావాలని ప్రయత్నించడం వల్ల ఆశించిన ఫలితం రాకపోగా, చేతిలో ఉన్న డబ్బు కూడా కరిగిపోతుంది. ఇవి చిన్న మొత్తాలుగా అనిపించినా, భవిష్యత్తులో మీ సంపదను తగ్గిస్తాయి. అందుకే ఇలాంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

5 / 7
 5. స్టేటస్ కోసం కొత్త కారు కొనడం: మధ్యతరగతి ప్రజలు ఎదుటివారిని మెప్పించేందుకు అప్పులు చేసి కొత్త కార్లు కొంటారు. కారు కొన్న మరుక్షణం దాని విలువ తగ్గిపోతూ ఉంటుంది. వారెన్ బఫెట్ స్వయంగా ఎన్నో ఏళ్ల పాటు పాత కారునే వాడారు. అనవసరమైన ఆడంబరాల కోసం డబ్బు ఖర్చు చేసే బదులు, ఆ డబ్బును మదుపు చేయడం ద్వారా సంపదను సృష్టించవచ్చని ఆయన నిరూపించారు.

6 / 7
 ధనవంతులు కావడం అంటే కేవలం ఎక్కువ సంపాదించడం మాత్రమే కాదు, అనవసరమైన ఖర్చులను తగ్గించుకుని తెలివిగా పెట్టుబడి పెట్టడం. వారెన్ బఫెట్ చెప్పిన ఈ చిన్న మార్పులను మీ జీవితంలో అమలు చేస్తే, ఆర్థిక స్వేచ్ఛను సాధించడం కష్టమేమీ కాదు.

7 / 7
Follow Us