AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Baba Siddique: ఉప్పు, నిప్పులా ఉన్న షారుఖ్‌, సల్మాన్‌లను స్నేహితులుగా మార్చిన బాబా సిద్ధిఖీ.. ఎలాగో తెలుసా?

ఎన్సీపీ సీనియర్ నేత బాబా సిద్ధిఖీ శనివారం (అక్టోబర్ 12) దారుణ హత్యకు గురయ్యారు. బాంద్రాలోని ఆయన కుమారుడి కార్యాలయం సమీపంలో బాబా సిద్ధిఖీని కొందరు దుండగులు కాల్చి చంపారు. బాబా సిద్ధిఖీకి బాలీవుడ్‌తో చాలా సన్నిహిత సంబంధాలున్నాయి. బాలీవుడ్‌లో ఏ సమస్య వచ్చినా ముందుగా గుర్తుకు వచ్చే వ్యక్తి బాబా సిద్ధిఖీనే

Baba Siddique: ఉప్పు, నిప్పులా ఉన్న షారుఖ్‌, సల్మాన్‌లను స్నేహితులుగా మార్చిన బాబా సిద్ధిఖీ.. ఎలాగో తెలుసా?
Baba Siddique, Shah Rukh Khan, Salman Khan
Basha Shek
|

Updated on: Oct 13, 2024 | 7:28 PM

Share

ఎన్సీపీ సీనియర్ నేత బాబా సిద్ధిఖీ శనివారం (అక్టోబర్ 12) దారుణ హత్యకు గురయ్యారు. బాంద్రాలోని ఆయన కుమారుడి కార్యాలయం సమీపంలో బాబా సిద్ధిఖీని కొందరు దుండగులు కాల్చి చంపారు.  బాబా సిద్ధిఖీకి బాలీవుడ్‌తో చాలా సన్నిహిత సంబంధాలున్నాయి. బాలీవుడ్‌లో ఏ సమస్య వచ్చినా ముందుగా గుర్తుకు వచ్చే వ్యక్తి బాబా సిద్ధిఖీ. ప్రముఖ సీనియర్ నటుడు సనీల్ దత్ నుండి కత్రినా కైఫ్ వరకు, బాబా సిద్ధిఖీకి బాలీవుడ్‌లో సన్నిహితంగా మెలిగే వారు ఉన్నారు. ఇక బాలీవుడ్‌లో ఉప్పు, నిప్పుగా ఉన్న ఇద్దరు సూపర్‌స్టార్లు సల్మాన్‌ఖాన్‌, షారుఖ్‌ ఖాన్‌లు స్నేహితులుగా మారడానికి కారణం బాబా సిద్ధిఖీ. ప్రముఖ దివంగత నటుడు సునీల్ దత్ బాబా సిద్ధిఖీ రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పుడు ఆయనకు మార్గదర్శకుడిగా వ్యవహరించారు. సునీల్ దత్ కాంగ్రెస్ నేతగా ఉన్నప్పుడు బాబా సిద్ధిఖీ కూడా కాంగ్రెస్ లోనే ఉన్నారు. బాబా సిద్ధిఖీ సునీల్ దత్ కి రైట్ హ్యాండ్ లాంటివాడు. సునీల్ దత్ కుమారుడు సంజయ్ దత్‌తో బాబా సిద్ధిఖీకి ఇప్పటికీ కూడా చాలా సన్నిహిత సంబంధాలున్నాయి. ముఖ్యంగా ఏకే 47 కేసులో సంజయ్ దత్ కు సమస్యలు ఎదురైనప్పుడు బాబా సిద్ధిఖీ చాలా సహాయం చేశారు.

