Kalki: ప్రభాస్ ‘కల్కి’ విలన్‌కు ఇంత పెద్ద కూతురుందా? హీరోయిన్లు కూడా కుళ్లుకునే అందం.. ఫొటోస్ వైరల్

ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమాలో ఎంతో మంది స్టార్లు ప్రధాన పాత్రలు కనిపించారు. అలాగే చాలా మంది హీరోలు, దర్శకులు క్యామియో పాత్రల్లో మెరిశారు. ముఖ్యంగా కమల్ అసిస్టెంట్ కమాండర్ మానస్ పాత్రలో అద్భుతంగా నటించారు బెంగాళీ నటుడు స్వస్థ్ ఛటర్జీ.

Kalki: ప్రభాస్ 'కల్కి' విలన్‌కు ఇంత పెద్ద కూతురుందా? హీరోయిన్లు కూడా కుళ్లుకునే అందం.. ఫొటోస్ వైరల్
Saswata Chatterjee Family
Follow us
Basha Shek

|

Updated on: Oct 16, 2024 | 1:55 PM

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. ఈ ఏడాది రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఈ సినిమాల్లో ఇది కూడా ఒకటి. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ మైథాలజీ అండ్ ఫిక్షనల్ థ్రిల్లర్ కు ఏకంగా రూ.1000 కోట్లకు పైగానే వసూళ్లు వచ్చాయి. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ సినిమాకు భారీ వసూళ్లు వచ్చాయి. కల్కి సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్ గా నటించింది. అలాగే బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ, రాజేంద్ర ప్రసాద్, శోభన, పశుపతి, అన్నాబెన్, స్వస్త్ ఛటర్జీ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అలాగే మాళవికా నాయర్, మృణాళ్ ఠాకూర్, రామ్ గోపాల్ వర్మ, దుల్కర్ సల్మాన్, శ్రీనివాస్ అవసరాలు, ఫరియా అబ్దుల్లా, కేవీ అనుదీప్, విజయ్ దేవరకొండ క్యామియో పాత్రల్లో మెరిశారు. ఈ సినిమాలో మెయిన్ విలన్ సుప్రీ యాస్కిన్ గా కమల్ హాసన్ నటించాడు. అయితే మొదటి పార్ట్ లో కమల్ చాలా తక్కువ సేపు మాత్రమే కనిపించాడు. అదే సమయంలో కమల్ అసిస్టెంట్ కమాండర్ మానస్ చుట్టూనే ఈ సినిమా తిరుగుతుంది. ఈ పాత్రలో అద్భుతంగా నటించాడు బెంగాలీ యాక్టర్ స్వస్త్ ఛటర్జీ. ఈయనకు ఇదే మొదటి తెలుగు సినిమా. తండ్రి సుబేందు లానే సినిమాల్లోకి అడుగు పెట్టి యాక్టర్ అ‍య్యారు స్వస్త్. పలు బెంగాళీ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

అన్నట్లు స్వస్త్ ఛటర్జీ కూతురు హియా ఛటర్జీ కూడా త్వరలోనే సినిమాల్లోకి రాబోతుంది. ఇందుకోసం ఇప్పటికే రంగం సిద్ధం చేసుకుంటోందీ ముద్దుగుమ్మ. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తన బ్యూటిఫుల్ అండ్ గ్లామరస్ ఫొటోలను ఎప్పటికప్పుడు అందులో షేర్ చేస్తోంది. వీటిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

హియా ఛటర్జీ ఫ్యామిలీ ఫొటో..

View this post on Instagram

A post shared by Hiya (@hiyachatterjee03)

ఇక రీసెంట్ గా బాలి ట్రిప్ కు వెళ్లింది హియా ఛటర్జీ. అక్కడ ఏకంగా బికినీలో రెచ్చిపోయి పోజులిచ్చిందీ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టిట వైరలవుతున్నాయి. వీటిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు ‘కల్కి’ విలన్‌కి ఇంత పెద్ద కూతురు ఉందా అని ముక్కుమీద వేలేసుకుంటున్నారు.

బాలీ ట్రిప్ లో హియా ఛటర్జీ..

View this post on Instagram

A post shared by Hiya (@hiyachatterjee03)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.