దేశంలో తొలి ఎల్‌ఎన్జీ రైలు.. అదిరిపోయే ప్రత్యేకతలు..

Venkatrao Lella

Images: Pinterest

27 SEP 2026

దేశంలో తొలి ద్రవీకృత సహజ వాయువు (LNG) రైలు అందుబాటులోకి వచ్చింది. హోం మంత్రి అమిత్ షా సెప్టెంబర్ 27న దీనిని ప్రారంభించింది. ఎన్‌ఎజ్జీతో ఈ రైలు నడుస్తుంది.

ఈ తొలి LNG రైలు గుజరాత్‌లోని సబర్మతి స్టేషన్ నుండి బయలుదేరుతుంది. డీజిల్‌పై దేశం ఆధారపడటాన్ని తగ్గించందుకు ఈ రైలును తీసుకొచ్చారు.

ఈ రైలు పవర్ కార్లలో LNG ఆధారిత ఇంధన వ్యవస్థను ఉపయోగిస్తున్నారు. ఇందులో ఉండే డ్యూయల్-ఫ్యూయల్ టెక్నాలజీ ఇంధన లభ్యతను బట్టి ఒకే ఇంజన్‌ను LNG, డీజిల్ రెండింటిపై నడిచేలా చేస్తుంది.

ఈ ఇంజన్లు డీజిల్ వినియోగాన్ని తగ్గించేందుకు సహాయపడుతుంది. ప్రతి ఇంజన్‌కు సంవత్సరానికి సుమారు రూ.2.4 మిలియన్ల ఆదా అవుతుందని రైల్వే శాఖ చెబుతోంది.

రెండు ఇంజన్లకు 1,400 హార్స్‌పవర్ సామర్థ్యం ఉంది. ఇప్పటివరకు ఈ ఇంజన్లను 2 వేల కిలోమీటర్ల పాటు నడిపి విజయవంతంగా పరీక్షించారు. ఇంజన్లలో LNGని ఉపయోగించడం వల్ల డీజిల్ వినియోగాన్ని 40 శాతం వరకు తగ్గించవచ్చని చెబుతున్నారు.

LNG అందుబాటులో లేనప్పుడు ఇంజిన్ డీజిల్‌ను ఉపయోగించుకుంటుంది. ఇక డీజిల్ అందుబాటలో లేనప్పుడు ఎల్‌ఎన్జీని వాడుకుంటుంది. ఈ రైలు ప్రత్యేక ఇదేనని చెప్పవచ్చు.

కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. ఇక నైట్రోజన్, ఇతర హానికరమైన వాయువుల ఉద్గారాలు కూడా తగ్గుతాయి.

డీజిల్ కంటే ఎల్ఎన్జీ ధర చాలా తక్కువగా ఉంటుంది. ఈ ఇంజన్‌ను 8-కోచ్‌ల రైలును నడపడానికి ఉపయోగిస్తారు.

ఇంజన్‌ను ఎల్‌ఎన్జీతో నడపడం వల్ల ప్రతి ఇంజన్‌కు సంవత్సరానికి రూ.1.19 లక్షలు, లేదా మొత్తంగా సుమారు రూ.2.39 లక్షలు ఆదా అవుతుంది.