చేసింది కొన్ని సినిమాలే.. కానీ క్రేజ్ మాత్రం ఫుల్.. 

03June 2026

Pic credit - Instagram

Rajeev 

చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి గుర్తింపు తెచ్చుకున్న భామల్లో పాయల్ రాధాకృష్ణ ఒకరు. 

కన్నడ సినిమాలతో కెరీర్ మొదలు పెట్టిన ఈ అమ్మడు తమిళం, తెలుగులోనూ మంచి నటిగా పేరుతెచ్చుకుంది.

2017 కన్నడ చిత్రం బెంగళూరు అండర్‌వరల్డ్‌తో ఆమె అరంగేట్రం చేసింది. ఈ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. 

తరగతి గది దాటి అనే వెబ్‌సిరీస్‌ తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది ఈ ముద్దుగుమ్మ ఆతర్వాత అలా నిన్ను చేరి అనే సినిమాతో మెప్పించింది. 

సుహాస్ హీరోగా నటించిన ప్ర‌స‌న్న‌వ‌ద‌నం సినిమాతో మంచి హిట్ తో పాటు నటన పరంగానూ మంచి మార్కులు కొట్టేసింది పాయల్.

కాజల్ నటించిన సత్యభామ సినిమాలోనూ నటించింది. నీలి మేఘ శ్యామ , చౌర్య పాఠం రీసెంట్ గా పాపం ప్రతాప్ సినిమాల్లో నటించింది.

చేసిన సినిమాలన్నింటిలో ఈ అమ్మడి నటనకు మంచి మార్కులు పడ్డాయి. దాంతో తెలుగులో ఈ అమ్మడు క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.