OTT: ఈ సినిమా చూశాక బర్త్ డే పార్టీ చేసుకోవాలంటే భయపడతారు.. ఓటీటీలో ఈ సూపర్ థ్రిల్లర్‌ను అసలు మిస్ అవ్వద్దు

సాధారంగా బర్త్ డే పార్టీ అంటేనే ఎంతో ఉల్లాసంగా సెలబ్రేట్ చేసుకుంటారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులతో బాగా ఎంజాయ్ చేస్తారు. అయితే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమాను చూశాక బర్త్ డే పార్టీ చేసుకోవాలంటేనే భయపడిపోతారు.

OTT: ఈ సినిమా చూశాక బర్త్ డే పార్టీ చేసుకోవాలంటే భయపడతారు.. ఓటీటీలో ఈ సూపర్ థ్రిల్లర్‌ను అసలు మిస్ అవ్వద్దు
OTT Movie
Follow us
Basha Shek

|

Updated on: Oct 16, 2024 | 12:58 PM

థియేటర్లలో ప్లాఫ్ గా నిలిచిన కొన్ని సినిమాలు ఓటీటీలో మాత్రం అదరగొడుతుంటాయి. సిల్వర్ స్క్రీన్‌ పై పెద్దగా సక్సెస్ కానీ మూవీస్ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ లో మాత్రం భారీ వ్యూస్ దక్కించుకుంటుంటాయి. ముఖ్యంగా క్రైమ్, సస్పెన్స్, హార్రర్ థ్రిల్లర్ సినిమాలకు ఈ స్కోప్ ఎక్కువ ఉంటుంది. అలా కొద్ది రోజుల క్రితం థియేటర్లలో విడుదలై యావరేజ్ గా నిలిచిన ఒక తెలుగు సినిమా ఇప్పుడు ఓటీటీ ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంటోంది. అదే ది బర్త్ డే బాయ్. ఫ్రెండ్ షిప్ పేరుతో వేసే వెకిలి వేషాలు ఓ మనిషి నిండు ప్రాణాలను ఎలా బలి తీసుకున్నాయి అనే పాయింట్ ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. అయితే ఇందులోని ట్విస్టులు మాత్రం నెక్ట్స్ లెవెల్ లో ఉన్నాయి. అవే ఇప్పుడు ది బర్త్ డే బాయ్ సినిమాకు రికార్డ్ వ్యూస్ తెచ్చిపెడుతున్నాయి. విక్కీ దాసరి తెరకెక్కించిన ఈ సినిమాలో ప్ర‌మోదిని, వాకా మ‌ని, రాజా అశోక్‌, వెంక‌టేష్, సాయి అరుణ్‌, రాహుల్, సమీర్, రాజీవ్ కనకాల త‌దిత‌రులు ప్రధాన పాత్రలు పోషించారు. జులై 19న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ ప్రమోషన్లు లేకపోవడంతో పెద్దగా ఆడలేదు. అయితే ఆగస్టు 9 నుంచి ఈ మూవీ ఆహా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమాను చూసిన చాలా మంది తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. సినిమా సూపర్బ్ గా ఉందని, ఈ మూవీ చూశాక బర్త్ డే పార్టీ చేసుకోవాలంటేనే భయంగా ఉందంటూ కామెంట్స్ పెడుతున్నారు.

2016లో దర్శకుడు విక్కీ దాసరి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నప్పుడు తన జీవితంలో జరిగిన సంఘటననే కథగా మలిచి ది బర్త్ డే బాయ్ సినిమాను తెరకెక్కించారట. ఈ విషయాన్నే అతనే తన సినిమా ప్రమోషన్లలో చెప్పుకొచ్చాడు. పుట్టినరోజు వేడుకల్లో ఓ స్నేహితుడు ఎలా చనిపోయాడు? ఆ తర్వాత జరిగిన సంఘటనలేంటి? అనేదే ఈ సినిమా కథనం అయినప్పటికీ అంతర్లీనంగా రివేంజ్ డ్రామా కూడా ఉంది. అదే ఏంటన్నదే ఈ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. మరి థియేటర్లలో ది బర్త్ డే బాయ్ సినిమాను మిస్ అయ్యారా.? అయితే ఎంచెక్కా ఆహా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. మంచి థ్రిల్లింగ్ సినిమాలు చూసే వారికి ఇది ఒక మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.

ఇవి కూడా చదవండి

ఆహాలో ది బర్త్ డే బాయ్ స్ట్రీమింగ్..

ది బర్త్ డే బాయ్ ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి