AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhanush: రజనీకాంత్ కొత్త సినిమా.. ఒకే థియేటర్‌లో వీక్షించిన ధనుష్, ఐశ్వర్య.. వీడియో చూడండి

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'వేట్టయన్' చిత్రం గురువారం (అక్టోబర్ 10) ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. జై భీమ్ తో ప్రశంసలు అందుకున్న టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించగా, 'లైకా ప్రొడక్షన్స్' సంస్థ అత్యంత భారీ బడ్జెత్ ట్ తో ఈ సినిమాను నిర్మించింది. తమిళనాడులో ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్‌ వచ్చాయి

Dhanush: రజనీకాంత్ కొత్త సినిమా.. ఒకే థియేటర్‌లో వీక్షించిన ధనుష్, ఐశ్వర్య.. వీడియో చూడండి
Rajinikanth, Aishwarya, Dhanush
Basha Shek
|

Updated on: Oct 11, 2024 | 8:30 PM

Share

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘వేట్టయన్’ చిత్రం గురువారం (అక్టోబర్ 10) ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. జై భీమ్ తో ప్రశంసలు అందుకున్న టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించగా, ‘లైకా ప్రొడక్షన్స్’ సంస్థ అత్యంత భారీ బడ్జెత్ ట్ తో ఈ సినిమాను నిర్మించింది. తమిళనాడులో ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్‌ వచ్చాయి. ఇక తెలుగు నాట కూడా పాజిటివ్ రెస్పాన్స్ నే వచ్చింది. ఓవరాల్ గా వేట్టయన్ కు మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ 70 కోట్లకు పైగానే వసూళ్లు వచ్చాయని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఆశ్చర్యకరంగా నటుడు ధనుష్‌, ఆయన మాజీ భార్య ఐశ్వర్య రజనీకాంత్‌ ఒకే థియేటర్‌లో ‘వేట్టయన్‌’ చిత్రాన్ని వీక్షించారు. సాధారణంగా రజనీకాంత్ అభిమానులు మొదటి రోజు మొదటి షోని మిస్ చేసుకోరు. ఈ క్రమంలో ధనుష్ కూడా అభిమానులతో కలిసి ‘వేట్టయన్’ సినిమాను వీక్షించారు. రజనీకాంత్ భార్య లత, పిల్లలు ఐశ్వర్య, సౌందర్య, మనవరాళ్లు యాత్ర, లింగా ఒకే థియేటర్‌లో ఈ సినిమాను చూశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ధనుష్, ఐశ్వర్య 2004లో వివాహం చేసుకున్నారు. అయితే 2022లో అనూహ్యంగా విడాకులు తీసుకున్నారు. పెళ్లయిన 18 ఏళ్ల తర్వాత విడిపోయి అభిమానులను ఆశ్చర్యపరిచారు. ధనుష్ విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నా రజనీకాంత్ పట్ల అఅతనికున్న గౌరవం, అభిమానం ఏమాత్రం తగ్గలేదు. ‘వేట్టయన్’ సినిమాని తొలిరోజు వీక్షించడమే ఇందుకు నిదర్శనం. వేట్టయన్ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ కూడా కీలక పాత్రలో నటించడం విశేషం. ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్, రితికా సింగ్, దుషారా విజయన్ తదితరులు కూడా ఈ సినిమాలో మెరిశారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకత్వం వహించారు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇదిగో..

వేట్టయన్ సినిమాలో రజనీకాంత్, మంజూ వారియర్..

ఓవర్సీస్ లోనూ భారీ వసూళ్లు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
JEE Main 2026 అడ్మిక్‌ కార్డుల విడుదల తేదీ ఇదే.. డైరెక్ట్‌ లింక్‌
JEE Main 2026 అడ్మిక్‌ కార్డుల విడుదల తేదీ ఇదే.. డైరెక్ట్‌ లింక్‌
శరీరంలోని ఈ భాగాలకు బీట్‌రూట్ ఎంత ముఖ్యమో తెలుసా..?
శరీరంలోని ఈ భాగాలకు బీట్‌రూట్ ఎంత ముఖ్యమో తెలుసా..?
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
వారంలో ఈ రోజున డబ్బు ఇస్తే అంతే సంగతులు.. లక్ష్మీదేవి కటాక్షం..
వారంలో ఈ రోజున డబ్బు ఇస్తే అంతే సంగతులు.. లక్ష్మీదేవి కటాక్షం..
మహేష్ బాబు నాపై సీరియస్ అయ్యాడు.. ఎవరైనా అడిగారా.? అంటూ తిట్టాడు
మహేష్ బాబు నాపై సీరియస్ అయ్యాడు.. ఎవరైనా అడిగారా.? అంటూ తిట్టాడు