AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actor : 90’sలో అమ్మాయిల కలల రాకుమారుడు.. ఇప్పుడు సినిమాలకు దూరంగా.. ఇన్నాళ్లకు కారణం చెప్పిన స్టార్ హీరో..

ఒకప్పుడు తెలుగులో తోపు హీరో. 90లలో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో తనదైన ముద్ర వేశారు. అప్పట్లో ఆమని, రోజా వంటి స్టార్ హీరోయిన్లతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. టాప్ హీరోగా ఉన్న సమయంలోనే అనుహ్యంగా సినిమాలకు గుడ్ బై చెప్పేశారు. చాలా కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈ హీరో .. తాజాగా ఆసక్తికర కామెంట్స్ చేశారు.

Actor : 90'sలో అమ్మాయిల కలల రాకుమారుడు.. ఇప్పుడు సినిమాలకు దూరంగా.. ఇన్నాళ్లకు కారణం చెప్పిన స్టార్ హీరో..
Vinod Kumar
Rajitha Chanti
|

Updated on: Mar 18, 2026 | 1:01 PM

Share

సీనియర్ హీరో వినోద్ కుమార్ గుర్తున్నారా..? తెలుగులో దాదాపు 110కి పైగా సినిమాల్లో నటించారు. తమిళం, మలయాళం, కన్నడ భాషలలోనూ కనిపించారు. 1985లో విడుదలైన కన్నడ చిత్రం తవరు మనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత మౌన పోరాటం, మామగారు, కర్తవ్యం, భారత్ బంద్ వంటి చిత్రాలతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 1991 లో మామగారు సినిమాకు గాను ఉత్తమ సహాయనటుడిగా నంది అవార్డు అందుకున్నారు. అప్పట్లో ఆయనకు అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువే. తెలుగులో అనేక చిత్రాల్లో నటించి హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. అనుహ్యంగా సినిమాలకు దూరమయ్యారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్, సినిమాలకు దూరంగా ఉండడటానికి కారణాలను వెల్లడించారు.

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఆమెకు 15.. అతడికి 24.. పదేళ్లుగా సీక్రెట్ లవ్.. కట్ చేస్తే.. భార్యభర్తలుగా ఒక్కటైన హీరోహీరోయిన్..

తాను ఎప్పుడూ అవకాశాల కోసం పరిగెత్తలేదని, మంచి పాత్రలు వస్తేనే స్వీకరించానని తెలిపారు. తనకు ప్రత్యేకంగా మేనేజర్ ఎవరూ లేరని, మద్రాసులో జగన్మోహన్ అనే పిఆర్ఏ తన డేట్స్ చూసుకునేవారని, హైదరాబాద్‌కు మారిన తర్వాత అందరూ నేరుగా తనకే ఫోన్ చేసి డేట్స్ ఇచ్చేవారని చెప్పారు. తనను తాను “డైరెక్టర్స్ మ్యాన్”, “ప్రొడ్యూసర్స్ మ్యాన్”గా భావించినట్లు తెలిపారు. తన కెరీర్‌లో 110 తెలుగు సినిమాలు సహా మొత్తం 150కి పైగా చిత్రాలు చేసినప్పటికీ, నటుడిగా సంపాదించిన దానికంటే రియల్ ఎస్టేట్ ద్వారానే ఎక్కువ ఆర్థిక స్థిరత్వాన్ని పొందానని వినోద్ కుమార్ వెల్లడించారు. సినీ రంగం శాశ్వత వృత్తి కాదని ముందే గ్రహించి, రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించానని తెలిపారు. ఈ పెట్టుబడులు డబుల్, త్రిపుల్ అయ్యాయని పేర్కొన్నారు. బెంగళూరులో తన కజిన్స్‌తో కలిసి “హై ఎండ్ గ్రూప్” ఏర్పాటు చేసి, లిటిగేషన్ భూములను సెటిల్ చేయడం, డాక్యుమెంట్లు సరిచేయడం వంటి వ్యాపారం చేశామని, కొన్ని డీల్స్ తర్వాత ఆ వ్యాపారాన్ని విరమించుకున్నామని తెలిపారు. ప్రస్తుతం తమ సొంత ప్రాపర్టీలలోనే నిర్మాణాలు చేపట్టి కొత్త ఐడియాలతో ముందుకు వెళ్తున్నామని వివరించారు.

ఎక్కువమంది చదివినవి : Appa Rao: ఆ సినిమా సమయంలో చేసిన పని.. నా ఫేస్ మొత్తం బ్లాక్ అయ్యింది.. జబర్దస్త్ అప్పారావు..

ప్రస్తుతం హైదరాబాద్‌లో బంజారా హిల్స్‌లో నివసిస్తున్నానని, బెంగళూరులో సొంత ఇల్లు, ముంబైలో ఒక ఫ్లాట్, చెన్నైలో చిన్న ఫ్లాట్ ఉన్నాయని చెప్పారు. తనకు అత్యంత ఇష్టమైన వైజాగ్ నగరంలో ఒకప్పుడు ఫ్లాట్ ఉండేదని, మౌన పోరాటం సినిమా షూటింగ్ సమయంలో బీచ్ పక్కన కొన్నానని, అయితే ప్రయాణించలేకపోవడంతో ఆరు-ఏడు సంవత్సరాల క్రితం విక్రయించేశానని తెలిపారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున వంటి వారు వేరే రేంజ్‌లో ఉన్నారని, శ్రీకాంత్, జగత్ బాబు, సుమన్, రాజేంద్ర ప్రసాద్, సురేష్, భానుచందర్ వంటి వారు తన జనరేషన్‌కు చెందిన వారని పేర్కొన్నారు. అయితే తాను ఎవరినీ పోటీగా భావించలేదని, ఎవరూ తన పోటీదారులు కారని స్పష్టం చేశారు. తనకు ఒక గాడ్‌ఫాదర్ అంటూ ఎవరూ లేకపోయినా, రామోజీరావు, దాసరి, వడిరామా కృష్ణ, మోహన్ గాంధీ వంటి ప్రముఖుల మద్దతు లభించిందని చెప్పారు. తాను ఎక్కువ చిత్రాలు హీరోయిన్ రోజాతో (సుమారు 10 సినిమాలు) చేశానని, విజయశాంతి, ఆమని, రమ్యకృష్ణ, నదియా, ప్రవీణ టండన్, ఖుష్బూ వంటి వారితోనూ కలిసి పనిచేశానని గుర్తు చేసుకున్నారు. తన 13 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని గోల్డెన్ పీరియడ్‌గా అభివర్ణించారు. తెలుగు ప్రజలన్నా, హైదరాబాద్ నగరమన్నా తనకు ఎంతో ఇష్టమని, బెంగళూరు కూడా బెస్ట్ సిటీ అని పేర్కొన్నారు. తన ప్రయాణంలో ఎప్పుడూ పశ్చాత్తాపపడలేదని, అయితే రెండు అడ్వాన్స్ తీసుకున్న సినిమాలు సూపర్ హిట్ అవ్వడం, తాను చేయలేకపోవడం బాధించిందని చివరగా తెలిపారు.

Vinod Kumar News

Vinod Kumar News

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఎంతో కష్టపడి కట్టుకున్న ఇల్లును సుడిగాలి సుధీర్‏కు అమ్మేశా.. టాలీవుడ్ నటుడు..

Follow Us