క్లీన్ లుక్స్ తో షేక్ చేస్తున్న అషు రెడ్డి.. ఏంటి బాసు ఒక్క సారిగా ఈ మార్పు
29 May 2026
Pic credit - Instagram
Phani Ch
అషు రెడ్డి ఎప్పటికప్పడు హాట్ డోస్ దట్టించడమే కాదు తన లోని డిఫరెంట్ యాంగిల్స్ చూపిస్తూ నెటిజన్లను ఆశ్చర్య పరుస్తోంది.
బుల్లితెర బ్యూటీ అషురెడ్డి గ్లామర్ షో విషయంలో అస్సలు వెనుకాడదు. టిక్ టాక్ వీడియోలతో ఫేమస్ అయిన ఈ బ్యూటీ.. అప్పట్లో జూనియర్ సమంతగా వార్తల్లో నిలిచేది.
అషు రెడ్డి స్వస్థలం విశాఖపట్నం అయినా తండ్రి ఉద్యోగరీత్యా అమెరికాలో స్థిరపడింది. అయితే అమెరికాలో స్థిరపడినా ఆమెకు నటన మీద ఉన్న మక్కువతో ఇండియా కు వచ్చేసింది.
ఎలా అయినా సినీ పరిశ్రమలో వెలిగిపోవాలని హైదరాబాద్ వచ్చిన ఆమె తెలుగులో ఛల్ మోహన రంగ లో మేఘా ఆకాష్ కు ఫ్రెండ్ క్యారెక్టర్ చేసింది.
అటు తర్వాత ‘బిగ్ బాస్ సీజన్ 3’ లో ఎంట్రీ ఇచ్చి అందరికీ షాకిచ్చింది. ఎందుకంటే ఆ టైంలో ఈమె కొంచెం బొద్దుగా మారిపోయింది.
అషు రెడ్డి తాజాగా కొన్ని వివాదాల్లో చిక్కుకున్న విషయం అందరికి తెలిసిందే.. అయితే ఎవరూ ఊహించని విధంగా తనకు 'ఎంగేజ్మెంట్' అంటూ కొన్ని ఫోటోస్ సోషల్ మీడియా లో పోస్ట్ చేసి అందరికి షాక్ ఇచ్చింది.
ఫొటోలు షేర్ చేస్తూ కెమెరా ఎమోజీ తప్ప మరే క్యాప్షన్ పెట్టకపోవడం గమనార్హం. అయితే అషు రెడ్డికి నిజంగానే నిశ్చితార్థం జరిగిందా.? లేక ఏదైనా మూవీ షూటింగ్ లో స్టిల్స్ షేర్ చేసిందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.