‘మానవీయ’ కోణంలో ఆలోచిస్తూ సుప్రీం సంచలన తీర్పులు.. శృంగార వర్కర్లపై కీలక తీర్పు
అప్పుడప్పుడు సంచలన తీర్పులు ఇవ్వడం వేరు.. సంచలనాలకే కేరాఫ్‌గా మారడం వేరు. సుప్రీంకోర్టు అదే దారిలో వెళ్తున్నట్టు కనిపిస్తోంది. 'వ్యభిచారం నేరం కాదు' అని మరోసారి గట్టిగా కామెంట్ చేసింది. సెక్స్ వర్కర్స్ విషయమనే కాదు.. ఈమధ్య 'మానవీయ' కోణంలో ఆలోచించి వరుస సంచలన తీర్పులు, పాసింగ్ కామెంట్స్ చేస్తూ వెళ్తోంది సుప్రీం కోర్ట్.

చట్టం అంటే చాలామందికి వెంటనే గుర్తొచ్చేవి.. కోర్టు గదులు, సెక్షన్లు, న్యాయవాదుల వాదనలు, తీర్పులు. కానీ భారత న్యాయవ్యవస్థ.. ముఖ్యంగా సుప్రీంకోర్టు, హైకోర్టులు ఇటీవలి కాలంలో ఇస్తున్న తీర్పులు చూస్తే.. న్యాయస్థానం అనేది కేవలం వివాదాల పరిష్కార కేంద్రం మాత్రమే కాదని స్పష్టమవుతోంది. సమాజంలో మార్పు తీసుకురాగలిగే ఒక శక్తివంతమైన వ్యవస్థగా కోర్టులు మారుతున్నాయి. ప్రజల జీవితాలను నేరుగా ప్రభావితం చేసే అంశాలపై స్పష్టమైన సందేశాలు ఇస్తూ.. చట్టం వెనుక ఉన్న మానవతా కోణాన్ని బయటపెడుతున్నాయి. శృంగార వర్క్‌పై స్పష్టత.. “స్వచ్ఛందమైతే నేరం కాదు” సెక్స్ వర్కర్లు, మానవ అక్రమ రవాణా అంశాలపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. వ్యభిచారం అనే పదాన్ని సమాజం ఇప్పటికీ ఒక నేర భావనతోనే చూస్తున్న సమయంలో.. “స్వచ్ఛందంగా శృంగార వర్క్ చేయడం నేరం కాదు” అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 18 ఏళ్లు దాటిన వ్యక్తికి తన వృత్తిని ఎంచుకునే హక్కు ఉందని, జీవనం కోసం తన శరీరాన్నే ఆధారంగా చేసుకోవడంలో తప్పేమీ లేదని కోర్టు పేర్కొంది. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఇచ్చిన వ్యక్తిగత స్వేచ్ఛ హక్కులో భాగమేనని అభిప్రాయపడింది. అలాగే ఎక్కడైనా రెయిడ్లు జరిగినప్పుడు.. మహిళలు స్వచ్ఛందంగా శృంగార వర్క్ చేస్తున్నారని తేలితే వారిని పోలీస్ స్టేషన్‌లకు తీసుకెళ్లడం, బెదిరించడం, కేసులు పెట్టడం సరికాదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అయితే అదే సమయంలో.. మహిళలను మోసం చేసి, బలవంతంగా వ్యభిచారంలోకి నెట్టడం మాత్రం తీవ్రమైన నేరమని,...
