Jim Jim Tara Song: జిమ్ జిమ్ తార ఫుల్ సాంగ్ వచ్చేసింది.. మాస్ బీట్స్‌తో నెటిజన్లకు పూనకాలే.. మొత్తం పాట విన్నారా.. ?
సోషల్ మీడియాలో ప్రతి చిన్న విషయం క్షణాల్లో వైరలవుతుంది. కాస్తా క్రేజీగా ఎవరైనా కంటెంట్ చేస్తే చాలు క్షణాల్లో వందలాది లైక్స్, వేలాది షేర్స్ వస్తుంటాయి. దీంతో ఓవర్ నైట్ స్టార్స్ అయిపోయినవాళ్లు చాలా మంది ఉన్నారు. ఇక ఇప్పుడు నెట్టింటిని జిమ్ జిమ్ తార అనే సాంగ్ షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మేకర్స్ ఫుల్ సాంగ్ రిలీజ్ చేశారు.

ప్రస్తుతం సోషల్ మీడియాను తెలుగు ఫోక్ సాంగ్స్ షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే గత కొద్ది రోజులుగా జిమ్ జిమ్ తార.. జిమ్ జిమ్ తార.. జిలేబీ తేరా చిన్నోడా అనే పాట మాత్రం నెట్టింటిని ఊపేస్తుంది. ఎక్కడ చూసిన ఆ పాటకు సంబంధించిన రీల్స్ రచ్చ రచ్చ చేస్తున్నాయి. ఈ పాటపై నెట్టింట వేలకొద్దీ రీల్స్, మీమ్స్ పుట్టుకొచ్చాయి. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఈ పాటకు తమదైన స్టెప్పులతో తెగ హంగామా చేస్తున్నారు. అయితే ఈ పాట ప్రైవేట్ సాంగ్ కాదు.. పర్ణశాల అనే సినిమాలో ఉందన్న సంగతి చాలా మందికి తెలియదు. పర్ణశాల అనే సినిమా కోసం జి.లక్ష్మిదేవి రాసి పాడిన పాట ఇది. అయితే గతంలో ఈ పాటకు సంబంధించిన ప్రోమో రిలీజ్ చేయగా సోషల్ మీడియాలో సునామీ సృష్టించింది. ఇక ఇప్పుడు యూట్యూబ్ లో జిమ్ జిమ్ తార ఫుల్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్.
ఎక్కువమంది చదివినవి: Cinema : ఓటీటీలో వణుకుపుట్టిస్తోన్న తెలుగు సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్.. ట్రెండింగ్ అవుతున్న ఈ మూవీని చూశారా.. ?
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు వై.జి భరత్ మాట్లాడుతూ.. “మా పర్ణశాల సినిమా కోసం జి. లక్ష్మిదేవి గారు రాసి పాడిన జిమ్ జిమ్ తార పాటకు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన ఆనందాన్ని కలిగిస్తోంది. పూర్తి పాట విడుదల తర్వాత కూడా అదే స్థాయి స్పందన వస్తుంది. ఇప్పుడు మరింత సంతోషంగా ఉంది. పూర్తి పాటకు కూడా ప్రేక్షకుల నుంచి ఇదే స్థాయిలో మంచి స్పందన వస్తుందని ఆశిస్తున్నాం” అని అన్నారు. మరోవైపు జిమ్ జిమ్ తార ఫుల్ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది.
ఎక్కువమంది చదివినవి: Cinema: సినిమాగా తీసిన పాపులర్ నాటకం.. థియేటర్లను షేక్ చేసిన దాసరి మూవీ.. 225 రోజులు ఆడి రికార్డు..
ఈ చిత్రాన్ని ఎస్ఎల్టీ ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మాత మంచి వెంకట్ నిర్మిస్తున్నారు. హారర్ కామెడీతోపాటు సస్పెన్స్ థ్రిల్లర్ అంశాలను కలగలపి ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు చిత్రయూనిట్ తెలిపింది. ఇప్పటికే జిమ్ జిమ్ తార పాట ద్వారా ఈ సినిమా పై మరింత క్యూరియాసిటీ నెలకొంది. ఒక్క పాటతో విపరీతమైన పాపులారిటీ వచ్చేసింది.
ఎక్కువమంది చదివినవి: Trending Song: యూట్యూబ్ షేక్ చేస్తున్న బతుకమ్మ సాంగ్.. రెండు రోజుల్లోనే 7 లక్షల వ్యూస్.. డీజేలలో మారుమోగిపోతుంది..
జిమ్ జిమ్ తార సాంగ్..
ఎక్కువమంది చదివినవి: Tollywood : అలాంటి నటుడిని ఎక్కడా చూడలేదు.. అతడు ప్రపంచంలోనే నెంబర్ వన్ యాక్టర్.. టాలీవుడ్ విలన్..
