AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Varun Tej: కొరియన్ కనకరాజు ట్రైలర్ వేడుకలో వరుణ్ తేజ్.. కాలు గాయంపై అప్డేట్ ఇచ్చిన హీరో..

ఈమధ్య కాలంలో టాలీవుడ్ స్టార్ హీరోలంతా వరుసగా గాయలపాలవుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ, రామ్ చరణ్, రష్మికతోపాటు వరుణ్ తేజ్ సైతం షూటింగ్ సమయంలో గాయపడ్డారు. ఇటీవల తన కొత్త సినిమా ఫస్ట్ సింగిల్ సాంగ్ రిలీజ్ వేడుకలో చేతిలో సాయంగా స్టిక్ పట్టుకుని నడుస్తూ వచ్చారు వరుణ్ తేజ్. ఇక తాజాగా జరిగిన ట్రైలర్ రిలీజ్ వేడుకలోనూ స్టిక్ పట్టుకుని కనిపించారు.

Varun Tej: కొరియన్ కనకరాజు ట్రైలర్ వేడుకలో వరుణ్ తేజ్.. కాలు గాయంపై అప్డేట్ ఇచ్చిన హీరో..
Varun Tej
Rajitha Chanti
|

Updated on: Aug 01, 2026 | 4:30 PM

Share

టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా కొరియన్ కనకరాజు. కొన్ని నెలలుగా షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ ఇప్పుడు ఎట్టకేలకు ఆగస్ట్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తుంది చిత్రయూనిట్. అయితే ఇటీవల ఈ సినిమా ఫస్ట్ సింగిల్ రిలీజ్ సమయంలో చేతిలో సాయంగా స్టిక్ పట్టుకుని నడుస్తూ కనిపించారు వరుణ్ తేజ్. దీంతో షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదంలో కాలికి గాయమైందని వెల్లడించారు. గత మూడు నెలలుగా ఇంట్లోనే ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నాడు వరుణ్. కానీ ఇప్పుడు తన కొత్త సినిమా కొరియన్ కనకరాజు ప్రచార కార్యక్రమాల్లో మాత్రం స్టిక్ పట్టుకుని మెల్లిగా నడుస్తూ ప్రమోషన్స్ చేస్తున్నాడు.

ఎక్కువమంది చదివినవి : Ramayana Trailer : ఏముందిరా బాబూ.. కుర్రాళ్లు తెగ వెతుకున్న చిన్నది.. రామాయణ ట్రైలర్‏లో తనే స్పెషల్..

ఈ క్రమంలోనే తాజాగా విడుదలైన కొరియన్ కనకరాజు ట్రైలర్ లాంచ్ వేడుకకు సైతం స్టిక్ పట్టుకుని మెల్లిగా నడుస్తూ వచ్చాడు వరుణ్ తేజ్. తన కాలి గాయం ఎలా ఉందంటూ మీడియా అడగడంతో.. వరుణ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం పర్వాలేదని.. ఇంకా తాను పూర్తిగా కోలుకోవడానికి దాదాపు రెండు నుంచి మూడు నెలల సమయం పడుతుందని అన్నారు. తాను కోలుకున్న తర్వాతే నెక్ట్స్ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుందని అన్నారు. దీంతో వరుణ్ తేజ్ త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్.

ఎక్కువమంది చదివినవి : Tollywood : రూ.16 కోట్లతో తీస్తే 400 కోట్ల కలెక్షన్.. యావత్ దేశమే ఆశ్చర్యపోయేలా చేసిన సినిమా..

ఇక కొరియన్ కనకరాజు సినిమా విషయానికి వస్తే.. ఈ చిత్రాన్ని మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తుండగా.. ఇందులో రితిక నాయక్ కథానాయికగా నటిస్తుంది. ఇందులో సత్య, డీజీ టిల్లు ఫేమ్ మురళీధర్, చైల్డ్ ఆర్టిస్ట్ బుల్లిరాజు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 7న థియేటర్లలో విడుదల చేయనున్నారు.

ఎక్కువమంది చదివినవి : Aamani : సినిమాలు మానేసి సీరియల్స్ చేయడానికి కారణం అదే.. ఎట్టకేలకు ఆమని ఓపెన్ కామెంట్స్..

ఎక్కువమంది చదివినవి : ఎక్కువ మంది చదివినవి : K. Raghavendra Rao: ఆ హీరోయిన్‏తో 24 సినిమాలు చేశా.. అలాంటి చావు ఎవరికీ రాకూడదు.. డైరెక్టర్ రాఘవేంద్ర రావు..

Follow Us
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
సూర్యవంశీకి షాకిచ్చిన.. టీమ్‌ లిస్ట్‌లో బుడ్డోడి పేరు గల్లంతు
సూర్యవంశీకి షాకిచ్చిన.. టీమ్‌ లిస్ట్‌లో బుడ్డోడి పేరు గల్లంతు
క్రెడిట్ కార్డులు వాడుతున్నారా..? ఆర్బీఐ కొత్త రూల్..
క్రెడిట్ కార్డులు వాడుతున్నారా..? ఆర్బీఐ కొత్త రూల్..
ఓటీటీలో దుమ్మురేపుతోన్న మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
ఓటీటీలో దుమ్మురేపుతోన్న మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
మన పూర్వికులు బలానికి 100ఏళ్ల రహస్యం ఇదే..
మన పూర్వికులు బలానికి 100ఏళ్ల రహస్యం ఇదే..
బాత్రూమ్ టైల్స్‌పై మొండి మరకలా? ఈ సింపుల్ చిట్కాలతో మెరిపించండి!
బాత్రూమ్ టైల్స్‌పై మొండి మరకలా? ఈ సింపుల్ చిట్కాలతో మెరిపించండి!
రూ.5 ట్రాక్టర్ ఫొటో నోటు మీ దగ్గర ఉందా..? మీరే లక్షాధికారి..
రూ.5 ట్రాక్టర్ ఫొటో నోటు మీ దగ్గర ఉందా..? మీరే లక్షాధికారి..
సెప్టెంబర్‌లో పుట్టారా? మీలో ఈ గుణాలు కన్ఫర్మ్ గా ఉంటాయట!
సెప్టెంబర్‌లో పుట్టారా? మీలో ఈ గుణాలు కన్ఫర్మ్ గా ఉంటాయట!
ఇంట్లో డబ్బు, సంతోషం ఉండాలంటే డస్ట్‌బిన్‌ను ఇలా ఉంచాలట!
ఇంట్లో డబ్బు, సంతోషం ఉండాలంటే డస్ట్‌బిన్‌ను ఇలా ఉంచాలట!
ఆ స్టార్ హీరో సినిమా కోసం చాలా కష్టపడ్డాం.. కానీ
ఆ స్టార్ హీరో సినిమా కోసం చాలా కష్టపడ్డాం.. కానీ