Devara OTT: దేవర ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్! ఎన్టీఆర్ 500 కోట్ల సినిమా స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర. జనతా గ్యారేజ్ తర్వాత మరోసారి ఈ సినిమాతో కొరటాల శివతో జత కట్టాడు తారక్. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ సినిమాతోనే తెలుగు ఆడియెన్స్ కు పరిచయమైంది. అలాగే మరో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ఈ మూవీలో విలన్ గా నటించాడు. అభిమానుల భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 27న విడుదలైన దేవర ఫస్ట్ షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది.

Devara OTT: దేవర ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్! ఎన్టీఆర్ 500 కోట్ల సినిమా స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Devara Movie
Follow us
Basha Shek

|

Updated on: Oct 14, 2024 | 3:18 PM

ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర. జనతా గ్యారేజ్ తర్వాత మరోసారి ఈ సినిమాతో కొరటాల శివతో జత కట్టాడు తారక్. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ సినిమాతోనే తెలుగు ఆడియెన్స్ కు పరిచయమైంది. అలాగే మరో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ఈ మూవీలో విలన్ గా నటించాడు. అభిమానుల భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 27న విడుదలైన దేవర ఫస్ట్ షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. కేవలం తెలుగులోనే కాకుండా నార్త్ లోనూ భారీ వసూళ్లు రాబట్టింది. ఇప్పటివరకు దేవర సినిమా రూ. 500 కోట్లకు పైగానే వసూళ్లు రాబట్టినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. కాగా ఇప్పటికీ చాలా చోట్ల థియేటర్లలో హౌస్ ఫుల్ కలెక్షన్లతో రన్ అవుతోన్న దేవర ఓటీటీ రిలీజ్ గురించి సామాజిక మాధ్యమల్లో ఒక ఆసక్తికర వార్త వినిపిస్తోంది. త్వరలోనే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్నట్లు టాక్ వినిపిస్తోంది. దేవర సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. ఈ నేపథ్యంలో నవంబర్ 8 నుంచి ఎన్టీఆర్ 500 కోట్ల సినిమా స్ట్రీమింగ్ కు రానుందని సమాచారం. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళ, తమిళ్ భాషల్లోనూ ఒకేసారి ఎన్టీఆర్ మూవీ స్ట్రీమింగ్ కు రానుందని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుందని టాక్.

దేవర డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కోసం నెట్ ఫ్లిక్స్ సుమారు రూ.150 కోట్లు చెల్లించినట్లు సమాచారం. అలాగే థియేటర్లలో రిలీజైన ఆరు వారాల తర్వాతే స్ట్రీమింగ్ అయ్యేలా డీల్ కుదిరిందట. సో.. ఈ లెక్కన నవంబర్ 8న లేదా 15 తేదీల్లో ఏదో ఒక రోజున దేవర ఓటీటీలోకి రావచ్చన్న మాట. ఇక ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధా ఆర్ట్స్ బ్యానర్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా దేవర సినిమాను నిర్మించాయి. శ్రుతి మరాఠే, తాళ్లూరి రామేశ్వరి, శ్రీకాంత్, మురళీ శర్మ, ప్రకాశ్ రాజ్, అజయ్ తదితరలు ప్రధాన పాత్రలు పోషించారు. ఇక అనిరుధ్ రవిచందర్ అందించిన స్వరాలు చార్ట్ బస్టర్ గా నిలిచాయి. ఈ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ ఉన్నట్లు ఇది వరకే అనౌన్స్ చేశారు మేకర్స్.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.