అందాలతో గత్తరలేపుతున్న రాశి సింగ్.. లేటెస్ట్ పిక్స్ 

03June 2026

Pic credit - Instagram

Rajeev 

 రాశి సింగ్.. తెలుగు సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో తనకంటూ మంచి ఇమేజ్ తెచ్చుకుంది.

 ఆది సాయి కుమార్ జోడిగా శశి మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ అమ్మడు.ఈ సినిమాలో తన అందంతో కట్టిపడేసింది. 

ఆ తర్వాత సంతోష్ శోభన్ సరసన ప్రేమ్ కుమార్, భూతద్దం భాస్కర నారాయణ, ప్రసన్న వదనం, బ్లైండ్ స్పాట్ వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించింది.

అలాగే ఒక పార్వతి ఇద్దరు దేవదాసులు చిత్రంల నటించింది. అందం, అభినయంతో కవ్వించిన ముద్దుగుమ్మకు అదృష్టం మాత్రం కలిసిరావడం లేదు.

వరుస హిట్స్ అందుకున్నప్పటికీ ఈ భామకు అంతగా అవకాశాలు రావడం లేదు. ప్రస్తుతం ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తుంది.

అటు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న రాశి సింగ్.. నిత్యం ఏదోక ఫోటోషూట్ షేర్ చేస్తుంది. ట్రెడిషనల్, గ్లామరస్ ఫోటోలతో రచ్చ చేస్తుంది.

తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తన గ్లామర్ తో కుర్రాళ్లకు కునుకులేకుండా చేస్తుంది రాశి.