పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్.. రూ.వెయ్యి నుంచి ఎంతైనా సరే..
Venkatrao Lella
Images: Pinterest
28 SEP 2026
ప్రతీ నెలా తక్కువ సొమ్ము పొదుపు చేసుకునేవారి కోసం పోస్టాఫీసులో అనేక సేవింగ్స్ స్కీమ్స్ అందుబాటులో ఉంటాయి. బ్యాంక్ డిపాజిట్ల కంటే అధిక వడ్డీ రేటు వీటిల్లో పొందవచ్చు. మీ డబ్బులకు ఎటువంటి రిస్క్ కూడా ఉండదు.
మీ పెట్టుబడికి స్థిరమైన వడ్డీ రేటు పొందాలంటే పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ పథకం బాగా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఈ స్కీ్మ్ వడ్డీ రేటు 7.5 శాతంగా ఉంది. బ్యాంక్ ఎఫ్‌డీల కంటే ఇది ఎక్కువ.
ఈ స్కీమ్‌లోని పెట్టుబడులకు కేంద్ర ప్రభుత్వం హామీ ఇస్తుంది. దీంతో మీ నగదు పూర్తిగా సురక్షితంగా ఉంటుంది. మీ పెట్టుబడికి ఏదైనా నష్టం జరిగినా కేంద్ర పరిహారం కూడా అందిస్తుంది.
పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ స్కీములో వడ్డీ రెట్లు మీరు పెట్టుబడి పెట్టే కాల వ్యవధిని బట్టి మారతాయి. ఒక ఏడాది కాలపరిమితి గల డిపాజిట్లకు 6.90 శాతం, రెండేళ్ల డిపాజిట్లకుక 7 శాతం, మూడేళ్ల డిపాజిట్లకు రూ.7.10 శాతం, ఐదేళ్ల డిపాజిట్లకు 7.50 శాతంగా ఉంది.
వడ్డీ రేట్లను కేంద్రం ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటుంది. దీంతో భవిష్యత్తులో రేట్లను పెంచే అవకాశం కూడా ఉంటుంది. అప్పుడు మీ రాబడి కూడా పెరగుతుంది.
ఈ పోస్టాఫీస్ స్కీములో కనీస పెట్టుబడి రూ.వెయ్యి నుంచి స్టార్ట్ చేయవచ్చు. గరిష్ట పరిమితి లేకపోవడం వల్ల మీరు ఎంత అయినా పెట్టుబడి పెట్టవచ్చు. తక్కువ మొత్తంలో డబ్బులు పొదుపు చేసుకోవాలనుకునేవారికి ఇది మంచి ఎంపిక.
ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసేవారు ఇన్‌కమ్ ట్యాక్స్ మినహాయింపులు కూడా పొందవచ్చు. ఐదేళ్ల డిపాజిట్లకు సెక్షన్ 80సీ ప్రకారం ట్యాక్స్ రిలీఫ్ కూడా ఉంది. వడ్డీపై మాత్రమే పన్ను ఉంటుంది.
ఐదేళ్ల డిపాజిట్లపై 7.50 శాతం అత్యధిక వడ్డీ రేటు ఉంది. దీంతో దీర్ఘకాలంలో పెట్టుబడి పెట్టేవారికి ఇది మంచి ఎంపికగా చెప్పవచ్చు.
సమీపంలోని పోస్టాఫీస్‌కు వెళ్లి ఇందులో సులువుగా పెట్టుబడి పెట్టవచ్చు. డాక్యుమెంటేషన్ ప్రాసెస్ కూడా ఎక్కువగా ఉండదు. ఈ ఖాతాను సులువుగా తెరవొచ్చు.