AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FEATURED : Bajaj Finance

Personal Loan: ఏ విధంగా వడ్డీ రేట్లు మీ పర్సనల్ లోన్ ఈఎంఐను ప్రభావితం చేస్తాయి?

Personal Loan: ఒక రుణం కోసం దరఖాస్తు చేసే ముందు మీరు మీ నెలవారి చెల్లింపులను వడ్డీ రేట్లు ఏ విధంగా ప్రభావితం చేస్తాయి అనేది అర్థంచేసుకోవడం వలన మీరు మీ ఆర్ధిక పరిస్థితిని మరింత మెరుగ్గా ప్రణాళిక చేసుకోవడంలో సహాయపడవచ్చు. ఈ గైడ్‌లో..

Personal Loan: ఏ విధంగా వడ్డీ రేట్లు మీ పర్సనల్ లోన్ ఈఎంఐను ప్రభావితం చేస్తాయి?
Personal Loan Emi
Subhash Goud
|

Updated on: Mar 18, 2026 | 4:30 PM

Share

Personal Loan: మీ పొదుపులను ఖాళీ చేసుకోకుండా భారీ ఖర్చులను నిర్వహించుకోవడములో ఒక పర్సనల్ లోన్ మీకు సహాయపడుతుంది. అది ఒక వైద్య అత్యవసర పరిస్థితి, ఇంటి పునరుద్ధరణ, వివాహ ఖర్చులు లేదా ఒక విహార యాత్ర ఏదైనా, రుణం మీకు నిధులకు వెంటనే యాక్సెస్‌ అందిస్తుంది. అలాగే వాయిదాలలో వాటిని తిరిగి చెల్లించుటకు అనుకూలంగా ఉంటుంది. అయితే మీరు ప్రతి నెల ఎంత చెల్లించాలి అనేది నిర్ణయించడంలో ఒక అంశం కీలక పాత్ర పోషిస్తుంది. అదే వడ్డీ రేటు. రేటులో చిన్న మార్పు కూడా మీ ఈఎంఐను గణనీయంగా పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు. బజాజ్ ఫైనాన్స్ నుండి ఒక personal loanతో వినియోగదారులు తమ క్రెడిట్ ప్రొఫైల్ ఆధారంగా 10% p.a. నుండి 30% p.a వరకు వడ్డీ రేటుతో నిధులు పొందవచ్చు. అధిక CIBIL స్కోర్, మంచి క్రెడిట్ చరిత్ర ఉన్న వ్యక్తులు సరసమైన వడ్డీ రేట్లు పొందవచ్చు. తద్వారా వారి తిరిగిచెల్లింపు భారాన్ని తగ్గించుకోవచ్చు.

ఒక రుణం కోసం దరఖాస్తు చేసే ముందు మీరు మీ నెలవారి చెల్లింపులను వడ్డీ రేట్లు ఏ విధంగా ప్రభావితం చేస్తాయి అనేది అర్థంచేసుకోవడం వలన మీరు మీ ఆర్ధిక పరిస్థితిని మరింత మెరుగ్గా ప్రణాళిక చేసుకోవడంలో సహాయపడవచ్చు. ఈ గైడ్‌లో తాము వడ్డీ రేట్లు ఏ విధంగా మీ ఈఎంఐని ప్రభావితం చేస్తాయి? మీరు రుణం తీసుకోవడంలో తెలివైన నిర్ణయాలు తీసుకోవడములో ఒక పర్సనల్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ ఎలా సహాయం చేస్తుంది అనేది వివరిస్తాము.

ఒక పర్సనల్ లోన్ ఈఎంఐ అంటే ఏమిటి?

