AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ranveer Singh: దీపిక చుట్టూ అల్లుకుంటున్న రణ్‌వీర్‌ వివాదం

Ranveer Singh: దీపిక చుట్టూ అల్లుకుంటున్న రణ్‌వీర్‌ వివాదం

Dr. Challa Bhagyalakshmi
| Edited By: |

Updated on: May 29, 2026 | 5:26 PM

Share

రణ్‌వీర్ సింగ్ ‘డాన్ 3’ వివాదం బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారగా, ఇప్పుడు దీపిక పదుకొణె పేరు కూడా ఇందులో వినిపిస్తోంది. గతంలో కొన్ని ప్రాజెక్టుల నుంచి దీపిక తప్పుకున్న ఘటనలను గుర్తుచేస్తూ సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. ప్రాజెక్ట్‌లకు సైన్ చేసే ముందు స్పష్టత అవసరమని, మధ్యలో తప్పుకోవడం నిర్మాతలకు ఇబ్బందులు కలిగిస్తుందని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

రణ్‌వీర్‌ పేరు పాపప్‌ అయిన ప్రతిసారీ జోడీగా దీపిక పేరు కూడా పాపరాజీల కంటపడుతోంది. మొన్నామధ్య ధురంధర్‌ సక్సెస్‌ టైమ్‌లోనూ అంతే. ఇప్పుడు డాన్‌3 విషయంలో రణ్‌వీర్‌ వైరల్‌ అవుతున్న వేళా అంతే.. ఇంతకీ ఇప్పుడు దీపికను ఎందుకు ప్రస్తావిస్తున్నారు? ఏ విషయంతో లింకు పెట్టారు? ధురంధర్‌ సినిమా సక్సెస్‌ చూసి తట్టుకోలేనివాళ్లే రణ్‌వీర్‌ మీద దుమ్మెత్తిపోస్తున్నారంటోంది ఓ వర్గం. విషయం ఏదైనా రణ్‌వీర్‌ మీద బ్యాన్‌ మాత్రం ఎత్తేసే ప్రసక్తే లేదు. ఆయన సమాధానం చెప్పాల్సిందేనంటోంది ఫెడరేషన్‌. ధురంధర్‌ సక్సెస్‌ వేళ దీపిక ఎందుకు పోస్ట్ పెట్టలేదని ప్రశ్నించిన ఇంకొందరు.. ఇప్పుడు డాన్‌3 ఇష్యూలోనూ ఆమెను ప్రస్తావిస్తున్నారు. డాన్‌3 నుంచి రణ్‌వీర్‌ సడన్‌ ఎగ్జిట్‌ కావడం గురించి నార్త్ లో దుమారం రేగుతోంది. ఇప్పుడు రణ్‌వీర్‌ ఎగ్జిట్‌ కావడం కాదు… గతంలో రేస్‌ 2 నుంచి దీపిక కూడా ఇలాగే వెళ్లిపోయారని గుర్తుచేసుకుంటున్నారు నార్త్ జనాలు. ఆరు రోజులు షూట్‌ చేశాక చెప్పా పెట్టకుండా ప్రాజెక్ట్ నుంచి ఎగ్జిట్‌ కావడం, నిర్మాతలు గగ్గోలు పెడితే పలు రకాల షరతులు పెట్టి రీజాయిన్‌ కావడం అప్పట్లో టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయింది. ఈ మధ్య స్పిరిట్‌, కల్కి2 నుంచి కూడా తప్పుకున్నారు దీపిక. ప్రాజెక్టులకు సైన్‌ చేయడానికి ముందే ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి. ఇలా సడన్‌ డిసిషన్స్ తీసుకుని మిగిలిన వారిని ఇబ్బందులపాలు చేయకూడదని అంటున్నారు మేకర్స్ వైపువారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Aadhaar App: ఆధార్‌ పై కీలక నిర్ణయం.. పాత ‘ఎమ్‌ఆధార్’ యాప్ బంద్

TTD: శ్రీవారి భక్తులకు భారీ ఊరట ఇక.. క్యూలైన్‌లో ఉండే పని లేదు

షాక్‌లో సినీ డైరెక్టర్లు! 66 హార్డ్ డిస్క్‌లు మాయం

Peddi: పెద్ది దుబాయ్ సెన్సార్ టాక్ మామూలు కాదు.. చరణ్ కెరీర్‌లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ అంటారా

అంతరిక్షంలో మనిషి పుట్టుకకు తొలి అడుగు.. చైనా సంచలన ప్రయోగం వెనక అసలు కథ

Follow Us