బాబా సిద్ధిఖీకి సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్‌ల అత్యంత సన్నిహితులు. 2008లో సల్మాన్‌ ఖాన్‌, షారుక్‌ ఖాన్‌ మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకున్నప్పుడు బాబా సిద్ధిఖీనే వారిని ఒక్కటి చేశారు. తన ఇఫ్తార్ పార్టీకి ఇద్దరు స్టార్లను ఆహ్వానించి చర్చలు జరిపాడు. ఈ మీటింగ్ తర్వాత షారుఖ్, సల్మాన్ మంచి స్నేహితులుగా మారిపోయారు. ఇక బాబా సిద్ధిఖీ గ్రాండ్‌గా ఇఫ్తార్ పార్టీలను నిర్వహిస్తారని పేరుంది. వీటికి బాలీవుడ్‌లోని పలువురు ప్రముఖులు కూడా వస్తుంటారు.

కత్రినా కైఫ్ తో పాటు చాలా మంది యువ నటులు, నటీమణులు కూడా బాబా సిద్ధిఖీకి సన్నిహితులు. బాలీవుడ్‌లో రిలీజయ్యే పలు ప్రీమియర్ షోలకు బాబా సిద్ధిఖీని కూడా ఆహ్వానిస్తుంటారు. అలాంటి బాబా సిద్ధిఖీ ఇప్పుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఆదివారం ఉదయం బాబా సిద్ధిఖీ భౌతిక కాయాన్ని చూసేందుకు సల్మాన్ ఖాన్ వెళ్లాడు. షారుఖ్ ఖాన్, సంజయ్ దత్ సహా మరికొంత మంది బాలీవుడ్ నటీనటులు సిద్ధిఖీని చివరి చూపునకు వచ్చే అవకాశముంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఆగస్టు నెలలో 9 రోజులు బ్యాంకులు బంద్‌..!
ఆగస్టు నెలలో 9 రోజులు బ్యాంకులు బంద్‌..!
ఇది చిన్న కథ కాదుగా.. వడ మధ్యలో రంధ్రం వెనకున్న సైన్స్ తెలిస్తే..
ఇది చిన్న కథ కాదుగా.. వడ మధ్యలో రంధ్రం వెనకున్న సైన్స్ తెలిస్తే..
వైభవ్ కి బిగ్ టెస్ట్.. జింబాబ్వే సిరీస్‌లో రుజువు చేసుకుంటాడా?
వైభవ్ కి బిగ్ టెస్ట్.. జింబాబ్వే సిరీస్‌లో రుజువు చేసుకుంటాడా?
తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. ఈరోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. ఈరోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
టీమిండియాకు పొంచి ఉన్న హ్యాట్రిక్ క్లీన్ స్వీప్ ముప్పు..!
టీమిండియాకు పొంచి ఉన్న హ్యాట్రిక్ క్లీన్ స్వీప్ ముప్పు..!
టెక్ ప్రపంచంలో సరికొత్త 'GOAT' వార్.. మరి ఫుట్‌బాల్ లెజెండ్స్‌
టెక్ ప్రపంచంలో సరికొత్త 'GOAT' వార్.. మరి ఫుట్‌బాల్ లెజెండ్స్‌
మీ పేరు ఎస్‌ఐఆర్‌లో నమోదైందా..? లేదా? ఈ నెంబర్‌కు మెస్సేజ్ చేస్తే
మీ పేరు ఎస్‌ఐఆర్‌లో నమోదైందా..? లేదా? ఈ నెంబర్‌కు మెస్సేజ్ చేస్తే
టెన్సర్ G6 ప్రాసెసర్: గూగుల్‌ పిక్సెల్ 11a స్పెసిఫికేషన్స్‌ ఇవే
టెన్సర్ G6 ప్రాసెసర్: గూగుల్‌ పిక్సెల్ 11a స్పెసిఫికేషన్స్‌ ఇవే
ఎలక్ట్రిక్ 3-పిన్ ప్లగ్‌లో ఆ ఒక్క పిన్ పెద్దదిగా ఎందుకు ఉంటుంది?
ఎలక్ట్రిక్ 3-పిన్ ప్లగ్‌లో ఆ ఒక్క పిన్ పెద్దదిగా ఎందుకు ఉంటుంది?
జనాలకు నిద్రలేకుండా చేస్తున్న హారర్ సినిమా..
జనాలకు నిద్రలేకుండా చేస్తున్న హారర్ సినిమా..