Bigg Boss 8: గంగవ్వకు కోపం వచ్చింది.. అది నా అసిస్టెంటా.? అంటూ నయని పై సీరియస్
చాలా మంది తెలియాలని మొఖాలు ఉండటంతో పాటు అంతగా కంటెంట్ ఇవ్వకపోవడంతో.. ఇప్పుడు బిగ్ బాస్ టీమ్ ఇప్పుడు ఓల్డ్ కంటెస్టెంట్స్ ను హౌస్ లోకి పంపారు. దాంతో షో మంచి రసవత్తరంగా సాగుతోంది. పాత టీమ్ కు కొత్త టీమ్ కు హోరాహోరీగా పోటీ జరుగుతోంది.
కొత్త కంటెస్టెంట్స్ వచ్చిన తర్వాత బిగ్ బాస్ ఊపందుకుంది. సీజన్ 7 తో పోల్చుకుంటే సీజన్ 8 అంతగా ఆకట్టుకోలేకపోయింది. చాలా మంది తెలియాలని మొఖాలు ఉండటంతో పాటు అంతగా కంటెంట్ ఇవ్వకపోవడంతో.. ఇప్పుడు బిగ్ బాస్ టీమ్ ఇప్పుడు ఓల్డ్ కంటెస్టెంట్స్ ను హౌస్ లోకి పంపారు. దాంతో షో మంచి రసవత్తరంగా సాగుతోంది. పాత టీమ్ కు కొత్త టీమ్ కు హోరాహోరీగా పోటీ జరుగుతోంది. ఇక ఆదివారం ఎపిసోడ్ లో అందరూ అనుకున్నట్టే సీత ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. నిజానికి సీతనే స్ట్రాంగ్ అనుకున్నారు. కానీ గత రెండు వారల నుంచి ఆమె అంతగా పర్ఫామ్ చేయడం లేదు. ఇక నేటి ఎపిసోడ్ కు సంబందించిన ప్రోమోను విడుదల చేశారు.
ఈ ప్రోమో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇది చూస్తుంటే ఈ రోజు ఎపిసోడ్ రచ్చ రచ్చగా సాగుతుందని తెలుస్తోంది. బిగ్‌బాస్ ఈ వారం నామినేషన్స్‌లో మొత్తం 9 మంది సభ్యులు ఉన్నారు. ఇక ఈ రోజు ఎపిసోడ్ విషయానికొస్తే.. ముందుగా తేజను నామినేట్ చేసింది యష్మీ. అతని నుంచి అనుకున్నంత ఫన్ రావడం లేదు అని యష్మీ తేజను నామినేట్ చేసింది. నేను మా క్లాన్ మెంబర్స్‌తో ఎలా ఉన్నానో నీకు తెలీనే తెలీదంటూ తేజ చెప్పాడు. అయితే బీబీ హోటల్ టాస్కులో తేజ క్యారెక్టర్ నుంచి బయటికొచ్చాడంటూ మరో రీజన్ చెప్పింది యష్మీ.
ఆ తర్వాత మణికంఠ నిఖిల్ ను నామినేట్ చేశాడు. నిఖిల్ గ్రాఫ్ పడిపోయింది అని మణికంఠ అన్నాడు. నీకెలా తెలుసు..? నా గ్రాఫ్ పడిపోయిందని.. నువ్వు గ్రాఫ్‌లు చూశావా.? అని అన్నాడు నిఖిల్. దాంతో మణికంఠ హిలేరియస్ గా మాట్లాడొద్దు అని అన్నాడు. బీబీ హోటల్ టాస్కులో నువ్వు ఇంకా కామెడీ చేయాల్సింది అని మణికంఠ చెప్పాడు.ఒక పాయింట్ లో పులిహోర గురించి ఏదో చెబితేనే నువ్వు తీసుకోలేకపోయావ్.. నువ్వు నన్ను కామెడీ చేయమంటున్నావా.? అని నిఖిల్ అడిగాడు. ఆతర్వాత గంగవ్వ రంగంలోకి వచ్చింది. పృథ్వీని నామినేట్ చేసింది. బీబీ టాస్క్ లో నువ్వు సరిగ్గా ఆడలేదు అని పృథ్వీని నామినేట్ చేసింది గంగవ్వ. దానికి అందేటి అవ్వ నేను బాగానే ఆడాను మహారాణి దగ్గర ఉన్న మీ అసిస్టెంట్‌ను అడగడండి అంటూ పృథ్వీ నయని వైపు చూపించాడు. దానికి అది నాదగ్గరే సరిగ్గా లేదు అది నా అసిస్టెంటా..? అని సీరియస్ అయ్యింది.దానికి నయని ఎదో చెప్పబోతుంటే గంగవ్వ ‘నయని’ అని గట్టిగా అరుస్తూ కోప్పడింది. ఆతర్వాత ప్రేరణ గంగవ్వ నామినేషన్ ను యాక్సెప్ట్ చేసింది. దాంతో పృథ్వీ ఎట్లా.? అని సీరియస్ అయ్యాడు. ఆతర్వాత ఎలాగైనా ప్రేరణను నామినేట్ చేయాలనీ అని యష్మీ కి చెప్పాడు. ఆతర్వాత ప్రేరణ ఎదో మాట్లాడదాం అని వస్తే నాతో మాట్లాడకు అని మొఖం మీదే చెప్పాడు. నిఖిల్ దగ్గరికొచ్చి నువ్వు ప్రేరణకి హెల్ప్ చేశావంటే తరువాత నీకూ నాకు పడుతుంది చూసుకో అని సీరియస్ గా చెప్పాడు పృథ్వీ.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.