రెండు అంగుళాల అల్లం, 10-12 వెల్లుల్లి రెబ్బలు, ఆరు పచ్చిమిర్చిలను కలిపి కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
రెండు గ్లాసుల బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి అరగంట పాటు నీళ్లలో నానబెట్టుకోవాలి. ఒక పెద్ద గిన్నెలో 2 లీటర్ల నీళ్లు పోసి మరిగించాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు, ఒక టేబుల్‌స్పూన్ ఉప్పు, ఒక అంగుళం దాల్చిన చెక్క, రెండు యాలకులు, ఒక బిర్యానీ ఆకు, ఒక చీల్చిన పచ్చిమిర్చి, రెండు లేదా మూడు నిమ్మకాయ స్లైస్‌లు, రెండు టేబుల్‌స్పూన్ల తరిగిన కొత్తిమీర, పుదీనా, అర టేబుల్‌స్పూన్ నూనె వేసి కలపాలి. నానబెట్టిన బాస్మతి బియ్యాన్ని నీళ్లు లేకుండా వడకట్టి, మరుగుతున్న నీటిలో వేయాలి. బియ్యం ఉడికే వరకు మీడియం ఫ్లేమ్‌లో మధ్యమధ్యలో కలుపుతూ ఉడికించాలి. బియ్యం ఉడికిన తర్వాత, పైన తేలుతున్న మసాలాలను తీసివేసి, బియ్యాన్ని వడకట్టి, మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. నిమ్మకాయ వేయడం వల్ల అన్నం పొడిపొడిలాడుతూ తెల్లగా వస్తుంది.