UGC NET 2025 Answer Key: యూజీసీ నెట్ 2025 తుది ఆన్సర్ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
యూజీసీ నెట్ డిసెంబర్ 2025 సెషన్ తుది ఆన్సర్ కీ (సవరించిన)ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుదల చేసింది. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు సవరించిన ఆన్సర్ కీలను ఆదివారం (ఏప్రిల్ 5) విడుదల చేసింది. ఏప్రిల్ 3న యూజీసీ నెట్ 2026 ఆన్సర్ కీ విడుదలైన సంగతి తెలిసిందే..

హైదరాబాద్, ఏప్రిల్ 5: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (యూజీసీ నెట్) డిసెంబర్ 2025 సెషన్ తుది ఆన్సర్ కీ (సవరించిన)ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుదల చేసింది. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు సవరించిన ఆన్సర్ కీలను ఆదివారం (ఏప్రిల్ 5) విడుదల చేసింది. ఏప్రిల్ 3న యూజీసీ నెట్ 2026 ఆన్సర్ కీ విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ కీలో అన్ని సబ్జెక్ట్‌లు లేవు. హిస్టరీ, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, కామర్స్, హిందీ సబ్జెక్టులకు మాత్రమే ఆన్సర్ కీలను విడుదదల చేసింది. వీటిపై విద్యార్థులు వ్యక్తం చేసిన అభ్యంతరాలు, కోర్టులో దాఖలైన పిటిషన్ల ప్రకారం ఎన్టీయే సవరించిన కీలను విడుదల చేసింది.
యూజీసీ నెట్-2025 తుది ఆన్సర్ కీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
హిస్టరీలో 4 ప్రశ్నల తొలగింపు
తాజాగా విడుదలైన ఆన్సర్ కీలలో అత్యధికంగా మార్పులు చోటు చేసుకుంది ఈ సబ్జెక్ట్‌లోనే. ఈ సబ్జెక్టులో ఎన్టీఏ 4 ప్రశ్నలను తొలగించింది. అలాగే 3 ప్రశ్నలకు రెండు సరైన సమాధానాలు ఉన్నట్లు గుర్తించింది. ఫిబ్రవరి 4న విడుదలైన కీ లో తప్పులు ఉన్నాయని విద్యార్థులు అభ్యంతరాలు లేవనెత్తడంతో ఈ మార్పులు చేశారు.
కామర్స్
జనవరి 3న మొదటి షిఫ్ట్‌లో జరిగిన కామర్స్ పేపర్ పరీక్షలో 3 ప్రశ్నలను తొలగించారు. ఇందులో ఒక ప్రశ్నకు రెండు సరైన సమాధానాలు ఇచ్చారు.
యూజీసీ నెట్-2025 తుది ఆన్సర్ కీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, హిందీ ఈ మూడు సబ్జెక్టులలో ఎటువంటి ప్రశ్నలను తొలగించలేదు.
కాగా యూజీసీ నెట్ డిసెంబర్ 2025 పరీక్షను డిసెంబర్ 31, 2025 నుంచి జనవరి 7, 2026 వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షల తాత్కాలిక జవాబు కీని జనవరి 14న విడుదల చేశారు. ఈ పరీక్షల తాత్కాలిక ఆన్సర్ కీలను జనవరి 14న విడుదల చేశారు. అయితే హిస్టరీ పేపర్‌లో కొన్ని ప్రశ్నల ఐడీలను సవాలు చేస్తూ కార్తికేయ కహోల్ అనే విద్యార్థి దాఖలు చేసిన రిట్ పిటిషన్ దాఖలు చేశాడు. 4324498604, 4324498530, 4324498544, 4324498600 అనే నాలుగు ప్రశ్న ఐడీలను సవాలు చేస్తూ, వాటిని సమీక్షించాలని కోర్టును కోరాడు.
దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. నిపుణుల కమిటీ సూచనల మేరకు సవరించిన ఈ 5 సబ్జెక్టుల కీలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.
యూజీసీ నెట్-2025 తుది ఆన్సర్ కీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




