AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఏపీలో కొత్త పథకం ప్రారంభం.. వీరికి కూడా ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ.. నేటి నుంచే..

ఏపీలోని దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం మార్చి 18 నుంచి అందుబాటులోకి వచ్చింది. ఈ పథకాన్ని మంగళగిరిలో సీఎం చంద్రబాబు ప్రారంభించారు. దివ్యాంగ శక్తి పేరుతో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. పథకం ప్రారంభం సందర్భంగా పల్లెవెలుగు బస్సులో చంద్రబాబు ప్రయాణించారు.

Andhra Pradesh: ఏపీలో కొత్త పథకం ప్రారంభం.. వీరికి కూడా ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ.. నేటి నుంచే..
Chandrababu
Venkatrao Lella
|

Updated on: Mar 18, 2026 | 1:11 PM

Share

ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని సీఎం చంద్రబాబు బుధవారం ప్రారంభించారు. గుంటూరు జిల్లా మంగళగిరి బస్టాండ్‌లో ఈ పథకాన్ని లాంచ్ చేశారు. ఈ సందర్భంగా బస్టాండ్ నుంచి దివ్యాంగులతో కలిసి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్ బస్సులో ప్రయాణించారు. సుమారు 11 కిమీ మేర వీరి ప్రయాణం సాగింది. మంగళగిరి నుంచి పెనుమాక వరకు దివ్యాంగులతో కలిసి నేతల ప్రయాణం చేశారు. పథకం ప్రారంభం సందర్భంగా పెద్ద ఎత్తున  ప్రజలు, కూటమి పార్టీల కార్యకర్తలు, లబ్దిదారులు తరలివచ్చారు. ప్రజా ప్రభుత్వం వచ్చాక దివ్యాంగులకు అందుతున్న సంక్షేమ పథకాలు, వారి బాగోగుల గురించి సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. దివ్యాంగులతో మాట్లాడుతూ వారి కష్టసుఖాలు తెలుసుకుంటూ పల్లె వెలుగు బస్సులో ప్రయాణించారు. డాన్ బాస్కో స్కూల్ మీదుగా డోలాస్ నగర్, ప్రకాశ్ నగర్, నులకపేట, ఉండవల్లి సెంటర్ మీదుగా పెనుమాక బస్టాప్‌కు  బస్సు చేరుకుంది.

ఐదు రకాల బస్సుల్లో అవకాశం

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఇప్పటికే బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నారు. అయితే దివ్యాంగులకు ఇప్పటివరకు ఆర్టీసీ బస్సుల్లో 50 శాతం రాయితీ కల్పిస్తోండగా.. ఇకపై ఉచితంగా ప్రయాణించే సౌకర్యం అందుబాటులోకి తీసుకురావాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. గత నెలలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయానికి ఆమోదముద్ర వేశారు. అనంతరం మార్చి 18 నుంచి ప్రారంభించారు. అందరికీ సమాన అవకాశాలు అందించేలా దివ్యాంగుల ప్రయాణాన్ని సులభతరం చేస్తూ వారిలో ఆత్మవిశ్వాసం నింపేలా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ పథకం ద్వారా ఏపీఎస్ఆర్టీసీలోని సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్, పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణం అందుబాటులోకి వచ్చింది. 21 కేటగిరీల్లో 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం కలిగిన దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు. వారి వెంట వచ్చే సహాయకులతో కలిపి 12.76 లక్షల మంది లబ్దిదారులకు ప్రయోజనం కలగనుంది. ఈ పథకం కోసం ఏటా రూ.207 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు.

స్త్రీ శక్తి స్కీమ్ సక్సెస్

దివ్యాంగుల్లో సామాజిక భాగస్వామ్యాన్ని పెంచేందుకు కూటమి ప్రభుత్వం ఈ అవకాశం కల్పిస్తోంది. కాగా స్త్రీ శక్తి పథకంతో రాష్ట్రంలో మహిళలకు ఆర్ధిక వెసులు బాటు, సాధికారత కల్పించింది. గతేడాది ఆగస్ట్ 15న స్త్రీశక్తి పథకం ప్రారంభిస్తే… ఈ మార్చి 15 నాటికి… అంటే 7 నెలల్లో 52 కోట్ల ప్రయాణాలు మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారు. దీనికి ఇప్పటికి రాష్ట్ర ప్రభుత్వం రూ.1,826 కోట్లు రాయితీ భరించింది.

Follow Us
దేవేంద్ర ప్రధాన్ కృషి వలనే నేడు ఒడిశాలో బీజేపీ బలంగా ఎదిగింది..
దేవేంద్ర ప్రధాన్ కృషి వలనే నేడు ఒడిశాలో బీజేపీ బలంగా ఎదిగింది..
ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణం.. కొత్త పథకం ప్రారంభం
ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణం.. కొత్త పథకం ప్రారంభం
మరణం అంచుకు చేరే ప్రతి క్షణం పెద్ద నరకం.. వృద్ధాప్య సవాళ్లు
మరణం అంచుకు చేరే ప్రతి క్షణం పెద్ద నరకం.. వృద్ధాప్య సవాళ్లు
మీ పుట్టినతేదీని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు.. ఎలా అంటే?
మీ పుట్టినతేదీని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు.. ఎలా అంటే?
కేవలం 2 బంతుల్లోనే హ్యాట్రిక్ కొట్టిన మ్యాజిక్ స్పిన్నర్
కేవలం 2 బంతుల్లోనే హ్యాట్రిక్ కొట్టిన మ్యాజిక్ స్పిన్నర్
అప్పట్లో అమ్మాల డ్రీమ్ బాయ్.. రోజాతో ఎక్కువ సినిమాలు చేసిన హీరో..
అప్పట్లో అమ్మాల డ్రీమ్ బాయ్.. రోజాతో ఎక్కువ సినిమాలు చేసిన హీరో..
ఆ స్టార్ హీరో బావ అని పిలిచేవాడు.. చుట్టూ ఉన్నవాళ్లే..
ఆ స్టార్ హీరో బావ అని పిలిచేవాడు.. చుట్టూ ఉన్నవాళ్లే..
లైక్స్ కావలి అంటే ప్రాణాలు పోవాల్సిందేనా ??
లైక్స్ కావలి అంటే ప్రాణాలు పోవాల్సిందేనా ??
ఇది పెళ్లా లేక ఉట్టి కొట్టే పోటీలా? గాలిలో తేలుతూ వధూవరుల వరమాల
ఇది పెళ్లా లేక ఉట్టి కొట్టే పోటీలా? గాలిలో తేలుతూ వధూవరుల వరమాల
కళ్ల కింద నలుపు చిటికెలో మాయం.. ఇలా చేస్తే 2 రోజుల్లో
కళ్ల కింద నలుపు చిటికెలో మాయం.. ఇలా చేస్తే 2 రోజుల్లో