Singham Again: సింగం వెనక అంత పెద్ద కథ ఉందా ??
సింగం అగైన్‌లో అంత మంది హీరోలుండటానికి కారణమేంటి..? నిజంగానే కథ డిమాండ్ చేసిందా లేదంటే సౌత్ హీరోలు సృష్టించిన రికార్డులను బద్దలు కొట్టాలని బాలీవుడ్ అంతా ఒక్కటైందా..? ఎందుకంటే మన ఊరిలో పక్క ఊరోడి డామినేషన్ తట్టుకోలేం కదా..? ఇప్పుడు సింగం తీరు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. అసలు రోహిత్ శెట్టి ప్లాన్ ఏంటి..? దక్షిణాది హీరోల దండయాత్ర బాలీవుడ్‌పై బలంగానే ఉందిప్పుడు. ఆల్రెడీ ప్రభాస్, అల్లు అర్జున్ అక్కడ పాగా వేసారు.. తాజాగా ఎన్టీఆర్ కూడా దేవరతో తన ముద్ర వేసారు..
Updated on: Oct 12, 2024 | 8:33 PM

సింగం అగైన్‌లో అంత మంది హీరోలుండటానికి కారణమేంటి..? నిజంగానే కథ డిమాండ్ చేసిందా లేదంటే సౌత్ హీరోలు సృష్టించిన రికార్డులను బద్దలు కొట్టాలని బాలీవుడ్ అంతా ఒక్కటైందా..? ఎందుకంటే మన ఊరిలో పక్క ఊరోడి డామినేషన్ తట్టుకోలేం కదా..? ఇప్పుడు సింగం తీరు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. అసలు రోహిత్ శెట్టి ప్లాన్ ఏంటి..?

దక్షిణాది హీరోల దండయాత్ర బాలీవుడ్‌పై బలంగానే ఉందిప్పుడు. ఆల్రెడీ ప్రభాస్, అల్లు అర్జున్ అక్కడ పాగా వేసారు.. తాజాగా ఎన్టీఆర్ కూడా దేవరతో తన ముద్ర వేసారు.. త్వరలోనే గేమ్ ఛేంజర్ అంటూ రామ్ చరణ్ కూడా నార్త్‌పై తన డామినేషన్‌కు రెడీ అవుతున్నారు. మన హీరోల దండయాత్రలో తమ ఉనికినే కోల్పోతున్నారు బాలీవుడ్ హీరోలు.

మన హీరోల దూకుడు తట్టుకోవాలంటే ఒక్క హీరోతో అయ్యేలా కనిపించడం లేదు. అందుకే బాలీవుడ్ అంతా ఒక్కటైనట్లు కనిపిస్తుంది. దీనికి సింగం అగైన్ సినిమానే నిదర్శనం. అజయ్ దేవ్‌గన్ నుంచి మొదలుపెడితే టైగర్ ష్రాఫ్, అక్షయ్ కుమార్, రణ్‌వీర్ సింగ్, కరీనా కపూర్, దీపిక పదుకొనే.. ఇలా బాలీవుడ్‌లో ఉన్న బడా స్టార్స్ అంతా ఈ సినిమాలోనే కనిపిస్తున్నారు.

ఎవరైనా ట్రైలర్ అంటే 2 నిమిషాలు కట్ చేస్తారు.. కథ చెప్పాలనుకుంటే 3 నిమిషాలు కట్ చేస్తారు.. మరీ ఇంపార్టెంట్ అంటే మూడున్నర నిమిషాలు కట్ చేస్తారు.. కానీ సింగం అగైన్ ట్రైలర్ ఏకంగా 5 నిమిషాలుంది. ఏకంగా ట్రైలర్‌లోనే సినిమా చూపించారు రోహిత్ శెట్టి. పైగా పోలీస్ కథలోనే రామాయణం చూపించారు.

బాలీవుడ్ బిగ్గెస్ట్ కాప్ యూనివర్స్‌గా వస్తుంది సింగం అగైన్. ఇందులో రాముడిగా అజయ్ దేవ్‌గన్, లక్ష్మణుడిగా టైగర్ ష్రాఫ్, సీతగా కరీనా కపూర్, హనుమంతుడిగా రణ్‌వీర్ సింగ్, జఠాయుగా అక్షయ్ కుమార్ కారెక్టర్స్ డిజైన్ చేసారు రోహిత్ శెట్టి. రావణుడిగా అర్జున్ కపూర్ నటిస్తున్నారు. మోడ్రన్ రామాయణంగా ఈ పోలీస్ యూనివర్స్ నవంబర్ 1న రాబోతుంది.




