AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: కోహ్లీని కెలికిన ఖలీల్ అహ్మద్.. కట్‌చేస్తే.. చిర్రెత్తిన విరాట్ రివేంజ్ ఎలా తీర్చుకున్నాడంటే.?

Virat Kohli No Look Six: ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. సీఎస్కే బౌలర్ ఖలీల్ అహ్మద్ స్లెడ్జింగ్‌కు దిగడంతో ఆగ్రహానికి గురైన విరాట్ కోహ్లీ, ఆ మరుసటి ఓవర్‌లోనే మ్యాట్ హెన్రీ బౌలింగ్‌లో కళ్లు చెదిరే 'నో-లుక్' సిక్సర్‌తో గట్టి సమాధానం ఇచ్చాడు.

Video: కోహ్లీని కెలికిన ఖలీల్ అహ్మద్.. కట్‌చేస్తే.. చిర్రెత్తిన విరాట్ రివేంజ్ ఎలా తీర్చుకున్నాడంటే.?
Rcb Vs Csk Virat Kohli No Look Six
Venkata Chari
|

Updated on: Apr 05, 2026 | 9:05 PM

Share

Virat Kohli No Look Six: చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ పోరులో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరుకు ఆదిలోనే సవాళ్లు ఎదురయ్యాయి. చెన్నై బౌలర్ ఖలీల్ అహ్మద్ అద్భుతమైన లైన్ అండ్ లెంగ్త్‌తో కోహ్లీని ఇబ్బంది పెట్టాడు. మూడో ఓవర్ చివరి బంతికి కోహ్లీ భారీ షాట్‌కు ప్రయత్నించి విఫలమవగా, ఖలీల్ అతడిని ఉద్దేశించి ఏదో అన్నాడు. దీనికి కోహ్లీ కూడా దీటుగా స్పందించడంతో ఇద్దరి మధ్య కాసేపు వాగ్వివాదం జరిగింది. ఒకరినొకరు తీక్షణంగా చూసుకుంటూ ఉండటంతో మైదానంలో ఒక్కసారిగా ఉత్కంఠ నెలకొంది.

కసి తీర్చుకున్న కింగ్ కోహ్లీ..

ఖలీల్ చేసిన వ్యాఖ్యలతో కోహ్లీలోని అసలైన దూకుడు బయటకు వచ్చింది. నాలుగో ఓవర్ వేయడానికి వచ్చిన మ్యాట్ హెన్రీని కోహ్లీ లక్ష్యంగా చేసుకున్నాడు. లెంగ్త్ బంతిని అద్భుతమైన మణికట్టు వేగంతో డీప్ మిడ్-వికెట్ మీదుగా 85 మీటర్ల భారీ సిక్సర్‌గా మలిచాడు. ఆ బంతిని కనీసం చూడకుండా ‘నో-లుక్’ శైలిలో కోహ్లీ ఆడిన తీరు అభిమానులను ఉర్రూతలూగించింది. అదే ఓవర్‌లో మరో ఫోర్ కూడా కొట్టి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.

రోహిత్ రికార్డు బద్దలు.. కానీ నిరాశతోనే..

ఈ మ్యాచ్‌లో కోహ్లీ 18 బంతుల్లో 28 పరుగులు (2 ఫోర్లు, 1 సిక్సర్) చేసి అన్షుల్ కాంబోజ్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. అయితే ఈ స్వల్ప ఇన్నింగ్స్‌తోనే కోహ్లీ ఒక అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో ఒకే జట్టుపై (చెన్నై) అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రోహిత్ శర్మ రికార్డును విరాట్ అధిగమించాడు. రోహిత్ కోల్‌కతాపై 1161 పరుగులు చేయగా, కోహ్లీ ఇప్పుడు చెన్నైపై 1188 పరుగులతో అగ్రస్థానానికి చేరుకున్నాడు.

ఖలీల్ అహ్మద్ స్లెడ్జింగ్ చేయకపోయి ఉంటే కోహ్లీ మరింత నిలకడగా ఆడేవాడేమో అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కానీ ఆ గొడవ కోహ్లీని రెచ్చగొట్టడం, తద్వారా అతను క్లాస్ షాట్లతో అలరించడం అభిమానులకు మాత్రం కనువిందు చేసింది. చివరకు అన్షుల్ కాంబోజ్ కోహ్లీ వికెట్ తీయడంతో చెన్నై శిబిరం ఊపిరి పీల్చుకుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
కోహ్లీని కెలికిన ఖలీల్ అహ్మద్.. రివేంజ్ ఎలా తీర్చుకున్నాడంటే.?
కోహ్లీని కెలికిన ఖలీల్ అహ్మద్.. రివేంజ్ ఎలా తీర్చుకున్నాడంటే.?
షుగర్‌, బీపీ ఈ జన్మలో రాకూడదంటే.. రాత్రిళ్లు ఈ టైంలో భోజనం చేయండి
షుగర్‌, బీపీ ఈ జన్మలో రాకూడదంటే.. రాత్రిళ్లు ఈ టైంలో భోజనం చేయండి
ఐపీఎల్ నుంచి బ్యాన్.. శ్రేయాస్ అయ్యర్‌కు బ్యాడ్‌న్యూస్ రానుందా.?
ఐపీఎల్ నుంచి బ్యాన్.. శ్రేయాస్ అయ్యర్‌కు బ్యాడ్‌న్యూస్ రానుందా.?
జిమ్‌కి వెళ్తూ మధ్యలోనే హఠాత్తుగా మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా..
జిమ్‌కి వెళ్తూ మధ్యలోనే హఠాత్తుగా మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా..
రెండు చేతులు కలిపే విదానం బట్టి.. మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు
రెండు చేతులు కలిపే విదానం బట్టి.. మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు
కాకులు ఎంత కాలం జీవిస్తాయో తెలుసా? ముసలి కాకుల స్పెషాలిటీ అదే
కాకులు ఎంత కాలం జీవిస్తాయో తెలుసా? ముసలి కాకుల స్పెషాలిటీ అదే
రోహిత్ భారీ రికార్డును బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ.. అదేంటంటే?
రోహిత్ భారీ రికార్డును బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ.. అదేంటంటే?
మీరు కూరల్లో వేసే ఈ రెబ్బలు.. రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో తింటే..
మీరు కూరల్లో వేసే ఈ రెబ్బలు.. రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో తింటే..
ఒక్కసారిగా రూ. 25 పెరిగిన డీజిల్ ధర.. పెట్రోల్‌పై రూ.7.41..!
ఒక్కసారిగా రూ. 25 పెరిగిన డీజిల్ ధర.. పెట్రోల్‌పై రూ.7.41..!
ఆకివీడు చుట్టూ 500 మంది పోలీసులతో భారీ భద్రత
ఆకివీడు చుట్టూ 500 మంది పోలీసులతో భారీ భద్రత