AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఎరక్కపోయి ఇరుకున్నాడు.. యూట్యూబ్‌లో చూసి బంగారం కోసం వేట.. చివరకు ఏమైందో వీడియోలో చూడండి..

యూట్యూబ్‌లో ఏవో వీడియోలు చూసి రాత్రికి రాత్రే కోటీశ్వరుడైపోవాలనుకున్నాడు.. ఇంకేముంది, కళ్లు మూసుకుని మూతపడిన పాత బంగారు గనిలోకి దిగిపోయాడు.. తీరా చూస్తే బంగారం సంగతి దేవుడెరుగు.. గంటల తరబడి సొరంగంలో చిక్కుకుపోయి ప్రాణాల మీదికే తెచ్చుకున్నాడు. అర్ధరాత్రి వేళ పోలీసులను, ఫైర్ సిబ్బందిని పరుగులు పెట్టించిన ఈ విచిత్ర ఘటన శ్రీసత్యసాయి జిల్లా రామగిరిలో తీవ్ర కలకలం రేపింది.

Andhra Pradesh: ఎరక్కపోయి ఇరుకున్నాడు.. యూట్యూబ్‌లో చూసి బంగారం కోసం వేట.. చివరకు ఏమైందో వీడియోలో చూడండి..
Nellore Man Trapped In Ramagiri Gold Mines
Nalluri Naresh
| Edited By: |

Updated on: Oct 13, 2026 | 6:10 PM

Share

కొండ నాలుకకు మందు వేస్తే.. ఉన్న నాలుక ఊడినట్లు తయారైంది ఆ వ్యక్తి పరిస్థితి. యూట్యూబ్‌లో కనిపించిన వీడియోలను గుడ్డిగా నమ్మి, రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయిపోవాలనే అత్యాశతో ఏకంగా మూతపడిన ప్రమాదకరమైన బంగారు గనిలోకి దిగాడు. చివరికి ఊపిరాడక, బయటకు రాలేక గంటల తరబడి సొరంగంలో చిక్కుకుపోయి ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడు. శ్రీసత్యసాయి జిల్లా రామగిరి మండల కేంద్రంలో చోటుచేసుకున్న ఈ వింత ఘటన అర్ధరాత్రి వేళ పోలీసులను, స్థానికులను తీవ్ర టెన్షన్‌కు గురిచేసింది. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలానికి చెందిన ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తికి సోషల్ మీడియాలో రామగిరి గోల్డ్ మైన్స్‌పై రూపొందించిన ఒక యూట్యూబ్ వీడియో కనిపించింది. ఆ వీడియో చూసి ప్రభావితమైన అతడు.. మూతపడిన ఆ గనుల్లో ఇంకా బంగారం నిల్వలు కుప్పలుగా పడి ఉన్నాయని గుడ్డిగా నమ్మాడు. ఎలాగైనా ఆ గనిలోకి వెళ్లి బంగారం తవ్వుకోవాలని ప్లాన్ వేశాడు. ఇందుకోసం నెల్లూరు జిల్లా పల్లెపాలెంకు చెందిన కిష్టయ్య, పెంచలయ్య అనే మరో ఇద్దరిని వెంటబెట్టుకుని రామగిరి గోల్డ్ మైన్స్ ప్రాంతానికి చేరుకున్నాడు.

చీకటి పడ్డాక సొరంగంలోకి.. తర్వాత ఊహించని ట్విస్ట్

ఎవరికీ అనుమానం రాకుండా అర్ధరాత్రి వేళ పాడుబడిన, ప్రమాదకరమైన సొరంగంలోకి ప్రభాకర్ రెడ్డి ఒంటరిగా దిగాడు. అతని సహచరులు బయటే కాపలా ఉన్నారు. అయితే గంటలు గడుస్తున్నా లోపలికి వెళ్లిన ప్రభాకర్ రెడ్డి తిరిగి బయటకు రాలేదు. లోపల ఊపిరాడక లేదా ఏదైనా జంతువులు, విషవాయువుల బారిన పడి ఉంటాడేమోనని బయట ఉన్న పెంచలయ్య తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. ఎంత పిలిచినా స్పందన లేకపోవడంతో.. చివరికి గత్యంతరం లేక పోలీసులకు సమాచారం అందించాడు.

రంగంలోకి పోలీసులు, ఫైర్ సిబ్బంది

సమాచారం అందుకున్న వెంటనే రామగిరి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మూతపడిన సొరంగం కావడం, విషవాయువులు, లోతైన గుంతలు ఉండే ప్రమాదం ఉండటంతో స్థానికుల సహకారంతో అత్యంత జాగ్రత్తగా సహాయక చర్యలు చేపట్టారు. గంటల తరబడి శ్రమించిన అనంతరం, సొరంగం లోపల చిక్కుకుని ప్రాణభయంతో వణుకుతున్న ప్రభాకర్ రెడ్డిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అతనికి ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

గట్టిగా హెచ్చరించి పంపిన పోలీసులు

బంగారం కోసం దురాశతో వచ్చి తమతో పాటు రెస్క్యూ సిబ్బందికి చమటలు పట్టించిన ఆ వ్యక్తులను పోలీసులు గట్టిగా మందలించారు. సోషల్ మీడియాలో వ్యూస్ కోసం పెట్టే వీడియోలు, రీల్స్‌ను నిజమని నమ్మి ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని హెచ్చరించారు. భవిష్యత్తులో ఇలాంటి వెర్రి సాహసాలు చేయబోమని లిఖితపూర్వకంగా హామీ తీసుకుని, కౌన్సిలింగ్ ఇచ్చి వారి స్వగ్రామానికి పంపించివేశారు. సోషల్ మీడియా మాయలో పడి రియ

వీడియో చూడండి..

Follow Us