Heavy Rain Alert: వాతావరణ శాఖ హెచ్చరిక.. వచ్చే 3 రోజులు రాష్ట్రంలో పిడుగులతో భారీ వర్షాలు!
రాష్ట్రానికి వాతావరణ శాఖ వర్ష సూచన చేసింది. మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ప్రకటించింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వాతావరణ మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఆవర్తనం ఉత్తరాంధ్రపై 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుంది. ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా..

అమరావతి , మార్చి 24: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వాతావరణ శాఖ వర్ష సూచన చేసింది. మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ప్రకటించింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వాతావరణ మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఆవర్తనం ఉత్తరాంధ్రపై 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుంది. ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. క్కడక్కడా పిడుగులతో కూడిన వానలు కురిసేందుకు అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
మెరుపులు, ఈదురుగాలులతో రాయలసీమ, కోస్తా జిల్లాల్లో వర్షాల అవకాశం ఉంది. అకాల వర్షాల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. పిడుగుపాట్ల ప్రమాదం ఉన్నందున బయటకు వెళ్లే వారు జాగ్రత్త వహించాలని సూచించింది. ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి.
మంగళవారం (మార్చి 24) పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, కడప, అన్నమయ్య, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లోనూ చొన్ని చోట్ల పిడుగులతో తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. వర్షాలు, పిడుగులు పడే సమయంలో జనాలు చెట్ల క్రింద, పొలాల్లో, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. బహిరంగ ప్రదేశాల్లో ఎత్తైన నిర్మాణాలు, చెట్ల కింద ఉండకూడదన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.




