Actress Sreevani: బుల్లితెర నటి కారుకు యాక్సిడెంట్.. తీవ్ర గాయాలు.. కన్నీరుమున్నీరవుతోన్న కుటుంబీకులు

ప్రముఖ బుల్లితెర నటి శ్రీవాణి ప్రయాణిస్తోన్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో శ్రీవాణికి తీవ్ర గాయాలయ్యాయి. నుదిటి మీద చీరుకుపోవడంతో పాటు చేతికి ఫ్రాక్చర్ అయ్యింది. ప్రస్తుతం ఆమె గుంటూరులోని ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ విషయాన్ని నటి భర్త విక్రమాదిత్య ఒక వీడియో ద్వారా వెల్లడించాడు.

Actress Sreevani: బుల్లితెర నటి కారుకు యాక్సిడెంట్.. తీవ్ర గాయాలు.. కన్నీరుమున్నీరవుతోన్న కుటుంబీకులు
Actress Sreevani
Follow us
Basha Shek

|

Updated on: Oct 14, 2024 | 6:09 PM

ప్రముఖ బుల్లితెర నటి శ్రీవాణి ప్రయాణిస్తోన్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో శ్రీవాణికి తీవ్ర గాయాలయ్యాయి. నుదిటి మీద చీరుకుపోవడంతో పాటు చేతికి ఫ్రాక్చర్ అయ్యింది. ప్రస్తుతం ఆమె గుంటూరులోని ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ విషయాన్ని నటి భర్త విక్రమాదిత్య ఒక వీడియో ద్వారా వెల్లడించాడు. మూడు రోజుల క్రితం శ్రీవాణి తన కుటుంబ సభ్యులతో చీరాల బీచ్ కి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు విక్రమాదిత్య చెప్పుకొచ్చాడు. శ్రీవాణికి నుదుటిపై గట్టి దెబ్బ తగలడంతో ప్లాస్టిక్ సర్జరీ చేయమని ఆయన డాక్టర్స్ ను కోరారట. ప్రస్తుతం టీవీ సీరియల్స్ షూటింగులతో బిజీగా ఉంటోన్న తన ఒంటిపై మార్క్స్ కనిపించడకుండా ఉండేందుకు అలా కోరారట. అయితే నుదుటిపై చర్మం డీప్ గా తెగిపోయిందని, వాటికి స్టిచెస్ మాత్రమే వేయాలని ప్లాస్టిక్ సర్జరీ పనికి రాదని డాక్టర్స్ తనతో చెప్పారని విక్రమాదిత్య ఈ వీడియోలో వెల్లడించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన పలువురు బుల్లితెర ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు శ్రీవాణి త్వరగా కోలుకోవాలని కామెంట్స్ పెడుతున్నారు.

కాగా శ్రీవాణి, విక్రమాదిత్య ఇద్దరూ కలిసి భార్యాభర్తలుగా ఒక సీరియల్ లో నటించడానికి రెడీ అయ్యారట. అయితే ఇంతలోనే ఈ ప్రమాదం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశాడు విక్రమాదిత్య. ‘ ఇటీవలే మేం కొత్త నిర్ణయాలు తీసుకున్నాం. ఇద్దరూ కలిసి భార్యాభర్తలుగా ఒక సీరియల్ లో నటించడానికి కమిట్ అయ్యాం. ఇంతలోనే ఈ ప్రమాదం జరిగింది. అయితే వేంకటేశ్వరుడి దయ వలన ప్రమాదం నుంచి బయటపడ్డాం. ఆ దేవుడికి థ్యాంక్స్. అలాగే మా క్షేమం కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుకొంటున్నాం’ అని ఈ వీడియోలో చెప్పుకొచ్చాడు విక్రమాదిత్య.

ఇవి కూడా చదవండి

ప్రమాదానికి ముందు బతుకమ్మ వేడుకల్లో నటి శ్రీవాణి.. వీడియో

కాగా శ్రీవాణి, విక్రమాదిత్య ఇద్దరూ కలిసి యూట్యూబ్ ఛానెల్ ను స్టార్ట్ చేశారు. అందులో తమ పర్సనల్ లైఫ్ తో పాటు పలు ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంటున్నారు. వీరికి నెట్టింట భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న శ్రీవాణి.. వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.