AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Puri Jagannadh : వంద కోట్ల ఆస్తి పోయింది.. డైరెక్టర్ పూరి జగన్నాథ్‏ను వెన్నుపోటు పొడిచింది ఎవరో తెలుసా.. ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ పూరి జగన్నాథ్ చిత్రాలకు ఉండే మాస్ ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. ఒకప్పుడు స్టార్ హీరోలకు బ్లాక్ బస్టర్స్ అందించిన దర్శకుడు. ఆయన చిత్రాలు బాక్సాఫీస్ షేక్ చేశాయి. ఇప్పటికీ పూరి సినిమాలకు ఓ మార్క్ ఎలివేషన్ తప్పకుండా ఉంటుంది. ప్రస్తుతం విజయ్ సేతుపతితో కలిసి స్లమ్ డాగ్ సినిమాను తెరకెక్కిస్తున్నారు పూరి.

Puri Jagannadh : వంద కోట్ల ఆస్తి పోయింది.. డైరెక్టర్ పూరి జగన్నాథ్‏ను వెన్నుపోటు పొడిచింది ఎవరో తెలుసా.. ?
Puri Jagannadh Movies
Rajitha Chanti
|

Updated on: Oct 13, 2026 | 4:53 PM

Share

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రస్తుతం స్లమ్ డాగ్ చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సీనియర్ బ్యూటీ టబు కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇటీవల ఈ మూవీ నుంచి విడుదలైన ఈ మూవీ గ్లింప్స్ అంచనాలు పెంచేసింది. ఇదెలా ఉంటే.. గతంలో ఓ ఇంటర్వ్యూలో పూరి మాట్లాడుతూ తాను వందల కోట్ల ఆస్తి పోవడానికి గల కారణాలను వెల్లడించారు. శత్రువు విసిరిన కత్తి కంటే నమ్మిన స్నేహితుడు విసిరిన కత్తికే పదునెక్కువ అని, అది తనకు నిజ జీవితంలో చాలాసార్లు అనుభవమైందని ఆయన పేర్కొన్నారు. తన జీవితంలో నమ్మిన స్నేహితులు చేసిన మోసాల వల్ల దాదాపు వంద కోట్లకు పైగా ఆస్తిని పోగొట్టుకున్నానని పూరి జగన్నాథ్ వెల్లడించారు. కేవలం రచయితలు, దర్శకుల డైలాగులు మాత్రమే కాదని, నిజ జీవితంలో అలాంటి సంఘటనలు జరిగితేనే అవి అంతగా ప్రభావం చూపుతాయని పూరి జగన్నాథ్ అభిప్రాయపడ్డారు.

తనను నమ్మిన చాలామంది స్నేహితులు మోసం చేశారని, కత్తి విసరాల్సిన అవసరం లేకుండానే పక్క నుంచి పొడిచారని ఆయన గుర్తు చేసుకున్నారు. అదెలా జరిగిందో, ఎప్పుడు జరిగిందో కూడా తెలియకుండానే తన జీవితంలోకి ఆ నమ్మక ద్రోహం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ మోసాల కారణంగా తన మధ్యలో ఉన్న ఆస్తి మొత్తం పోయిందని, దాదాపు వంద కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని ఆయన సంచలన విషయాలను బయటపెట్టారు. ఒక దశలో తాను రోడ్డున పడ్డానని పూరి జగన్నాథ్ వివరించారు.

ఎక్కువమంది చదివినవి: Cinema : ఓటీటీలో వణుకుపుట్టిస్తోన్న తెలుగు సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్.. ట్రెండింగ్ అవుతున్న ఈ మూవీని చూశారా.. ?

తనకు డబ్బుపై పెద్దగా ఆసక్తి లేకపోవడం, కేవలం కథలు రాయడం, సినిమాలు తీయడం వంటి సృజనాత్మక పనులపైనే పూర్తిగా దృష్టి సారించడం వల్లే ఈ పరిస్థితి ఎదురైందని ఆయన తెలిపారు. ఎక్కడి నుంచి వచ్చాము, ఎంత ఎదిగాము అనేది తెలుసు కాబట్టి అప్పుడప్పుడు ఆర్థిక లెక్కలు చూసుకోవడం, ఏం జరుగుతుందో పర్యవేక్షించడం అవసరమని ఇప్పుడు తాను గుర్తించానని అన్నారు. డబ్బు వ్యవహారాలను ఇతరులకు అప్పగించి, వారిని గుడ్డిగా నమ్మడం తన తప్పేనని ఆయన అంగీకరించారు. తప్పు జరిగిన తర్వాతే అది తప్పని గ్రహించినట్లు ఆయన చెప్పారు.

