AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లైకా’నా మజాకా.. నేరుగా వెళ్లి బ్యాగ్ పక్కన నిల్చుకున్న డాగ్.. ఓపెన్ చేసి చూడగా..

రైల్వే పోలీసుల కల్లుగప్పి ట్రైన్‌లో అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఓ వ్యక్తిని విశాఖ రైల్వే స్టేషన్‌లో సిటీ పోలీస్ నార్కోటిక్ ట్రైన్డ్ డాగ్ లైకా ఎట్టకేలకు పట్టుకుంది. ట్రైన్ ఆగిన వెంటనే కంపార్ట్‌మెంట్లలోకి వెళ్లిన లైకా నేరుగా గంజాయి తరలిస్తున్న వ్యక్తి వద్దకు వెళ్లింది. అతని బ్యాగ్‌ వద్ద ఆగి అరవడం మొదలుపెట్టింది. అది చూసిన అధికారులు బ్యాగ్ తనికీ చేయగా అందులో గంజాయి కనిపించింది. దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

లైకా'నా మజాకా.. నేరుగా వెళ్లి బ్యాగ్ పక్కన నిల్చుకున్న డాగ్.. ఓపెన్ చేసి చూడగా..
Andhra Crime News
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Mar 18, 2026 | 3:21 PM

Share

అప్పుడే విశాఖ రైల్వే స్టేషన్‌లోకి వచ్చిన 58502 నెంబర్‌ గల కిరండోల్ – విశాఖ పాసింజర్ ట్రైన్ ప్లాట్‌ఫామ్‌పై ఆగింది. రైలు ఆగిన వెంటనే సిటీ పోలీస్ నార్కోటిక్ టీం కు చెందిన ట్రైన్డ్ డాగ్ లైకా తన పని మొదలు పెట్టింది. కంపార్ట్ మెంట్లలో బ్యాగులు, లగేజీ ని వెరిఫై చేసుకుంటూ ముందుకు వెళ్తోంది. ఇంతలో ఓ సీటు దగ్గర ఆగి.. అక్కడ ఓ బ్యాగ్‌ను అదేపనిగా చూస్తూ ఉండిపోయింది. ఎక్కడో అనుమానం వచ్చి ఒక్కసారిగా అరవడం స్టార్ట్ చేసింది. అక్కడే ఉన్న హ్యాండ్లర్.. బ్యాగ్ ను ఓపెన్ చేసి చూశాడు. అంతే అందులో సుమారు 6 కేజీల గంజాయి బయటపడింది. దీంతో గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పీఎస్‌కు తరలించారు.

లైకా.. బెల్జియన్ మాలినోయిస్ జాతికి చెందిన జాగలం. విశాఖ సిటీ పోలీస్ నార్కోటిక్ టీంలో ఐదు నెలల క్రితం చేరింది. మొత్తం ఏడు జాగిలాల్లో లైకా కూడా ఒకటి. శిక్షణ సక్సెస్ ఫుల్‌గా పూర్తి చేసుకున్న లైకా ప్రస్తుతం విశాఖ నార్కోటిక్ టీంలో తన పని ప్రారంభించింది. ఇందులో భాగంగానే రైల్వే స్టేషన్‌లో జరిగిన తనిఖీల్లో పాల్గొని గంజాయి పసిగట్టి పట్టించింది. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలు నియంత్రించడంలో కీలకంగా పని చేస్తోంది లైకా.

రైల్లో గంజాయి స్మగ్లింగ్‌ను బయటపెట్టి పట్టించిన లైకాను  విశాఖ సీపీ బాగ్చి అభినందించారు. లైకాతో పాటు డాగ్ హ్యాండ్లర్ ను ప్రత్యేకంగా అప్రిషియేట్ చేశారు. సీపీ చొరవతో కలెక్టర్ హరేందిర ప్రసాద్, జీవిఎంసికమిషనర్ సహకారంతో నార్కోటిక్స్ లో అదనపు శిక్షణ పొందిన డాగ్ స్క్వాడ్ బృందాన్ని రంగంలోకి దించామని అంటున్నారు అధికారులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఇంటిల్లిపాదీ ఉదయాన్నే ఒక కప్పు తింటే చాలు.. ఎండాకాలం తిరుగుండదు
ఇంటిల్లిపాదీ ఉదయాన్నే ఒక కప్పు తింటే చాలు.. ఎండాకాలం తిరుగుండదు
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు.. తులా రాశి వారికి ఇలా..
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు.. తులా రాశి వారికి ఇలా..
దువ్విన ప్రతిసారి జుట్టు రాలుతుందా.. జాగ్రత్త ఆ వ్యాధికి సంకేతం
దువ్విన ప్రతిసారి జుట్టు రాలుతుందా.. జాగ్రత్త ఆ వ్యాధికి సంకేతం
ఐటీఆర్‌లో చేసే ఈ చిన్న పొరపాటుకు భారీ షాక్.. 200 శాతం జరిమానా!
ఐటీఆర్‌లో చేసే ఈ చిన్న పొరపాటుకు భారీ షాక్.. 200 శాతం జరిమానా!
ఉగాది పచ్చడి ఎందుకు తప్పనిసరిగా తినాలి? ఎన్ని రోజులు తినొచ్చంటే
ఉగాది పచ్చడి ఎందుకు తప్పనిసరిగా తినాలి? ఎన్ని రోజులు తినొచ్చంటే
ఆన్‌లైన్‌లో చికెన్ కొంటున్నారా..? మంచి మాంసాన్ని ఇలా ఈజీగా..
ఆన్‌లైన్‌లో చికెన్ కొంటున్నారా..? మంచి మాంసాన్ని ఇలా ఈజీగా..
మిండియాకు పట్టిన దరిద్రం అదే.. అశ్విన్ షాకింగ్ కామెంట్స్..!
మిండియాకు పట్టిన దరిద్రం అదే.. అశ్విన్ షాకింగ్ కామెంట్స్..!
నేరుగా వెళ్లి బ్యాగ్ పక్కన నిల్చుకున్న డాగ్.. ఓపెన్ చేసి చూడగా
నేరుగా వెళ్లి బ్యాగ్ పక్కన నిల్చుకున్న డాగ్.. ఓపెన్ చేసి చూడగా
కేవలం రూ.50 వేల పెట్టుబడి.. నెలకు రూ.7.50 లక్షల లాభం..
కేవలం రూ.50 వేల పెట్టుబడి.. నెలకు రూ.7.50 లక్షల లాభం..
వరంగల్ జిల్లాను టార్గెట్ చేసి వణికిస్తున్న ఆకతాయిలు..!
వరంగల్ జిల్లాను టార్గెట్ చేసి వణికిస్తున్న ఆకతాయిలు..!