Game Changer: ఇట్స్ అఫీషియల్.. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఫ్యాన్స్‌కు పండగే

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’. శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే పోస్టర్స్, సాంగ్స్ తో గేమ్ ఛేంజర్ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

Game Changer: ఇట్స్ అఫీషియల్.. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఫ్యాన్స్‌కు పండగే
ఒకటి కాదు, రెండు కాదు.. పలు గెటప్పుల్లో ఫ్యాన్స్ కి కన్నులపండగ చేశారు రామ్‌చరణ్‌. లక్నోలో జరిగిన టీజర్‌ లాంచ్‌ ఈవెంట్ ని కూడా సరికొత్తగా ప్లాన్‌ చేశారు మేకర్స్.
Follow us
Basha Shek

|

Updated on: Oct 12, 2024 | 8:49 PM

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’. శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే పోస్టర్స్, సాంగ్స్ తో గేమ్ ఛేంజర్ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 10న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో విడుద‌ల చేస్తున్నారు. కాగా ఈ మూవీ నుంచి ఇప్పటికే వదిలిన పోస్టర్స్, ‘జరగండి జరగండి..’, ‘రా మ‌చ్చా మ‌చ్చా’ సాంగ్స్‌కు ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్ వ‌చ్చాయి. యూట్యూబ్ లో ‘రా మ‌చ్చా మ‌చ్చా’ 55+ మిలియన్ వ్యూస్ తొ ట్రెండింగ్ లో ఉంది. తాజాగా మూవీ రిలీజ్ డేట్ పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. పోస్ట‌ర్‌లో రామ్ చ‌ర‌ణ్ స్టైలిష్ లుక్‌లో అద‌ర‌గొట్టాడు. ఇక డైరెక్ట‌ర్ శంక‌ర్ లార్జర్ దేన్ లైఫ్ సినిమాల‌ను తెర‌కెక్కించ‌ట‌మే కాకుండా, అభిమానుల‌కు, ప్రేక్ష‌కుల‌కు సినిమా డిఫ‌రెంట్ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందిస్తుంటారు. రామ్ చ‌ర‌ణ్‌లాంటి మాస్ హీరో ఉన్న‌ప్పుడు ఆ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఎలా ఉంటుందో చూడాల‌ని మెగాభిమానులు, మూవీ ల‌వర్స్ ‘గేమ్ ఛేంజ‌ర్‌’ కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న తెర‌కెక్కించిన సినిమాల‌ను మించేలా ‘గేమ్ ఛేంజ‌ర్‌’ను ఆయ‌న రూపొందిస్తున్నారు. పవరఫుల్ రోల్ లో చ‌ర‌ణ్‌ను ప్రెజెంట్ చేస్తున్నారు శంక‌ర్‌.

కాగా గేమ్ చేంజర్ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీత సారథ్యం వహిస్తున్నారు. రామ‌జోగ‌య్య శాస్త్రి, అనంత శ్రీరామ్‌, కాస‌ర్ల శ్యామ్‌ సాహిత్య అందించారు. ప్రముఖ ఆడియో కంపెనీ సారేగమ ఈ సినిమా ఆడియో రైట్స్‌ను ఫ్యాన్స్ ప్రైజ్‌కి దక్కించుకుంది. ఇందులో అంజ‌లి, సముద్ర‌ఖ‌ని, ఎస్‌.జె.సూర్య‌, శ్రీకాంత్‌, సునీల్‌, న‌వీన్ చంద్ర త‌దిత‌రులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బ‌రాజ్‌ ఈ సినిమాకు కథ అందించగా, సాయి మాధవ్ బుర్ర డైలాగులు సమకూర్చారు. ప్ర‌భుదేవా, గ‌ణేష్ ఆచార్య‌, ప్రేమ్ ర‌క్షిత్‌, బాస్కో మార్టిస్, జానీ, శాండీ ఇలా ప్రముఖ కొరియోగ్రాఫర్లు ఈ సినిమాకు పనిచేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .

భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.