AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: విపరీతమైన అందమే ఆమెకు అవకాశాలు లేకుండా చేసింది.. ఈ హీరోయిన్‏కు కలిసిరాని అదృష్టం..

ఆమె అందమే ఆమెకు శత్రువుగా మారిందని తెలిస్తే మీరు నిజంగానే ఆశ్చర్యపోతారు. ఆమె ఎక్కువ అందంగా ఉన్నందుకు ఆమెను ఆనేక చిత్రాల నుంచి తొలగించారు. మీరు విన్నది నిజమే.. చాలా మంది డైరెక్టర్స్ ఆ నటిని 'మెయిన్ స్ట్రీమ్ ' నుంచి తీసేశారు. ఇంతకీ అందమే శాపంగా మారిన అమ్మాయి ఎవరో తెలుసా..?

Tollywood: విపరీతమైన అందమే ఆమెకు అవకాశాలు లేకుండా చేసింది.. ఈ హీరోయిన్‏కు కలిసిరాని అదృష్టం..
Actress
Rajitha Chanti
|

Updated on: Oct 06, 2024 | 7:47 AM

Share

సినీపరిశ్రమలో హీరోయిన్‏గా వెలిగిపోవాలంటే అందం, ఫిట్నెస్ ముఖ్యమే అని చాలా మంది నమ్మకం. నిజానికి సినీరంగుల ప్రపంచంలో నటిగా ఓ వెలుగు వెలగాలంటే టాలెంట్ తోపాటు అదృష్టం కూడా కావాలిస. కానీ ఇప్పుడు మేము చెప్పబోయే ఓ నటికి మాత్రం అందుకు విరుద్ధంగా ఉంటుంది. అందం, అంతకు మించిన టాలెంట్ ఉన్నప్పటికీ ఆమెకు సినిమాల్లో అంతగా అవకాశాలు రాలేదు. ఆమె అందమే ఆమెకు శత్రువుగా మారిందని తెలిస్తే మీరు నిజంగానే ఆశ్చర్యపోతారు. ఆమె ఎక్కువ అందంగా ఉన్నందుకు ఆమెను ఆనేక చిత్రాల నుంచి తొలగించారు. మీరు విన్నది నిజమే.. చాలా మంది డైరెక్టర్స్ ఆ నటిని ‘మెయిన్ స్ట్రీమ్ ‘ నుంచి తీసేశారు. ఇంతకీ అందమే శాపంగా మారిన అమ్మాయి ఎవరో తెలుసా..? తనే బాలీవుడ్ నటి దియా మిశ్రా. ఈబ్యూటీ తండ్రి జర్మన్, తల్లి బెంగాలీ.

దియా మిశ్రా తల్లిదండ్రులు కొన్నాళ్లకే విడిపోవడంతో తల్లి మరో పెళ్లి చేసుకుంది. అందుకే ఈ అమ్మడు తన తల్లిదండ్రుల ఇంటిపేరును ఉపయోగించుకోలేదు. 2001లో, మాధవన్, రీమాసేన్ నటించిన తమిళ సూపర్ హిట్ మిన్నెలే మూవీ హిందీ రీమేక్ లో నటించింది. ఈ చిత్రాన్ని హిందీలో రెహనా హై తేరే దిల్ మే’ తెరకెక్కించగా.. ఇందులో మాధవన్ సరసన నటించడం ద్వారా హిందీ చిత్రసీమలో హీరోయిన్‌గా అరంగేట్రం చేసింది. సినిమాలో మాధవన్, దియా మధ్య కెమిస్ట్రీ హిట్ అయ్యింది. మొదటి చిత్రంలో నటి అందం, నటన గురించి మాట్లాడుకున్నారు. అయితే ఈ మూవీ తర్వాత ఆఫర్స్ తగ్గిపోయాయి.

నట దియా మీర్జా విపరీతమైన అందం కారణంగా చాలా సినిమాల అవకాశాలు కోల్పోయింది. నటి దియా మీర్జా మంచి కథతో అర్థవంతమైన చిత్రాలపై ఆసక్తిని కనబరిచింది, అయితే ఆ పాత్ర కోసం ఆమె చాలా బాగుంది అని చిత్ర దర్శకులు ఆమెను తిరస్కరించారు. ఓ ఇంటర్వ్యూలో నటి దియా మీర్జా మాట్లాడుతూ.. ‘ దర్శకులు నన్ను ‘మెయిన్ స్ట్రీమ్’ నటిగా చూశారు కాబట్టి నేను కోరుకున్న మంచి కథతో సినిమాలో నటించే అవకాశం రాలేదు’ అంటూ చెప్పుకొచ్చింది. ఆమె విపరీతమైన అందం ఎన్నో మంచి చిత్రాల్లో నటించే అవకాశాలకు తగ్గిపోయింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
లీటరు పాలతో ఎంత పనీర్ వస్తుందో తెలుసా..? ఏ మిల్క్ వాడితే ..
లీటరు పాలతో ఎంత పనీర్ వస్తుందో తెలుసా..? ఏ మిల్క్ వాడితే ..
ఒకప్పుడు చిరంజీవి, నాగార్జునతో బ్లాక్ బస్టర్ హిట్స్.. ఇప్పుడు ఇలా
ఒకప్పుడు చిరంజీవి, నాగార్జునతో బ్లాక్ బస్టర్ హిట్స్.. ఇప్పుడు ఇలా
వాటర్ ట్యాంక్ నిర్లక్ష్యం ప్రాణాలకే ముప్పు.. 100మందికి అస్వస్థత!
వాటర్ ట్యాంక్ నిర్లక్ష్యం ప్రాణాలకే ముప్పు.. 100మందికి అస్వస్థత!
గర్భిణీ అని కూడా చూడకుండా.. అత్తింటి అరాచకం!
గర్భిణీ అని కూడా చూడకుండా.. అత్తింటి అరాచకం!
వర్షాకాలంలో మిద్దెపై ఇలా చేస్తే కూరగాయలు బుట్టలు బుట్టలు కాస్తాయ్
వర్షాకాలంలో మిద్దెపై ఇలా చేస్తే కూరగాయలు బుట్టలు బుట్టలు కాస్తాయ్
ఇలాంటి సిలిండర్‌ను అస్సలు తీసుకోకండి.. ఇది చాలా మందికి తెలియదు
ఇలాంటి సిలిండర్‌ను అస్సలు తీసుకోకండి.. ఇది చాలా మందికి తెలియదు
గురు గ్రహం అనుకూలత.. త్వరలో ఈ రాశుల వారికి వివాహ యోగం..!
గురు గ్రహం అనుకూలత.. త్వరలో ఈ రాశుల వారికి వివాహ యోగం..!
అయోధ్య విరాళాల కేసుపై చంపత్ రాయ్ స్పష్టత..!
అయోధ్య విరాళాల కేసుపై చంపత్ రాయ్ స్పష్టత..!
నా వల్ల కాదు బాబోయ్.. బిగ్ బాస్‏కు వెళ్లే ఓపిక నాకు లేదు..
నా వల్ల కాదు బాబోయ్.. బిగ్ బాస్‏కు వెళ్లే ఓపిక నాకు లేదు..
గుడ్ల కంటే ఎక్కువ ప్రొటీన్ కావాలా?శాకాహారులకు వరంఈ 5 సూపర్ ఫుడ్స్
గుడ్ల కంటే ఎక్కువ ప్రొటీన్ కావాలా?శాకాహారులకు వరంఈ 5 సూపర్ ఫుడ్స్