ఎక్కువమంది చదివినవి: Cinema: సినిమాగా తీసిన పాపులర్ నాటకం.. థియేటర్లను షేక్ చేసిన దాసరి మూవీ.. 225 రోజులు ఆడి రికార్డు..

ఇప్పుడు తాను చాలా జాగ్రత్తగా ఉంటున్నానని, గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకుంటున్నానని పూరి జగన్నాథ్ స్పష్టం చేశారు. తనను మోసం చేసిన వ్యక్తి మళ్లీ ఎదురుపడితే, ఆ వ్యక్తిని తన మనసులో నుంచి పూర్తిగా చెరిపివేస్తానని, వాడు తన కళ్ళకు కనిపించడని, వాడు ఉన్నట్టే తాను పట్టించుకోనని ఆయన అన్నారు. మోసం చేసిన వ్యక్తి ఎదురుపడితే అసలు అతడు తనకు తెలియదన్నట్టే ఉంటానని అన్నారు. ఈ సంఘటనలు తన జీవితంలో ఒక పెద్ద పాఠాన్ని నేర్పాయని ఆయన చెప్పుకొచ్చారు.

ఎక్కువమంది చదివినవి: Trending Song: యూట్యూబ్ షేక్ చేస్తున్న బతుకమ్మ సాంగ్.. రెండు రోజుల్లోనే 7 లక్షల వ్యూస్.. డీజేలలో మారుమోగిపోతుంది..

ఎక్కువమంది చదివినవి: Tollywood : అలాంటి నటుడిని ఎక్కడా చూడలేదు.. అతడు ప్రపంచంలోనే నెంబర్ వన్ యాక్టర్.. టాలీవుడ్ విలన్..

Follow Us
నమ్మినోడే మోసం చేశాడు.. ఎదురుపడితే నేను చేసే పని అదే..
నమ్మినోడే మోసం చేశాడు.. ఎదురుపడితే నేను చేసే పని అదే..
ఇకపై లైసెన్స్ అంత ఈజీ కాదు భయ్యా.. ఈ టెస్ట్ పాస్ అవ్వకపోతే..
ఇకపై లైసెన్స్ అంత ఈజీ కాదు భయ్యా.. ఈ టెస్ట్ పాస్ అవ్వకపోతే..
మొదటి తరం మహానటి కన్నాంబ గురించి మీకు తెలియని విషయాలు..
మొదటి తరం మహానటి కన్నాంబ గురించి మీకు తెలియని విషయాలు..
IPL 2027లో ధోనీ ఆడతాడా..? తొలిసారి స్పందించిన సీఎస్కే సీఈవో
IPL 2027లో ధోనీ ఆడతాడా..? తొలిసారి స్పందించిన సీఎస్కే సీఈవో
మురళీ మోహన్ చెప్పిన మనీ సేవింగ్ ట్రిక్స్..  లైఫ్ చేంజింగ్ టిప్స్.
మురళీ మోహన్ చెప్పిన మనీ సేవింగ్ ట్రిక్స్..  లైఫ్ చేంజింగ్ టిప్స్.
ధోనికి సాధ్యంకాని ప్రపంచ రికార్డులో బంగ్లా దిగ్గజం..!
ధోనికి సాధ్యంకాని ప్రపంచ రికార్డులో బంగ్లా దిగ్గజం..!
గోరింటలు విరగబూయాలా? ఈ టిప్స్ పాటిస్తే..పండుగ వరకు పూలే పూలు!
గోరింటలు విరగబూయాలా? ఈ టిప్స్ పాటిస్తే..పండుగ వరకు పూలే పూలు!
పురుషులకు కూడా బ్రెస్ట్‌ క్యాన్సర్‌ క్యాన్సర్ వస్తుందా?
పురుషులకు కూడా బ్రెస్ట్‌ క్యాన్సర్‌ క్యాన్సర్ వస్తుందా?
ఒకేసారి ఇద్దరు.. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా మనోళ్లు..
ఒకేసారి ఇద్దరు.. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా మనోళ్లు..
ఎముకల్ని కూడా జీర్ణం చేసుకునే జీవులు ఏవో మీకు తెలుసా..?
ఎముకల్ని కూడా జీర్ణం చేసుకునే జీవులు ఏవో మీకు తెలుసా..?