AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గోరింటలు విరగబూయాలా? ఈ టిప్స్ పాటిస్తే..పండుగ వరకు పూలే పూలు!

బతుకమ్మ అంటేనే పూల పండుగ. అయితే చాలా మంది ఈ పండుగ కోసం వర్షాకాలం ప్రారంభంలోనే అనేక రకాల పూల మొక్కలు నాటుకుంటారు. ముఖ్యంగా గుమ్మడి పూలు, మందారం, సీతమ్మ పువ్వు, బంతి వంటి మొక్కలను నాటుకోవడం చూస్తుంటాం. ఇవే కాకుండా ప్రతి ఒక్కరి ఇంటిలో తప్పకుండా ఉండే మొక్కల్లో గోరింట మొక్కలు కూడా ఉంటాయి. వీటిని బతుకమ్మ పండుగ కోసం నాటుకుంటూ ఉంటారు.

Samatha J
|

Updated on: Oct 13, 2026 | 4:34 PM

Share
అయితే ఈ మొక్కలు చెట్టు నిండుగా పూస్తుంటాయి. కానీ కొన్ని సార్లు చెట్టు గుబురుగా పెరిగినప్పటికీ, కావాల్సినన్ని పూలు ఇవ్వదు. మొగ్గలు వేసినా అవి ఎండ వేడికి తట్టుకోలేక రాలిపోతుంటాయి. అయితే వారం రోజుల్లోనే చెట్టుకు ఉన్న మొగ్గలు రాలిపోకుండా పెద్దగా పూలు పూసి అవి తాజాగా, చాలా ఫ్రెష్‌గా ఉండాలి అంటే కొన్ని చిట్కాలు పాటించాలంట. అవి ఏవో ఇప్పుడు మనం చూసేద్దాం.

1 / 5
చాలా మంది ఈ మొక్కను ఎక్కువగా ఎండలో నాటుతుంటారు. కానీ వీటికి అంతగా ఎండ అవసరం ఉండదు. కేవలం ఉదయం వచ్చే ఎండ సరిపోతుంది. అయితే ఈ మొక్కలు గనుక కుండీలో ఉన్నట్లు అయితే మీరు వీటిని 11 తర్వాత తీసి కాస్త నీడగా ఉండే ప్రదేశంలో పెట్టడం వలన మొగ్గలు రాలిపోకుండా, పూసిన పువ్వులు తాజాగా ఉంటాయి.

2 / 5
అంతే కాకుండా గోరింట పూలు పండుగ సమయం వరకు ఎక్కువగా పూసి అవి తాజాగా కనిపించాలి అంటే తప్పకుండా ప్రతి రోజూ ఉదయం సాయంత్రం ఈ మొక్కకు నీరు పోయాలి. అప్పుడే మొక్క బలంగా ఉండి, పూలు కూడా త్వరగా ఆరిపోకుండా తాజాగా ఉంటాయి.

3 / 5
అంతే కాకుండా కొంత మంది మొక్కలో నీళ్లు నిల్చిపోయేలా చేస్తుంటారు. కానీ అలా చేయకూడదు. దీని కాండం చాలా మొత్తగా నీటితో నిండి ఉంటుంది కాబట్టి, పోయగానే నీరు ఇంకిపోయేలా వాటర్ పోయాలి. మరోసారి నీరు పోసే సమయంలో మొక్క వేరు భాగంలో నీరు లేకుండా ఉన్నప్పుడు మాత్రమే వాటర్ పోయాలి. లేకపోతే మొక్క కుళ్లిపోవడం, మొగ్గలు రాలిపోయే ప్రమాదం ఉంది.

4 / 5
అలాగే  ఈ మొక్క పూలు చాలా పేపర్ విధంగా ఉంటాయి. కాస్త ఎండ తాకినా వాడిపోయినట్లు కనిపిస్తాయి కాబట్టి కాస్త నీడ ఉండే ప్రదేశంలో పెట్టాలి. అంతే కాకుండా ఆకుల కింద ఉండే పూలను జాగ్రత్తగా చూసుకోవాలి. వాడిపోయిన పూలను మొగ్గలను తొలిగించాలి. తప్పకుండా అరటి పండు తొక్కల నీరు దీనికి పోయాలి. అప్పుడే మొక్క బాగా పూస్తుంది.

5 / 5
Follow Us