AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhaar App: ఆధార్‌ పై కీలక నిర్ణయం.. పాత ‘ఎమ్‌ఆధార్’ యాప్ బంద్

Aadhaar App: ఆధార్‌ పై కీలక నిర్ణయం.. పాత ‘ఎమ్‌ఆధార్’ యాప్ బంద్

Phani CH
|

Updated on: May 29, 2026 | 4:47 PM

Share

ఆధార్ వినియోగదారుల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త ‘ఆధార్’ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. త్వరలో పాత ఎమ్-ఆధార్ యాప్‌ను నిలిపివేయనున్నారు. కొత్త యాప్‌లో క్యూఆర్ కోడ్ వెరిఫికేషన్, ఫేస్ అథెంటికేషన్, బయోమెట్రిక్ లాక్ వంటి ఆధునిక భద్రతా ఫీచర్లు ఉన్నాయి. అలాగే మైఆధార్ పోర్టల్‌లో ఉచితంగా వివరాల అప్‌డేట్ గడువును 2027 జూన్ 14 వరకు పొడిగించారు.

స్మార్ట్‌ఫోన్లలో ఆధార్ సేవలను ఉపయోగించే పౌరుల కోసం కేంద్ర ప్రభుత్వం కీలక మార్పును ప్రకటించింది. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న పాత ‘ఎమ్-ఆధార్’ యాప్‌ను త్వరలోనే పూర్తిగా నిలిపివేయనున్నారు. దీని స్థానంలో మరింత భద్రత, ఆధునిక ఫీచర్లతో కూడిన సరికొత్త ‘ఆధార్’ యాప్‌ను భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ అధికారికంగా అందుబాటులోకి తెచ్చింది. వినియోగదారులు వెంటనే కొత్త యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని ప్రభుత్వం కోరింది. పాత యాప్‌తో పోలిస్తే కొత్త యాప్‌లో డేటా ప్రైవసీకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. హోటళ్లు, ఆసుపత్రులు లేదా ప్రభుత్వ కార్యాలయాల్లో వెరిఫికేషన్ కోసం ఇకపై పూర్తి వివరాలను చూపించాల్సిన అవసరం లేదు. కేవలం యాప్‌లోని సురక్షిత క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా అవసరమైన సమాచారాన్ని మాత్రమే షేర్ చేయవచ్చు. అలాగే ఎస్ఎంఎస్ ఓటీపీలతో పాటు అదనపు రక్షణ కోసం ఫేస్ అథెంటికేషన్, బయోమెట్రిక్ లాక్ వంటి అదనపు భద్రతా లేయర్లను ఇందులో చేర్చారు. యాప్ మార్పుతో పాటు ఆధార్ వినియోగదారులకు మరో తీపి కబురు అందించింది. ‘మైఆధార్’ పోర్టల్‌లో ఉచితంగా ఐడెంటిటీ, అడ్రస్ డాక్యుమెంట్లను ఆన్‌లైన్‌ ద్వారా అప్‌డేట్ చేసుకునే గడువును పొడిగించింది. నిజానికి ఈ ఉచిత సేవలు 2026 జూన్ 15 వరకే అందుబాటులో ఉండాల్సి ఉంది. కానీ తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం పౌరులు తమ వివరాలను 2027 జూన్ 14 వరకు ఎలాంటి రుసుము లేకుండా ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ ద్వారా అధికారిక కొత్త యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TTD: శ్రీవారి భక్తులకు భారీ ఊరట ఇక.. క్యూలైన్‌లో ఉండే పని లేదు

షాక్‌లో సినీ డైరెక్టర్లు! 66 హార్డ్ డిస్క్‌లు మాయం

Peddi: పెద్ది దుబాయ్ సెన్సార్ టాక్ మామూలు కాదు.. చరణ్ కెరీర్‌లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ అంటారా

అంతరిక్షంలో మనిషి పుట్టుకకు తొలి అడుగు.. చైనా సంచలన ప్రయోగం వెనక అసలు కథ

పొట్ట ఉబ్బిపోయి కదల్లేకుండా.. కనిపించిన కొండచిలువ.. అడవిలో షాకింగ్ సీన్ వైరల్

Follow Us