ఈఎంఐ అంటే ఈక్వేటెడ్ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్‌. ఇది మీరు ఎంచుకున్న కాలపరిమితిలో మీ పర్సనల్ లోన్ తిరిగి చెల్లించడానికి ప్రతి నెల మీరు చెల్లించే ఒక స్థిరమైన మొత్తము. ప్రతి ఈఎంఐ లో రెండు భాగాలు ఉంటాయి:

  • మూలధనం – మీరు రుణంగా తీసుకున్న రుణం భాగము
  • వడ్డీ మొత్తము – మీరు అప్పుగా డబ్బు తీసుకోవటానికి అయిన ఖర్చు
  • ఉదాహరణకు, ఒకవేళ మీరు అయిదు సంవత్సరాలకు రూ. 5,00,000 పర్సనల్ లోన్ తీసుకుంటే రుణంగా పూర్తిగా తిరిగి చెల్లించబడే వరకు సమానమైన నెలవారి వాయిదాలలో ఆ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు.

మీ ఈఎంఐ మొత్తము ప్రధానంగా మూడు అంశాలపై ఆధారపడుతుంది:

  • రుణ మొత్తము
  • రుణం కాలపరిమితి
  • వడ్డీ రేటు

వీటిల్లో, మీ నెలవారి చెల్లింపులు ఎంత సరసంగా ఉంటాయి అనేది నిర్ణయించడములో వడ్డీ కీలక పాత్ర పోషిస్తుంది.

ఒక పర్సనల్ లోన్ లో వడ్డీ రేట్లు ఎందుకు ముఖ్యమైనది:

వడ్డీ రేటు అంటే ఒక రుణ దాత నుండి మీరు రుణం తీసుకోవడానికి మీరు చెల్లించే ఖర్చు. మీరు ఒక పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేసినప్పుడు, వడ్డీ రేటు నిర్ణయించే ముందు రుణదాత మీ ఆదాయము, క్రెడిట్ స్కోర్, తిరిగిచెల్లింపు చరిత్ర, ప్రస్తుతం ఉన్న ఆర్ధిక బాధ్యతలను అంచనావేస్తారు.

అధిక వడ్డీ రేటు అంటే:

  • అధిక ఈఎంఐ
  • అధిక తిరిగి చెల్లింపు మొత్తం

తక్కువ వడ్డీ రేటు అంటే:

  • తక్కువ నెలవారి ఈఎంఐ
  • రుణ కాలపరిమితిలో తగ్గిన చెల్లించిన వడ్డీ

రేటులో చిన్న వ్యత్యాసము కూడా కాలక్రమేణ మీరు తిరిగి చెల్లించే మొత్తముపై ప్రభావము చూపించగలదు. మనం ఒక చిన్న ఉదాహరణను చూద్దాము.

ఒకవేళ మీరు 5 సంవత్సరాల (60 నెలలు) కాలపరిమితికి రూ. 5,00,000 పర్సనల్ లోన్ తీసుకుంటే.

1. వడ్డీ రేట్లు 10% సంవత్సరానికి

  • ఈఎంఐ – రూ. 10,624
  • చెల్లించదగిన మొత్తం వడ్డీ – రూ. 1,37,440

2. వడ్డీ రేటు 12% సంవత్సరానికి

  • ఈఎంఐ – రూ. 11,122
  • • చెల్లించదగిన మొత్తం వడ్డీ – రూ. 1,67,320

ఈ ఉదాహరణలో వడ్డీ రేటులో కేవలం 2% పెంపు మీ ఈఎంఐను ఇంచుమించు రూ. 500 వరకు పెంచుతుంది. అలాగే చెల్లించదగిన మొత్తం వడ్డీని రూ.30,000 వరకు పెంచుతుంది. అందుచేతనే ఒక పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేసే ముందు వడ్డీ రేట్లు ఏ విధంగా మీ తిరిగిచెల్లింపును ప్రభావితం చేస్తాయి అనేది పరీక్షించుకోవడం ముఖ్యం.

