AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mallika Sherawat: ‘నా నడుము మీద చపాతీలు వేస్తామన్నారు’.. ఆ దక్షిణాది డైరెక్టర్‌పై మల్లిక సంచలన ఆరోపణలు

మల్లికా షెరావత్.. బోల్డ్ అంట్ హాట్‌గా నటించే ఈ బాలీవుడ్ నటీమణి గురించి తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ముఖ్యంగా ‘మర్డర్’ సినిమాలో మల్లిక హాట్‌నెస్‌కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ తర్వాత కూడా గ్లామర్ పాత్రల్లోనే నటించిన మల్లిక.. బాలీవుడ్ 'హాట్ దివా' గా క్రేజ్ సొంతం చేసుకుంది.

Mallika Sherawat: 'నా నడుము మీద చపాతీలు వేస్తామన్నారు'.. ఆ దక్షిణాది డైరెక్టర్‌పై మల్లిక సంచలన ఆరోపణలు
Mallika Sherawat
Basha Shek
|

Updated on: Oct 13, 2024 | 10:03 PM

Share

మల్లికా షెరావత్.. బోల్డ్ అంట్ హాట్‌గా నటించే ఈ బాలీవుడ్ నటీమణి గురించి తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ముఖ్యంగా ‘మర్డర్’ సినిమాలో మల్లిక హాట్‌నెస్‌కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ తర్వాత కూడా గ్లామర్ పాత్రల్లోనే నటించిన మల్లిక.. బాలీవుడ్ ‘హాట్ దివా’ గా క్రేజ్ సొంతం చేసుకుంది. ఆమె హిందీతో పాటు కొన్ని దక్షిణాది సినిమాల్లోనూ నటించింది. స్పెషల్ సాంగ్స్ తోనూ సందడి చేసింది. 2012లో సినిమా ఇండస్ట్రీ నుంచి హఠాత్తుగా కనుమరుగైన మల్లిక.. అప్పుడప్పుడూ హిందీ సినిమాల్లో నటిస్తోంది. లేటెస్ట్ గా ‘విక్కీ విద్యా క వో వాలా వీడియో’ సినిమాతో మళ్లీ ఆడియెన్స్ ను పలకరించింది. ఈ సినిమా ప్రమోషన్‌కు సంబంధించి కొన్ని ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న నటి మల్లికా షెరావత్ తాజాగా సౌత్ ఇండియన్ మూవీ డైరెక్టర్స్ గురించి మాట్లాడింది. ‘ఒక దక్షిణాది దర్శకుడు నా దగ్గరికి వచ్చి హాట్‌ ఐటెం సాంగ్ ఉందని చెప్పారు. ఇది ఎలా ఉండాలంటే చూసే ప్రేక్షకులకు మీరెంత హాట్‌ అనేది అర్థమవ్వాలన్నారు. నేను కూడా ఓకే చెప్పి దానికోసం మీరు ఎలా చూపిస్తున్నారు అని అడిగాను. ఇందుకోసం నా నడుము మీద చపాతీలు వేడి చేస్తానన్నారు. నేను వెంటనే ఆశ్చర్యపోయి ఆ పాట చేయను అని ముఖం మీదే చెప్పేశాను. ఇది వినడానికి మాత్రం ఇది చాలా ఫన్నీగా ఉంది. ఆ తర్వాత మళ్లీ సిట్యూయేషన్స్ ఎదురు కాలేదు’ అని నవ్వేసింది మల్లికా.

దక్షిణాది దర్శకులకు నటీమణుల హిప్‌పై ప్రత్యేక ప్రేమ ఉంటుందని గతంలో కొందరు బాలీవుడ్ నటీమణులు కూడా చెప్పారు. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి యాక్టింగ్ స్టార్ట్ చేసిన తాప్సీ పన్ను కూడా ఇదే మాట చెప్పింది. నా మొదటి సినిమా మొదటి షాట్‌లోనే దర్శకుడు నా నడుముపై కొబ్బరికాయలు వేశాడంది.ఇప్పుడు మల్లిక కూడా ఇదే కామెంట్స్ చేసింది. అయితే ఆ దక్షిణాది దర్శకుడు పేరు మాత్రం రివీల్ చేయలేదీ అందాల తార.

ఇవి కూడా చదవండి

బిగ్ బాస్ షోలో మల్లికా శెరావత్..

View this post on Instagram

A post shared by ColorsTV (@colorstv)

మల్లిక శెరావత్ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
బాలీవుడ్ కపుల్స్ లగ్జరీ అబోడ్స్.. కోట్ల విలువైన తారల కలల సౌధాలు
బాలీవుడ్ కపుల్స్ లగ్జరీ అబోడ్స్.. కోట్ల విలువైన తారల కలల సౌధాలు
కోడిగుడ్డు ఎండుచేపల పులుసు ఇలా వండితే.. రోజూ కావాలంటారు
కోడిగుడ్డు ఎండుచేపల పులుసు ఇలా వండితే.. రోజూ కావాలంటారు
హ్యారీ బ్రూక్ వీరవిహారం.. పాకిస్థాన్‌పై ఇంగ్లండ్ ఘనవిజయం!
హ్యారీ బ్రూక్ వీరవిహారం.. పాకిస్థాన్‌పై ఇంగ్లండ్ ఘనవిజయం!
మష్రూమ్ ఆమ్లెట్ ఇలా వేసి తింటే ఎవరైనా ఆహా అనాల్సిందే..
మష్రూమ్ ఆమ్లెట్ ఇలా వేసి తింటే ఎవరైనా ఆహా అనాల్సిందే..
రాగి పిండితో అదిరే బ్రేక్ ఫాస్ట్! తక్కువ నూనె, ఎక్కువ ప్రోటీన్
రాగి పిండితో అదిరే బ్రేక్ ఫాస్ట్! తక్కువ నూనె, ఎక్కువ ప్రోటీన్
లాంగ్ డ్రైవ్ చేసే వాళ్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
లాంగ్ డ్రైవ్ చేసే వాళ్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
రాష్ట్ర ప్రభుత్వానికి రూ.583 కోట్లు చెల్లించిన బ్యాంక్‌! ఎందుకంటే
రాష్ట్ర ప్రభుత్వానికి రూ.583 కోట్లు చెల్లించిన బ్యాంక్‌! ఎందుకంటే
సూర్యరశ్మి కాదు.. ఈ ఆహారాలతోనూ విటమిన్-D! ‘సన్‌షైన్’ డైట్ ప్లాన్
సూర్యరశ్మి కాదు.. ఈ ఆహారాలతోనూ విటమిన్-D! ‘సన్‌షైన్’ డైట్ ప్లాన్
కింగ్ కోబ్రా Vs. రక్త పింజర.. రెండిట్లో ఏది ఎక్కువ డేంజరో తెలుసా?
కింగ్ కోబ్రా Vs. రక్త పింజర.. రెండిట్లో ఏది ఎక్కువ డేంజరో తెలుసా?
అమ్మాయిలకు చికెన్ మంచిదేనా? బయటపడ్డ నమ్మలేని నిజాలు
అమ్మాయిలకు చికెన్ మంచిదేనా? బయటపడ్డ నమ్మలేని నిజాలు