Ustaad Bhagat Singh: ఆ డైరెక్టరే నన్ను రెండు మూడేళ్లు పోషించారు.. జీవితాంతం గుర్తు పెట్టుకుంటా: హరీశ్ శంకర్
మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ తర్వాత కొద్దిగా గ్యాప్ తీసుకున్నారు డైరెక్టర్ హరీశ్ శంకర్. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో కలిసి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో మళ్లీ ఆడియెన్స్ ముందుకొస్తున్నారు. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఓజీ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత పవన్ కల్యాణ్ నటిస్తోన్న తాజా చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. హరీశ్ శంకర్ తెరకెక్కిస్తోన్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. తమిళ సీనియర్ నటుడు పార్థీబన్ మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చగా, తమన్ బీజీఎమ్ స్కోర్ అందించారు. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఉగాది కానుకగా మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో సినిమా ప్రమోషన్లలో స్పీడ్ పెంచారు మేకర్స్. శనివారం (మార్చి 14) ట్రైలర్ ను రిలీజ్ చేయగా ఆదివారం (మార్చి 15) హైదరాబాద్ వేదికగా ఉస్తాద్ ప్రీ రీలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. కాగా ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా పలు ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు డైరెక్టర్ హరీశ్ శంకర్. ఈ సందర్భంగా తన సినిమా కెరీర్ కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యకు హాజరైన ఆయన డ్యాషింగ్ అండే డేరింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. త
‘ఇండస్ట్రీకి రాకముందు యండమూరి ప్రభావం నాపై ఎంత ఉందో.. సినిమాల్లోకి వచ్చాక పూరి జగన్నాథ్ గారి ప్రభావం అంత కన్నా ఎక్కువగా ఉంది. తెలుగు సినీ పరిశ్రమలో నాలో స్ఫూర్తి నింపిన వ్యక్తి పూరి గారు. నా మొదటి సినిమా (షాక్) సరిగా ఆడలేదు. అప్పుడు ఆయనే పిలిచి, ‘మనం రామ్‌చరణ్‌ను పరిచయం చేస్తున్నాం. నువ్వు నాతో ఉండు. పెళ్లయి కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తున్న వ్యక్తి తీసిన సినిమా ఆడకపోతే ఆ జీవితం ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఇబ్బంది పడొద్దు అని భరోసా ఇచ్చారు. పూరీ ఒక ట్రెండ్ సెట్టింగ్ రైటర్. అలాంటి వ్యక్తికి రైటింగ్‌లో మనం ఏ సలహాలు ఇస్తాం. కానీ ఆయన రైటర్‌గా రెండు, మూడేళ్లు ట్యాగ్ ఇచ్చి నన్ను పోషించారు. ఆయన చేసిన సాయం నా జీవితంలో మర్చిపోలేను. ‘షాక్’ వరకూ రవితేజ గారు నాకు ఎలాగైతే హెల్ప్ చేశారో.. ఆ తర్వాత పూరిగారు అంతే నన్ను చేరదీశారు. సినిమా మేకింగ్ గురించి వివరించారు. పూరీతో పనిచేయడం అదొక పెయిడ్ ఇంటర్న్‌షిప్. ఇండస్ట్రీకి వచ్చేవాళ్లు 100 ఆలోచనలతో వస్తారు. ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ లెక్కలు, కమర్షియల్ ఎలిమెంట్స్, రెవెన్యూ మోడల్ ఆ ఆలోచనలను పలుచన చేస్తాయి. సినిమా ఇండస్ట్రీని మనం ఏమీ మార్చాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీ మనల్ని మార్చకపోతే చాలు. మొదట నీలో ప్రేక్షకుడు చచ్చిపోకూడదు. సిఇనమా ఇండస్ట్రీలో రచయితలకు పారితోషికాలు, క్రెడిట్ తక్కువ. ఈ విషయంలో నేను మొదటినుంచి కచ్చితంగా వ్యవహరిస్తున్నా’ అని హరీశ్ శంకర్ చెప్పుకొచ్చారు.
మరికాసేపట్లో ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




