12 సినిమాలు చేస్తే 10 అట్టర్ ప్లాప్.. అయినా కుర్రాళ్ల ఫేవరేట్..

Rajitha Chanti

Pic credit - Instagram

12 October 2026

సినిమా పరిశ్రమలో రాణించాలంటే అందం, అభినయంతో పాటు అదృష్టం కూడా ఉండాలంటారు. ఎంత ప్రతిభ ఉన్నా కొన్నిసార్లు సరైన విజయాలు అందుకోవడం కష్టమవుతుంది.

టాలీవుడ్‌లో వరుస చిత్రాలు చేస్తున్నప్పటికీ, సక్సెస్‌లు తక్కువగా ఉన్నా తన ప్రత్యేకతను చాటుకుంటున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అందులో అనన్య నాగళ్ల ఒకరు.

షాదీ షార్ట్ ఫిలింతో కెరీర్ ప్రారంభించి ఈ అమ్మడు, ప్రియదర్శి సరసన 'మల్లేశం' చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ భామ వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తోంది 

కెరీర్ తొలినాళ్లలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలి సినిమా రంగంలోకి అడుగుపెట్టిన అనన్య, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 'వకీల్ సాబ్' చిత్రంలో కీలక పాత్ర పోషించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. 

ఆ తర్వాత 'మ్యాస్ట్రో', 'ఊర్వశివో రాక్షసివో', 'శాకుంతలం', 'మళ్లీపెళ్లి', 'పొట్టేల్', 'తంత్ర' వంటి పలు వైవిధ్యమైన చిత్రాల్లో నటించింది. ఇప్పటికీ అవకాశాలు అందుకుంటుంది.

 అయితే ఆమె కెరీర్‌లో చేసిన సుమారు 12 సినిమాలలో మెజారిటీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయాయి. కేవలం రెండు హిట్టయ్యాయి.

హిట్స్, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా విభిన్న కథాంశాలను ఎంచుకుంటూ వస్తోన్న అనన్య, సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉంటుంది.

ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ తన నటనతో ప్రశంసలు అందుకుంటూ, వరుస ప్రాజెక్ట్‌లతో టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది. ఇప్పుడు నెట్టింట యాక్టివ్.