తెలంగాణలో రానున్న మూడు రోజులు పొడి వాతావరణం ఉండనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఎలాంటి వర్ష సూచనలు లేవు. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల నుండి తిరోగమిస్తున్నాయి. దేశవ్యాప్తంగా అవి పూర్తిగా ముగియనున్న తరుణంలో, దక్షిణ ద్వీపకల్పంలో ఈశాన్య రుతుపవనాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలిపింది.