AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Rules: రైల్వే టికెట్ల బుకింగ్ నుంచి క్రెడిట్ కార్డు వరకు.. నేటి నుంచి అమల్లోకి కొత్త రూల్స్.. తెలుసుకోకపోతే మీకే నష్టం..

ఆగస్ట్ 1 నుంచి కొన్ని రూల్స్ మారాయి. బ్యాంకింగ్ నిబంధనలతో పాటు కేవైసీ, రైల్వే టికెట్ల బుకింగ్ రూల్స్ మారాయి. వీటి గురించి ప్రతీఒక్కరూ తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందే. లేకపోతే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. నేటి నుంచి ఏయే రూల్స్ మారాయి అనేది చూద్దాం.

Venkatrao Lella
|

Updated on: Aug 01, 2026 | 3:34 PM

Share
ఆగస్ట్ 1 వచ్చేయడంలో అనేక కొత్త మార్పులు అమల్లోకి వచ్చేశాయి. కొత్త నెల వచ్చిందంటే చాలు ప్రజలను ఆర్ధికంగా ప్రభావితం చేసే అనేక రూల్స్ అమలు చేస్తూ ఉంటారు. ఇవి సామాన్య, మధ్యతరగతి ప్రజలను ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. ఎప్పటిలాగే ఈ నెల 1వ తేదీ నుంచి కూడా అనేక నూతన మార్పులు జరిగాయి. రైలు టిక్కెట్ బుకింగ్ నుండి క్రెడిట్ కార్డ్ నిబంధనల వరకు అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇవి మీ జేబుపై ఎలాంటి ప్రాభావితం చూపిస్తాయో ఇప్పుడు చూద్దాం.

1 / 5
తత్కాల్ టికెట్ల బుకింగ్ రూల్స్ ఆగస్ట్ 1 నుంచి మారాయి. మీరు రైల్వే స్టేషన్లలోని రిజర్వేషన్ కౌంటర్ వద్ద తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలంటే ఈ నిబంధనలను పాటించాల్సిందే. నేటి నుంచి కౌంటర్ల వద్ద టోకెన్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టనున్నారు. తొలుత కౌంటర్ దగ్గర ఒక టోకెన్ అందిస్తారు. టికెట్లు రిలీజ్ అయిన తర్వాత ఈ టోకెన్ చూపిస్తే తత్కాల్ టికెట్లను జారీ చేస్తారు. దీని వల్ల మీరు గంటల కొద్ది క్యూలైన్లలో నిల్చోవాల్సిన అవసరం ఉండదు. అంతేకాకుండా టికెట్ల జారీ ప్రక్రియ కూడా సులభతరం అవుతుంది.

2 / 5
ఇక ఆగస్ట్ 1వ తేదీ నుంచి సీకేవైసీ 2.0 వ్యవస్థను కేంద్రం ప్రవేశపెట్టనుంది. కేవైసీ ప్రక్రియను ఇది వేగవంతం చేయనుంది. బ్యాంకులు, బీమా సంస్థలు, మ్యూచువల్ ఫండ్స్, ఇతర ఆర్ధిక సంస్థల సేవలు పొందే సమయంలో మీరు ప్రతీసారి కేవైసీ కోసం గుర్తింపు పత్రాలను ఇవ్వాల్సిన పని లేదు. మీ సమ్మతితో సెంట్రల్ కేవైసీ డేటాబేస్ నుంచి మీ వివరాలను సంస్థలు ఆటోమేటిక్‌గా తీసుకుంటాయి. కేవైసీ సురక్షితంగా, వేగంగా చేయడానికి ఇది ఉపయోగపడనుంది.

3 / 5
ఇక నేటి నుంచి క్రెడిట్ కార్డు నిబంధనల్లో మార్పులు జరగనున్నాయి. లేట్ ఫీజులు, రివార్డ్ పాయింట్లు, ప్రాసెంసిగ్ ఫీజుల్లో సవరణలు జరిగాయి. కొన్ని బ్యాంకులు క్రెడిట్ కార్డు నిబంధనల్లో మార్పులు చేశాయి. మీరు ఏదైనా బ్యాంక్ క్రెడిట్ కార్డు వాడుతుంటే నేటి నుంచి ఎలాంటి మార్పులు జరిగాయో తెలుసుకోండి. మీ కార్డు కొత్త నిబంధనలు, షరతులను జాగ్రత్తగా పరిశీలించండి.

4 / 5
జులై 31తో ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేసేందుకు గడువు ముగిసింది. అధిక జీతం పొందే వ్యక్తులు దీనిని గమనించాలి. డెడ్ లైన్ ముగియడంతో ఐటీఆర్-1 లేదా ఐటీఆర్-2 ఉపయోగించి రిటర్న్స్ దాఖలు చేయలంటే నేటి నుంచి లేట్ ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం ఆధారంగా లేట్ ఫీజులు నిర్ణయిస్తారు.

5 / 5
Follow Us