రుణ కాలపరిమితి వడ్డీ రేట్లతో ఏ విధంగా ప్రతిస్పందిస్తుంది:

ఈఎంఐని లెక్కించే ముందు రుణ కాలపరిమితి కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. సుదీర్ఘ కాలపరిమితి ఈఎంఐని తగ్గిస్తుంది కాని చెల్లించే మొత్తం వడ్డీని పెంచుతుంది. స్వల్పకాలిక కాలపరిమితి ఈఎంఐని పెంచుతుంది కాని మొత్తం వడ్డీ ఖర్చును తగ్గిస్తుంది. ఉదాహరణకు:

  • 3 సంవత్సరాల కొరకు రూ. 5,00,000 పర్సనల్ లోన్ కు అధిక ఈఎంఐ ఉండవచ్చు కాని మొత్తం మీద తక్కువ వడ్డీ.
  • ఇదే రుణం 5 సంవత్సరాలకు తక్కువ ఈఎంఐ ఉంటుంది కాని మొత్తం మీద ఎక్కువ వడ్డీ ఉంటుంది. వడ్డీ రేటు, కాలపరిమితిని సమతుల్యం చేయడం మీ నెలవారి బడ్జెట్ లో సౌకర్యంగా సరిపోయే ఈఎంఐని ఎంచుకోవడములో మీకు సహాయపడుతుంది.

ఒక పర్సనల్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ ఏ విధంగా సహాయపడుతుంది:

మీరు పర్సనల్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ ఉపయోగించినప్పుడు మీ రుణాన్ని ప్రణాళిక చేసుకోవడం మరింత సులభం అవుతుంది. ఈ సాధారణమైన ఆన్‌లైన్‌ సాధనము క్షణాలలో మీ నెలవారి వాయిదాలను అంచనా వేయడములో సహాయపడుతుంది.

మీరు కేవలం మూడు వివరాలు మాత్రమే ఎంటర్ చేయాలి:

  • రుణం మొత్తము
  • వడ్డీ రేటు
  • రుణం కాలపరిమితి

అంచనావేసిన మీ ఈఎంఐ, చెల్లించద్గిన మొత్తం వడ్డీని పర్సనల్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ తక్షణమే చూపుతుంది. ఒక రుణాన్ని తీసుకునే ముందు వివిధ వడ్డీ రేట్లు మీ తిరిగిచెల్లింపును ఏ విధంగా ప్రభావితం చేస్తాయి అనేది అర్థంచేసుకోవడములో ఇది మీకు సహాయపడుతుంది.

ఉదాహరణకు:

  • వివిధ రుణం మొత్తాలకు ఈఎంఐను పోల్చిచూడవచ్చు.
  • కాలపరిమితి ఈఎంఐని ఎలా మారుస్తుంది అనేది పరీక్షించవచ్చు
  • వడ్డీ రేట్లు ఏ విధంగా మొత్తం తిరిగిచెల్లింపును ప్రభావితం చేస్తాయి అని చూడవచ్చు. ఇది ఆర్థిక ప్రణాళికను మరింత సులభతరం చేస్తుంది. అలాగే తర్వాత వచ్చే ఆశ్చర్యాలను నివారించడంలో సహాయపడుతుంది.

ఒక పర్సనల్ లోన్ పై మెరుగైన వడ్డీ రేటును పొందుటకు చిట్కాలు:

  • మీరు మీ ఈఎంఐని తగ్గించుకోవాలని అనుకుంటే, తక్కువ వడ్డీ రేటును సురక్షితం చేసుకోవడం ముఖ్యం. మీకు సహాయపడగలిగే కొన్ని సాధారణ చిట్కాలు ఈ దిగువన ఇవ్వబడ్డాయి:
  • మంచి క్రెడిట్ స్కోర్ కలిగి ఉండాలి.
  • అధిక క్రెడిట్ స్కోర్ బాధ్యతాయుతంగా రుణం తీసుకోవడాన్ని సూచిస్తుంది. మెరుగైన రేట్లకు మీరు అర్హులు కావడానికి సహాయపడుతుంది.
  • మీ ఆదాయ దస్తావేజులను సిద్ధంగా ఉంచండి – స్థిరమైన ఆదాయం, సరైన డాక్యుమెంటేషన్ లాభదాయకమైన షరతులు అందుకునే అవకాశాలను మెరుగుపరుస్తుంది .
  • ఒకేసారి ఎక్కువ రుణం కోసం దరఖాస్తు చేయకండి – చాలా ఎక్కువ రుణాల విచారణలు మీ క్రెడిట్ ప్రొఫైల్ ను ప్రభావితం చేయవచ్చు.
  • మీకు కావలసినంత మొత్తం మాత్రమే రుణంం తీసుకోండి – చిన్నమొత్తములో రుణం తీసుకోవడం వలన తిరిగిచెల్లింపు మరింత నిర్వహణీయం అవుతుంది. ఒక పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేసే ముందు ఒక పర్సనల్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ ఉపయోగించి మీ ఈఎంఐని పరీక్షించుకోవడం ఎప్పుడు తెలివైన పని.

బజాజ్ ఫైనాన్స్ నుండి ఒక పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేయడం:

మీరు మీ ఆర్థిక వ్యవహారాలను సరిగ్గా ప్రణాళిక చేసుకున్నప్పుడు రుణం తీసుకోవడం సులభం అవుతుంది. బజాజ్ ఫైనాన్స్ తో మీరు ఆన్‌లైన్‌లో ఒక పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేయవచ్చు. ప్రయాణం, వైద్య ఖర్చులు, వివాహ ఖర్చులు లేదా ఇంటి పునరుద్ధరణ వంటి వివిధ అవసరాల కోసం త్వరితంగా నిధులను అందుకోవచ్చు. రూ. 40,000 నుండి రూ. 55 లక్షల వరకు రుణం మొత్తాలు, 12 నెలల నుండి 8 సంవత్సరాల వరకు అనువైన కాలపరిమితులతో బజాజ్ ఫిన్సర్వ్ పర్సనల్ లోన్ అనేక విధాలైన ఖర్చులు మరియు తిరిగిచెల్లింపు బడ్జెట్స్ కు అనుకూలంగా ఉంటుంది. దరఖాస్తు చేసే ముందు ఒక పర్సనల్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ ఉపయోగించడం. మీరు మీ నెలవారి బడ్జెట్ కు సౌకర్యవంతంగా సరిపోయే రుణం మొత్తాన్ని, కాలపరిమితిని ఎంచుకోవడములో సహాయపడుతుంది.

ముగింపు:

మీ పర్సనల్ లోన్ అందుబాటు ధరను నిర్ణయించుటలో వడ్డీ రేట్లు కీలక పాత్ర పోషిస్తాయి. రేటులో చిన్న వ్యత్యాసాలు కూడా మీ ఈఎంఐని, కాలక్రమేణ మీరు చెల్లించే మొత్తం వడ్డీని మార్చవచ్చు. వడ్డీ రేట్లు, కాలపరిమితి, రుణం మొత్తము అన్నీ ఎలా కలిసి పనిచేస్తాయి అనేది అర్థం చేసుకోవడం ద్వారా మీరు మెరుగైన ఆర్ధిక నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మీ నెలవారి చెల్లింపులను ముందుగానే అంచనావేయడములో సహాయపడటం ద్వారా ఒక పర్సనల్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ ఈ ప్రక్రియను సులభతరం చేస్తుంది.

ఒక పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేసే ముందు, మీ ఈఎంఐ లెక్కించుటకు, మీ బడ్జెట్ కు తగిన తిరిగిచెల్లింపు ప్రణాళికను ఎంచుకొనుటకు కొంత సమయం వెచ్చించండి. ఈరోజు చేసే చిన్నపాటి ప్రణాళిక రేపటి మీ రుణం తీసుకునే అనుభవాన్ని మృదువుగా, మరింత ఒత్తిడి-రహితంగా చేస్తుంది.

* నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
Disclaimer: ఇది స్పాన్సర్ చేయబడిన కథనం. ఇక్కడ ఉన్న సమాచారం, క్లెయిమ్‌లు పూర్తిగా ప్రకటనల కంపెనీకి చెందినవి. ఈ కథనంలోని కంటెంట్ లేదా క్లెయిమ్‌లకు tv9telugu.com బాధ్యత వహించదు. దయచేసి దాన్ని ఉపయోగించే ముందు మీ సొంత సమాచారాన్ని ధృవీకరించండి.